పోరాటంలో భయమెరుగని మహిళా నేత, సాహిత్యంలో ‘భారత కోకిల’.. సరోజినీ నాయుడు జయంతి..!

Publish Date:Feb 13, 2025

Advertisement

 


ఆమె స్వాతంత్ర్య పోరాటంలో  భయపడకుండా ధైర్యంగా నిలబడ్డ సివంగి. ఒక అసాధారణమైన కవయిత్రి, గొప్ప రాజకీయ నేత. మన దేశ స్వాతంత్ర్యం కోసం, సాహిత్యం, మహిళల హక్కుల కోసం ఆమె చేసిన విశేష కృషికి గుర్తింపుగా మన ప్రభుత్వం ప్రతీ ఏటా ఆమె జయంతిని ‘జాతీయ మహిళా దినోత్సవం’గా జరుపుకుంటుందంటేనే అర్ధం చేసుకోవచ్చు…. దేశ స్వాతంత్ర్య పోరాటంలో, మహిళల హక్కుల సాధనలో ఆమె ఎంతలా ప్రభావం చూపించిందో.. అంత ధైర్యం, దేశభక్తి కలిగిన ఆమె ఎవరో కాదు,  ‘భారత కోకిల’ గా  ప్రసిద్ధి పొందిన సరోజినీ నాయుడు.. భారత చరిత్రలో చెరగని ముద్ర వేసుకున్న సరోజినీ నాయుడు గురించి చాలామందికి తెలియని విషయాలు తెలుసుకుంటే..

సరోజినీ నాయుడు 1879, ఫిబ్రవరి 13న హైదరాబాద్‌లో జన్మించింది. తండ్రి అఘోర్నాథ్ చటోపాధ్యాయ ఒక శాస్త్రవేత్త, తత్వవేత్త.  తల్లి బరద సుందరి దేవి కవయిత్రి. తల్లిదండ్రుల ప్రభావం వల్లనేమో ఆమె   చిన్నప్పటి నుంచే రచనలు చేసేది. లండన్‌లోని కింగ్స్ కాలేజ్,  కేంబ్రిడ్జ్‌ లోని  గిర్టన్ కాలేజ్‌లో విద్యనభ్యసించింది. విదేశాల్లో చదువుకుంటున్న సమయంలోనే గోపాలకృష్ణ గోఖలే, మహాత్మాగాంధీ వంటి నాయకుల ప్రభావం ఆమెపై పడింది. ఇదే ఆమెను స్వాతంత్ర్య పోరాటంలో భాగమవ్వటానికి స్పూర్తినిచ్చింది.  

స్వాతంత్య్రానికి మునుపు, తర్వాత  రాజకీయ కృషి...

సరోజినీ నాయుడు భారత జాతీయ కాంగ్రెస్(ఐ‌ఎన్‌సి)లో చురుకుగా పాల్గొని స్వతంత్ర సాధన కోసం కృషి చేసింది. ఐ‌ఎన్‌సి‌ కి అధ్యక్షత వహించిన తొలి భారతీయ మహిళగా నిలిచింది. మహాత్మా గాంధీ నడిపిన ఉప్పు సత్యాగ్రహం(1920), క్విట్ ఇండియా ఉద్యమం(1942) వంటివాటిలో పాల్గొని  21నెలల జైలుశిక్ష కూడా  అనుభవించింది. భారత స్వాతంత్య్రానంతరం దేశంలోనే  తొలి మహిళా గవర్నర్‌గా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సేవలందించింది.  ఆమె గవర్నరుగా ఉన్నప్పుడు మతసామరస్యాన్ని నెలకొల్పేందుకు ఎంతో కృషి చేసింది. మహిళల ఉపాధి, చట్టపరమైన హక్కులను సమర్ధవంతంగా ప్రోత్సహించింది. విద్య, సామాజిక సంక్షేమ కార్యక్రమాలని ప్రోత్సహించింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆమె నాయకత్వం స్వతంత్ర భారత నిర్మాణంలో కీలక పాత్ర పోషించింది.  

సాహిత్యంలో కృషి.....

