సత్తి సూర్యనారాయణ రెడ్డిపై స్క్రిప్ట్ లేకపోతే మాట్లాడలేరు!

Publish Date:Jun 18, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముఖ్యంగా అనపర్తి నియోజకవర్గంలో వైసీపీ, కూటమి నాయకుల మధ్య రాజకీయ యుద్ధం   ముదిరింది. వైసీపి మాజీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి లక్ష్యంగా తెలుగుదేశం కూటమి నాయకుడు నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇటీవల జరిగిన మత్స్యకార సొసైటీ ఎన్నికల వివాదం, కిడ్నాప్ ఆరోపణల నేపథ్యంలో అనపర్తి రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.

ఈ నేపథ్యంలో తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో   నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి.. సత్తి సూర్యనారాయణ రెడ్డిపై విమర్శల జడివాన కురిపించారు.  సూర్యనారాయణ రెడ్డికి సొంతంగా మాట్లాడే శక్తి లేదని, చేతిలో స్క్రిప్ట్ ఉంటే తప్ప ఆయన ప్రెస్ మీట్లలో కూడా మాట్లాడలేరని ఎద్దేవా చేశారు. ఆయన ప్రవర్తనను సినీ నటుడు బ్రహ్మానందం హావభావాలతో పోలుస్తూ  వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

ఇటీవల పోలీస్ స్టేషన్ వద్ద జరిగిన వివాదాన్ని ప్రస్తావిస్తూ.. వైసీపి నేతలు జక్కంపూడి రాజా, జగ్గిరెడ్డి వంటి వారు అక్కడ గొడవ పడుతుంటే, సూర్యనారాయణ రెడ్డి మాత్రం ఏం చేయాలో తెలియక బిత్తరచూపులు చూస్తూ నిలబడ్డారని నల్లమిల్లి విమర్శించారు. వైసీపి నేతలు కొందరు హీరోలు అవ్వాలని చూసి, చివరికి సూర్యనారాయణ రెడ్డిని జీరోను చేశారని చురకలు అంటించారు.

ఈ వివాదానికి కారణమైన మత్స్యకార సొసైటీ ఎన్నికల గురించి నల్లమిల్లి క్లియర్ కట్ వివరణ ఇచ్చారు. మార్చి 5న తాము శాసనసభ సమావేశాల్లో ఉండగా ఈ గొడవ జరిగిందని, తాము ఎవరినీ కిడ్నాప్ చేయలేదని స్పష్టం చేశారు. వైసీపి నాయకులే ఓటర్లను కిడ్నాప్ చేసి, ఆ కేసును డైవర్ట్ చేయడానికి పోలీసులపై ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు.

చివరికి ఈ కిడ్నాప్ కేసును కోర్టు పరిశీలించి నిందితులకు రిమాండ్ విధించిందని, దాంతో వైసీపి నేతల నోర్లు మూతపడ్డాయని నల్లమిల్లి గుర్తు చేశారు. సూర్యనారాయణ రెడ్డి బయటకు సౌమ్యుడిగా కనిపిస్తారనే వాదనను ఆయన కొట్టిపారేశారు. మైక్ లేకపోతే ఆయన మాట్లాడే భాష దారుణంగా ఉంటుందని, పచ్చి బూతులు మాట్లాడతారని నల్లమిల్లి అన్నారు.

  వైసీపి ప్రభుత్వ హయాంలో తనపై 39 తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపించారని, కూటమి కార్యకర్తలపై 151 కేసులు పెట్టి వేధించారని నల్లమిల్లి ఆవేదన వ్యక్తం చేశారు. సూర్యనారాయణ రెడ్డి హయాంలో జరిగిన భూసేకరణ అవినీతిపై ఇప్పటికే విజిలెన్స్ రిపోర్ట్ వచ్చిందని, దాదాపు 15 కోట్ల రూపాయల అక్రమాలు ప్రూవ్ అయ్యాయని వెల్లడించారు.

త్వరలోనే ఈ భూసేకరణ అక్రమాలకు సంబంధించి బాధ్యులపై చట్టపరమైన చర్యలు ఉంటాయని, ఐఏఎస్ అధికారులతో పాటు రాజకీయ నాయకుల పేర్లు కూడా విజిలెన్స్ నివేదికలో ఉన్నాయని అన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టే గత ప్రభుత్వం వేసిన మూడు విజిలెన్స్ ఎంక్వైరీల్లోనూ క్లీన్ చిట్‌తో బయటపడ్డామని నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి చెప్పారు. 

