Shamshabad Highway: భారీ అగ్నిప్రమాదం..క్షణాల్లో కారు దగ్ధం.!
Publish Date:Sep 27, 2026
Advertisement
శంషాబాద్ వద్ద హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై ఊహించని ఘటన చోటుచేసుకుంది. హైవేపై వెళ్తున్న ఓ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కారు నుంచి మంటలు, పొగ రావడాన్ని గమనించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమ య్యాడు. పరిస్థితిని గమనించి కారును రోడ్డు పక్కన ఆపి వెంటనే కిందకు దిగిపోయాడు. దీంతో డ్రైవర్ సురక్షితంగా బయటపడటంతో పెను ప్రమాదం తప్పింది. [ Shamshabad Highway, Massive fire, Bangalore National Highway, Car fire, Car Accident, Vehicle Fire, Car Blaze, Shamshabad Car Fire, Highway Fire, RGI Airport Police, RGI Police, Fire Accident, Traffic Jam, Hyderabad Traffic ]
డ్రైవర్ కారు నుంచి బయటకు వచ్చిన కొద్దిసే పటికే మంటలు క్రమంగా తీవ్రరూపం దాల్చాయి. చూస్తుండగానే మంటలు కారు మొత్తం వ్యాపిం చాయి. కళ్లముందే కారు మంటల్లో పూర్తిగా కాలిపోవడంతో అక్కడి పరిస్థితి ఒక్కసారిగా ఆందోళనకరంగా మారింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతూ ఉండడం తో దట్టమైన పొగలు ఆ ప్రాంతం మొత్తం వ్యాపిం చాయి.
దీంతో హైవేపై వాహనాల రాకపోకలకు కొద్దిసేపు అంతరాయం ఏర్పడింది. అక్కడ భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. సమాచారం అందుకున్న ఆర్జీఐఏ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అదే సమయంలో ఫైర్ సిబ్బంది కూడా హుటా హుటిన అక్కడికి చేరు కుని ఫైర్ ఇంజన్లతో మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకువ చ్చారు. అయితే అప్పటికే మంటల్లో కారు పూర్తిగా దగ్ధమైంది. ప్రాథమికంగా కారులో షార్ట్ సర్క్యూట్ కారణంగానో, ఇంజన్ వేడెక్కడం వల్లనో మంటలు చెలరేగి ఉండ వచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనకు గల పూర్తి కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. హైవేపై అకస్మాత్తుగా చోటుచేసు కున్న ఈ అగ్నిప్రమాదంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
http://www.teluguone.com/news/content/shamshabad-highway-25-232698.html




