Publish Date:Sep 18, 2024
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కోసం నార్సింగ్ పోలీసులు గాలిస్తున్నారు. ప్రస్తుతం ఆయన నెల్లూరులో ఉన్నట్లు సమాచారం. జాని మాస్టర్ దగ్గర పని చేస్తున్న 21 ఏళ్ల మహిళా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. జాని మాస్టర్ పై నాన్ బెయిల్ కేసు నమోదైన నేపథ్యంలో బుధవారం నార్సింగ్ పోలీసులు బాధిత యువతి స్టేట్ మెంట్ రికార్డు చేశారు. ఈ కేసు నమోదైన తర్వాత జానిమాస్టర్ హైద్రాబాద్ లోని తన ఇంటి నుంచి పారిపోయాడని పోలీసువర్గాలు తెలిపాయి. త్వరలో అరెస్ట్ చేయడానికి ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసినట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. సంచలనం సృష్టించిన ఈ కేసు వివరాలు తెలుసుకోవడానికి వివిధ మీడియా సంస్థల ప్రతినిధులు జాని మాస్టర్ ఇంటికి చేరుకుంటున్నారు. గత రెండురోజులుగా జానీ మాస్టర్ పత్తాలేకపోవడంతో ఫలితం లేకుండా పోయింది. సెక్స్ ఆరోపణలు రావడంతో తమ పార్టీ నుంచి జాని మాస్టర్ ను సస్పెండ్ చేసిన జనసేన బాధిత యువతికి అండగా నిలిచింది. బాధిత యువతి ఫిర్యాదుమేరకు జాని మాస్టర్ భార్య కూడా ఈ నేరానికి సహకరించినట్లు తెలుస్తోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/search-for-jani-master-statement-record-of-victim-girl-25-185033.html
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
ఆఫ్రికాలోని కాంగో నదిలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన పడవ ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉక్కుపాదం మోపుతోంది.
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్ఠానం అనూహ్య నిర్ణయం తీసుకుని అందరినీ విస్మయానికి గురిచేసింది.
వైద్యశాస్త్ర రంగంలో ప్రపంచవ్యాప్తంగా అత్యున్నతంగా భావించే నోబెల్ బహుమతి ప్రకటన వెలువడింది.
ఢిల్లీలోని ప్రముఖ ప్రాంతమైన జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల సంఘం ప్రధానాధికారి (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్
చేతిలో రూ.3 లక్షలు.. ఇప్పుడు రూ.100 కోట్ల బిజినెస్.!
కేబీఆర్ పార్క్ ఫ్లైఓవర్ ప్రణాళికల్లో కీలక మార్పులు.. .!
కొందరు దుండగులు ఏకంగా జ్యువెలరీ షాప్నే టార్గెట్ చేశారు.
తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్గా అద్వైత్ కుమార్ సింగ్ ఐఏఎస్ పూర్తి అదనపు బాధ్యతలు (FAC) స్వీకరించారు
మియాపూర్ మెడికో సృజన హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొద్దికొద్దిగా కొలిక్కి వస్తోంది.
సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం టీఆర్ఎస్, హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలో కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు.