ఉపాధి కోసం దుబాయ్ వెళ్లిన భారతీయ కార్మికుల జీవితాల్లో ఊహించని విషాదం చోటుచేసుకుంది. దుబాయ్‌లో సోమవారం (జూన్ 8) జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు భారతీయులు దుర్మరణం పాలయ్యారు. నిత్యం రద్దీగా ఉండే దుబాయ్ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. సాంకేతిక లోపంతో వల్ల ఒక భారీ ట్రక్కు అకస్మాత్తుగా రోడ్డు మధ్యలో నిలిచిపోవడంతో.. అదే సమయంలో వెనుక నుంచి కార్మికులతో వస్తున్న ఒక మినీబస్సు.. ఆగి ఉన్న ట్రక్కును ఢీకొంది. కార్మికుల బస్సును డ్రైవర్ అతి వేగంగా నడపడం, వేగాన్ని నియంత్రించ లేకపోవడమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.
సమాచారం అందుకుని సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, సహాయక బృందాలు క్షతగాత్రులనుర హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. వారిలో ఐదుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రమాద ఘటనపై దుబాయ్‌లోని భారత రాయబార కార్యాలయం దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. మరణించిన వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. అన్ని విధాలుగా అండగా ఉంటామని పేర్కొన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/seven-indians-killed-in-road-accident-36-222291.html
చాట్‌జీపీటీ చరిత్రలోనే అతిపెద్ద మార్పుకు ఓపెన్ఏఐ శ్రీకారం చుట్టింది. కేవలం చాటింగ్ చేసే రోజులకు కాలం చెల్లిందంటూ చాట్‌జీపీటీని సరికొత్త సూపర్ యాప్గా మారుస్తున్నారు. ఈ సంచలన మార్పుల వెనుక ఉన్న పూర్తి వివరాలు, కొత్త ఫీచర్లు ఇక్కడ తెలుసుకోండి.
ఈ ప్రాజెక్ట్‌ను ప్రాథమికంగా తాడేపల్లి, మంగళగిరి నియోజకవర్గాల పరిధిలో పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించారు. స్థానిక ప్రజలు ఎక్కడైనా రోడ్డుపై పెద్ద గుంతలు, అంటే ప్రయాణానికి ఇబ్బంది కలిగించే గతుకులు, గుంతలను గమనిస్తే, వెంటనే వాటి ఫోటోలను తీసి, పూర్తి సమాచారంతో డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
ఎలోన్ మస్క్‌కు చెందిన ప్రపంచ ప్రసిద్ధ అంతరిక్ష పరిశోధనా సంస్థ స్పేస్‌ఎక్స్ (SpaceX) తన మోస్ట్ అవేటెడ్ ఐపీఓ (IPO) తో మార్కెట్లోకి అడుగుపెట్టడానికి సిద్ధమైంది. జూన్ 12 నుంచి షేర్ల ట్రేడింగ్ ప్రారంభం కానుండగా.. షేర్ ధర, వాల్యుయేషన్, ఇన్వెస్టర్ల కోటా పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
వైజాగ్‌కు చెందిన తెలుగు విద్యార్థి అక్షత్ శ్రీవాస్తవ ఆపిల్ స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్ 2026 విజేతగా నిలిచి, ఆపిల్ సీఈఓ టిమ్ కుక్‌ను కలిశాడు. అతను రూపొందించిన AI ఎడ్యుకేషన్ యాప్ STEMQuest వివరాలు, WWDC ఈవెంట్ విశేషాలు మరియు అతని సక్సెస్ స్టోరీని ఇక్కడ చూడండి.
15 ఏళ్ల భారత యువ బ్యాటింగ్ సంచలనం వైభవ్ సూర్యవంశీపై ఆస్ట్రేలియా లెజెండ్ గ్లెన్ మెక్‌గ్రాత్ ప్రశంసల వర్షం కురిపించారు. వైభవ్ బ్యాటింగ్ బ్రయాన్ లారా, గ్యారీ సోబర్స్‌ను గుర్తుచేస్తోందని, అతని 72 సిక్సర్ల విధ్వంసంపై మెక్‌గ్రాత్ చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ఇక్కడ చూడండి.
మహిళల టీ20 ప్రపంచకప్ మొదటి వార్మప్ మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను 26 పరుగుల తేడాతో భారత్ చిత్తు చేసింది. భారతీ ఫుల్మాలి (56*) హాఫ్ సెంచరీతో మెరవగా, శ్రేయాంక పాటిల్ 4 వికెట్లతో విండీస్ పతనాన్ని శాసించింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం కామధేనువులంక గ్రామానికి చెందిన సత్యనారాయణ అనే వృద్ధుడు సీఎం చంద్రబాబుకు వీరాభిమాని. తమ నియోజకవర్గానికి చంద్రబాబు వస్తున్నారని, దూరం నుంచైనా ఆయన్ను చూడాలని ఉందంటూ ఆయన మాట్లాడిన వీడియో వైరల్ అయ్యింది. ఆ వీడియో సీఎం చంద్రబాబు దృష్టికి వెళ్లింది.
సోమవారం మధ్యాహ్నం క్యూబాలో భారీ భూకంపం సంభవించింది. ఆ తరువాత గంటల వ్యవధిలోనే.. ఇరాన్ దక్షిణ ప్రాంతంలోని హర్మూజ్‌గాన్ ప్రావిన్స్‌లో మరో భూకంపం సంభవించింది. ఈ రెండు భూకంపాల వల్ల ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదు. క్యూబా భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై ఏకంగా 6.1 గా నమోదైంది.
ఇలా ఉండగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబాలకు ప్రధాని నరేంద్రమోడీ సంతాపం తెలియజేశారు. మృతుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. అలాగే గాయపడిన వారికి 50 వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని వెల్లడించారు.
సిరి కేవలం ఒక కమాండ్ ఫాలో అయ్యే టూల్‌లా కాకుండా.. అత్యంత సహజంగా సంభాషించగల సామర్థ్యాన్ని సొంతం చేసుకుంది. వినియోగదారుల ప్రైవసీని యాపిల్ ఇక్కడ కూడా కొనసాగించింది. డేటా అంతా డివైస్ లోపలే ప్రాసెస్ అయ్యేలా డిజైన్ చేసింది.
పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య ఉద్రిక్తతలు ఒక్కసారిగా పీక్ స్టేజ్‌కు చేరాయి.
మాజీ మంత్రి, వై.ఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తదుపరి దర్యాప్తు చేపట్టాలంటూ ఆయన కుమార్తె సునీత రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ ప్రత్యేక కోర్టులో విచారణ జరిగింది.
తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB)కి చెందిన ఇన్‌స్పెక్టర్ బి. మహేందర్‌కు సంబంధించిన ఎసీబీ (ACB) రిమాండ్ కాపీలో పలు సంచలన అంశాలు వెలుగుచూశాయి.