నిందితులకే ఓదార్పులూ, పరామర్శలూ.. జగన్ తీరుపై మంత్రి సత్యకుమార్ యాదవ్ వ్యంగ్యాస్త్రాలు.!
Publish Date:Aug 8, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ నిర్వహిస్తున్న ఓదార్పు, పరామర్శ యాత్రలపై రాష్ట్ర ఆఱోగ్య శాఖ మంత్రి అనగాని సత్యకుమార్ ఓ రేంజ్ లో సెటైర్లు గుప్పించారు. సాధారణంగా ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు బాధితులను పరామర్శించడం సంప్రదాయమేననీ, కానీ వైసీపీ అధినేత జగన్ మాత్రం బాధితులను వదిలేసి నిందితులను పరామర్శిస్తున్నారనీ, ఓదారుస్తున్నారనీ అన్నారు. నిజంగానే నిందితులను పరామర్శించి, ఓదార్చే ఓ విచిత్ర సంస్కృతికి జగన్ తెరలేపారని ఎద్దేవా చేశారు. ధర్మవరంలో నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవ సభలో పాల్గొన్న మంత్రి.. గత కొన్ని నెలలుగా రాష్ట్రంలో జరుగుతున్న పరామర్శల తీరు అత్యంత భిన్నంగా, విడ్డూరంగా ఉందటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఏదైనా ప్రాంతంలో అన్యాయం లేదా హింస జరిగినప్పుడు ఆ ఘటనలో నష్టపోయిన బాధితుల ఇళ్లకు వెళ్లి పరామర్శించడం, అండగా ఉంటానంటూ భరోసా ఇవ్వడం బాధ్యత కలిగిన నాయకులు చేసే పని అన్న మంత్రి సత్యకుమార్ యాదవ్.. అయితే వైసీపీ అధినేత జగన్ మాత్రం బాధితుల వేదనను, కష్టాలను ఇసుమంతైనా పట్టించుకోకుండా, అక్రమాలకు పాల్పడిన నిందితుల వద్దకు వెళ్లి వారిని పరామర్శిస్తూ, ఓదార్చడం వింతగా విడ్డూరంగా ఉందన్నారు. అక్రమాలకు పాల్పడండి అండగా ఉంటానంటూ జగన్ నిందితులకు భరోసా ఇస్తున్నట్లుగా ఆయన తీరు ఉందన్నారు. మంత్రి సత్యకుమార్ జగన్ పరామర్శల తీరును ఎండగడుతూ సంధించిన వ్యంగ్యాస్త్రాలతో సభా ప్రాంగణమంతా నవ్వులతో మార్మోగిపోయింది. సత్యకుమార్ ప్రసంగం వీడియోలు సామాజిక మాధ్యమ వేదికలలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. మొత్తానికి ధర్మవరం చేనేత దినోత్సవ సభ వేదికగా జగన్ పరామర్శల తీరుపై మంత్రి సత్యకుమార్ చేసిన సెటైర్లు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపాయి. ప్రజా సమస్యలు, నిజమైన బాధితుల వేదన కంటే రాజకీయం చేసేందుకు ప్రతిపక్షం ఆరాటపడుతోందనే భావనను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఈ వ్యాఖ్యలు తోడ్పడతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. భవిష్యత్తులోనూ పరామర్శలు, రాజకీయ పర్యటనల చుట్టూ అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మరింత శృతిమించే అవకాశం ఉంది. Satya Kumar Yadav, YS Jagan Mohan Reddy, Satya Kumar Comments on Jagan, Dharmavaram Handloom Day, AP Political News TeluguOne
http://www.teluguone.com/news/content/satya-kumar-yadav-39-228362.html