సరోజినీ నాయుడి కవిత్వం.. సాహిత్యంలో సౌందర్యం, దేశభక్తి భావాలను నింపుకుని ఉంటుంది. భారతీయ ఇతివృత్తాలను, పాశ్చాత్య సాహిత్య శైలితో కలగలిపి  రచనలు చేయడంతో  భారతదేశపు గొప్ప కవయిత్రులలో ఒకరిగా నిలిచింది. "ది గిఫ్ట్ ఆఫ్ ఇండియా" అనే కవితతో మొదటి  ప్రపంచ యుద్ధంలో భారతీయ సైనికుల సేవలకు నివాళులర్పించింది.  ‘ది గోల్డెన్ థ్రెషోల్డ్’,  ‘ది బర్డ్స్ ఆఫ్ టైమ్’, ‘ది బ్రోకెన్ వింగ్’, ‘ది సెప్టర్డ్ ఫ్లూట్’ వంటి ఎన్నో రచనలు చేసింది.  ఆమె మరణానతరం ప్రచురించబడిన “ది ఫెదర్ ఆఫ్ ది డాన్” ఆమె అద్భుతమైన కవితా ప్రతిభను సూచిస్తుంది. ఆమె సాహిత్య ప్రతిభకుగానూ “భారత కోకిల” అనే బిరుదు లభించింది.

మహిళా హక్కుల పరిరక్షణలో..

సరోజినీ నాయుడు మహిళా హక్కుల కోసం తన జీవితాంతం పనిచేసింది. దేశ పురోగతికి మహిళా సాధికారత అవసరమని బలంగా నమ్మింది. ‘ఉమెన్స్ ఇండియన్ అసోసియేషన్’ సహవ్యవస్థాపకురాలిగా ఉంటూ  మహిళల విద్య, ఆరోగ్యం, చట్ట పరిరక్షణ కోసం పని చేసింది. ‘ఆల్ ఇండియా ఉమెన్స్ కాన్ఫరెన్స్’ అధ్యక్షురాలిగా మహిళల ఓటు హక్కు, చట్ట పరిరక్షణ కోసం ఉద్యమించింది. జాతీయంగానే గాక గ్లోబల్ సమావేశాల్లో కూడా మహిళల ఓటు హక్కు కోసం  భారతదేశానికి  ప్రాతినిధ్యం వహించింది.

వారసత్వానికి గౌరవమివ్వాలి.....

సరోజినీ నాయుడు కృషికి గుర్తింపుగా మన ప్రభుత్వం  ‘జాతీయ మహిళా దినోత్సవం’ జరుపుకుని నివాళులర్పిస్తుంది. అలాగే మహిళా సమస్యలపై పోరాడిన ఉత్తమ జర్నలిస్టులకి “సరోజినీ నాయుడు అవార్డు” ఇచ్చి, ఆనాడు ఆమె మహిళల కోసం చేసిన కృషిని గుర్తు చేస్తుంది. ఆమె పేరుతో అనేక విద్యా సంస్థలు కూడా  నెలకొల్పబడ్డాయి.  ఆమె వారసత్వం తరతరాల వారికి ప్రేరణగా నిలుస్తోంది. మనం ఆమెకు నివాళులర్పిస్తూనే సమానత్వం, సాధికారత, దేశభక్తి అనే  విలువలను ముందుకు తీసుకెళదాం..

                                    *రూపశ్రీ.