By
en-us Political News

  
విజయవాడ కృష్ణలంక ప్రాంతానికి చెందిన సాయికృష్ణ అదృశ్యం కేసు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. 2024 ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత దిక్కుతోచని స్థితిలో ఉన్న వైసీపీకి సాయికృష్ణ అదృశ్యం ఘటనను అందివచ్చిన అవకాశంగా భావించి.. పొలిటికల్ మైలేజీ గెయిన్ చేయడానికి శతధా ప్రయత్నించింది. అయితే చంద్రబాబు తన చాణక్యంతో ఆ ప్రయత్నాలకు చెక్ పెట్టారు.
తెలంగాణ రాజకీయాల్లో మల్కాజ్‌గిరి నియోజకవర్గం మరోసారి తీవ్ర ఉత్కంఠకు వేదికగా మారింది.
వైసీపీ హయాంలో మంత్రిగా ఉన్న సమయంలో కొడాలి నాని అప్పటి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, అప్పటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌లపై తీవ్రస్థాయిలో వ్యక్తిగత దూషణలు, అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యాఖ్యలు రాజ్యాంగ నిబంధనలకు, చట్టానికి వ్యతిరేకంగా ఉన్నాయంటూ దాఖలైన ఫిర్యాదులపై సుదీర్ఘంగా సమీక్షించిన ప్రభుత్వం.. తాజాగా ప్రాసిక్యూషన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం గమనార్హం. దీనితో ఆయన అరెస్టయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు.
కేసుకు కులాన్ని ఆపాదిస్తూ వైసీపీ నాయకులు అంబటి రాంబాబు, కొరసాల కన్నబాబు, తోట త్రిమూర్తులు వంటి పెద్దలు కాపు కుల మీటింగ్‌లు పెట్టాలని చూడటంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సాయికృష్ణపై గతంలో దాదాపు 22 క్రిమినల్ కేసులు, పోక్సో చట్టం కింద కేసులు ఉన్నాయని, సమాజానికి హానికరమైన ఒక నేరచరిత్ర ఉన్న వ్యక్తిని తీసుకువచ్చి కాపు యువకుడిగా ముద్ర వేయడం ద్వారా మొత్తం కులానికి అప్రతిష్ట తెస్తున్నారని మండిపడ్డారు.
ఏపీ రాజకీయాల్లో గత కొన్నేళ్లుగా సాగుతున్న కులాల వ్యూహాలను విశ్లేషించారు. దేశంలో రాజ్యాంగం కల్పించిన రక్షణలు, సామాజిక మార్పుల వల్ల నేడు పల్లెల్లో సైతం కుల వివక్ష దాదాపు అంతరించిపోయిందన్నారు. కానీ.. ఒక వ్యూహం ప్రకారం కొన్ని రాజకీయ పార్టీలు నిర్దిష్ట సామాజిక వర్గాలను టార్గెట్ చేస్తూ, మిగిలిన వర్గాల్లో వారిపై ద్వేషం పెంచేలా వాటిని బూచి గా చూపిస్తూ రాజకీయ పబ్బం గుడుపుకోవాలని చూస్తున్నాయన్నారు.
ప్రముఖ సామాజిక విశ్లేషకుడు అడుసుమిల్లి శ్రీనివాసరావు తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో రుషికొండ ప్యాలెస్ విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న జాప్యంపై అసహనం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం ప్రజాధనంతో నిర్మించిన ఈ విలాసవంతమైన భవనాన్ని కేవలం ఆలోచనలకే పరిమితం చేయకుండా.. తక్షణమే ప్రజోపయోగంలోకి తీసుకురావాలన్నారు.
సచివాలయ ఉద్యోగాల రాత పరీక్షలో 1 నుంచి 8000 లోపు అత్యుత్తమ ర్యాంకులు సాధించిన అభ్యర్థులకు ఉద్యోగాలు దక్కలేదనీ, 8000 దాటి ఆ పైన దారుణమైన ర్యాంకులు వచ్చిన వారికి ఉద్యోగాలు కేటాయించారనీ, ఈ విషయాన్ని బాధితులే తనతో స్వయంగా చెప్పారనీ రవిశంకర్ అన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో సాయి కృష్ణ అనుమానాస్పద లాకప్ డెత్ వ్యవహారం ఇప్పుడు రచ్చ లేపుతోంది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఈ వ్యవహారంలో చర్యలు తీసుకుంది. కొంతమంది పోలీసులను సస్పెండ్ చేసింది.. విచారణకు ఆదేశించింది. ప్రభుత్వం చర్యలు తీసుకుంటుండగానే.. వైసిపి నాయకులు విమర్శలతో చెలరేగిపోయారు. వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి అంబటి రాంబాబు అలవాటుగా తన నోటికి పని చెప్పారు
బీజేపీ, ఎన్‌డీఏ నైతిక మద్దతుతో ఇండిపెండెంట్ గా బరిలోకి దిగిన నత్వానీ.. ఇండియా కూటమికి గట్టి షాక్ ఇచ్చారు. అసెంబ్లీలో ప్రతిపక్షాల కంటే అధికార కూటమికే స్పష్టమైన సంఖ్యాబలం ఉన్నప్పటికీ, కాంగ్రెస్ అభ్యర్థి ప్రణవ్ ఝాను మట్టికరిపించి నత్వానీ విజేతగా నిలవడం హాట్ టాపిక్‌గా మారింది.
2024 ఎన్నికలలో పరాజయం తరువాత రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించిన నాని.. ఇప్పుడు పొలిటికల్ గా యాక్టివ్ అవ్వడం సంచలనంగా మారింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రస్తుతం అత్యంత ఆసక్తికరమైన మరియు సంక్లిష్టమైన దశకు చేరుకున్నాయి
ఈ భవనాన్ని అలాగే వదిలేయడం వల్ల ఇప్పటివరకు 6 కోట్ల రూపాయల ప్రజాధనం బుడిదలో పోసిన పన్నీరైందన్నారు.
ఏసీ రూముల్లో కూర్చుని సోషల్ మీడియా వేదికగా అసత్యాలు ప్రచారం చేయడం కాదు.. ధైర్యముంటే ప్రజాక్షేత్రంలోకి వచ్చి నేరుగా చర్చకు రావాలని సవాల్ విసిరారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, ఉద్యోగాల భర్తీపై బహిరంగ చర్చకు తాను ఎప్పుడైనా సిద్ధమేనని లోకేష్ స్పష్టం చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.