By
en-us Political News

  
తల్లిదండ్రులను, తోడబుట్టిన వారిని ఎవరూ ఎంచుకోలేరు.  అవి దేవుడు ఇచ్చే బందాలు.  కానీ ప్రతి వ్యక్తి స్నేహితులను ఎంచుకునే వెసులుబాటు ఉంటుంది. మంచి స్నేహితులు ఉన్న వారి జీవితం చాలా బాగుంటుంది. ముఖ్యంగా క్లిష్ట పరిస్థితులు...
ప్రతి మనిషి వేర్వేరు వ్యక్తిత్వం కలిగి ఉంటాడు.  ఒకే ఇంట్లో, ఒకే తల్లి కడుపున పుట్టిన వ్యక్తులే వేర్వేరు స్వభావాలను కలిగి ఉన్నప్పుడు బయటి వ్యక్తుల స్వభావం ఒకే విదంగా ఉండటం అనేది జరగదు.  అయితే బయట కొందరిని చూస్తే వీళ్లు అచ్చు మనలాగే ఉన్నారే...
ప్రేమ,  భార్యాభర్తల బంధం,  సహజీవనం.. ఏదైనా సరే.. మనసులు ఇచ్చిపుచ్చుకోవడం అనేది కీ పాయింట్ గా ఉంటుంది. నేటికాలంలో బంధాలు చాలా పెళుసుగా మారాయి.  చాలా తొందరగా బ్రేకప్ లు  జరుగుతున్నాయి...
పెళ్లి ప్రపంచంలో ప్రజలందరూ సాగించే ఒక పవిత్రమైన  బంధం. భారతీయులు పెళ్లికి అధిక ప్రాధాన్యత ఇస్తారు.  సాధారణంగా వయసు రాగానే పెళ్లి వయసు వచ్చింది అని అంటుంటారు.  దానికి తగ్గట్టే పెళ్ళిళ్లు చేస్తుంటారు....
గొడవలు లేని భార్యాభర్తల బంధం అంటూ ఉండదు. వాస్తవానికి భార్యాభర్తల మధ్య  జరిగే గొడవలు చాలా వరకు వారి బంధాన్ని మరింత బలంగా మార్చడంలో సహాయపడతాయి.  భార్యాభర్తల మధ్య జరిగే చిన్న చిన్న గొడవలు  ఒకరి మీద ఒకరికి ఉండే ప్రేమను స్పష్టం చేస్తాయి...
అత్తాకోడలు ఇద్దరూ వేరే ఇంట్లో తమ తల్లిదండ్రుల మధ్య గారాభంగా పెరిగి వివాహం పేరుతో ఒక ఇంటిని చేరే వారు.  అయితే ఏ ఇంట్లో చూసినా అత్తాకోడళ్లు అంటే ఒకానొక శత్రుత్వమే కనిపిస్తుంది, వినిపిస్తుంది...
కష్టాలు, సమస్యలు ఎదురైనప్పుడు, ఇతరుల నుండి అన్యాయాన్ని ఎదుర్కుంటున్నప్పుడు, ఇతరుల తప్పులకు తాము నష్టాన్ని  అనుభవిస్తున్నప్పుడు చాలా మంది న్యాయం కోసం న్యాయ స్థానాన్ని ఆశ్రయిస్తారు.
మోసపోవడం,  మోసం చేయడం,  తప్పు చేయడం,  తప్పించుకు తిరగడం,  చట్టానికి విరుద్దంగా, న్యాయానికి వ్యతిరేకంగా ప్రవర్తించడం..  ఒకటి రెండు కాదు..
ఏ సంబంధానికైనా నమ్మకం పునాది.  కానీ నేటి డిజిటల్ యుగంలో ఈ నమ్మకం కొన్ని విషయాల చుట్టూనే తిరుగుతుంది. వాటిలో ఫోన్ చాలా ముఖ్యమైనది. భార్యాభర్తలు ఒకరి ఫోన్ మరొకరు చెక్ చేయడంలో తప్పేముందని చాలా మంది అంటుంటారు....
జీవితం చాలా విచిత్రమైనది. నిన్న ఉన్నట్టు ఈరోజు ఉండదు,  ఈరోజు ఉన్నట్టు రేపు ఉంటుందో లేదో తెలియదు.  కానీ చాలామంది రేపు ఇలా ఉంటే బాగుంటుంది అనే ఆశాభావంతో ఉంటారు.  ప్రతీది ఇలా జరగాలి, ఇలా జరిగితే బాగుంటుంది అని కొన్ని అంచనాలు కూడా పెట్టుకుంటారు....
ఎమోషన్స్  అనేవి మాటలకు అందని చర్యలు.  మాటల ద్వారా చెప్పలేని ఎన్నో విషయాలను ఎమోషన్స్ ద్వారా వ్యక్తం చేస్తుంటారు.  ఈ ఎమోషన్స్ ద్వారా అనుబంధం ఉన్నంత వరకు ఎవరైనా, ఏ బంధమైనా బాగుంటుంది...
ఆత్మవిశ్వాసం అనేది అన్ని వయసుల వారికి ఎంతో ముఖ్యం.  ఇది జీవితం మెరుగ్గా మలుచుకోవడంలో, ఏదైనా ఒక పనిని చేయడానికి ధైర్యాన్ని ఇవ్వడంలో సహాయపడుతుంది.  ఆత్మవిశ్వాసం లేకపోతే ఎంత సులువైన పని అయినా సరిగా చేయలేరు....
ప్రతి మనిషి రెండు రకాల ఆరోగ్యాల గురించి ఆలోచించాలి.  ఒకటి శారీరక ఆరోగ్యమైతే.. రెండవది మానసిక ఆరోగ్యం. శారీరక  ఆరోగ్యం గురించి చాలామంది ఆలోచన చేస్తారు.  మంచి శారీక ఆరోగ్యం కోసం చాలా రకాల టిప్స్ ఇంకా మంచి జీవనశైలి పాటించడానికి కూడా ప్రయత్నం...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.