‘రాజ్యాంగ హత్య దినం’ సబబేనా?

Publish Date:Jul 15, 2024

Advertisement

కారణాలు ఏమైనప్పటికీ, 1975, జూన్ 25న అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీని ప్రకటించారు. దాని ప్రభావం, పర్యవసానాల సంగతి అందరికీ తెలిసిందే. ఇందిరా గాంధీ చరిత్రలో ‘ఎమర్జెన్సీ’ ఒక మచ్చలాగా మిగిలిపోయింది. ఇందిరాగాంధీ కూడా ఆ తర్వాత తాను ఎమర్జెన్సీని ప్రకటించడం తప్పేనన్న విషయాన్ని అంగీకరించారు. ఎమర్జెన్సీని విధించిన తప్పుకు ప్రజలు ఆమెను శిక్షించారు. ఆ తర్వాత ఆమెను క్షమించి మళ్ళీ అధికారం ఇచ్చారు. ఇందిరాగాంధీ అధికారంలో వుండగానే, ప్రధానమంత్రిగా అందరి నుంచి జేజేలు అందుకుంటున్న సమయంలోనే హత్యకు గురయ్యారు. అదంతా ఎప్పుడో ముగిసిపోయిన అధ్యాయం.. మానిపోయిన గాయం. ఇప్పుడు ఆ గాయాన్ని అధికారికంగా రేపి రాజకీయ లబ్ధిని పొందాలని భారతీయ జనతాపార్టీ భావిస్తోంది.

ఎమర్జెన్సీని ప్రకటించినందుకు ఇందిరాగాంధీని ఇప్పటికీ నోరున్న ప్రతి ఒక్కరూ విమర్శిస్తూ వుంటారు. బీజేపీ వర్గాలయితే ఎమర్జెన్సీని, ఇందిరాగాంధీని, జవహర్లాల్ నెహ్రూని విమర్శిస్తూనే వుంటారు. ఇందిర,  నెహ్రూ దేశానికి చేసిన సేవలు బీజేపీ వాళ్ళకి ఎప్పుడూ కనిపించవు. నెహ్రూ కుటుంబాన్ని విమర్శించడానికి బీజేపీకి చెందిన గల్లీ కార్యకర్త అయినా నేను సిద్ధం అంటూ రెడీ అయిపోతాడు. ఇలా ఒక పార్టీ వేదికగా ఎవరయినా, ఎవర్నయినా విమర్శించవచ్చు. కానీ, ప్రభుత్వం పరంగా మాత్రం అలా చేయడానికి చాలా పరిమితులు వుంటాయి. ఆ పరిమితులన్నీ బీజేపీ ప్రభుత్వం దాటింది. ఎమర్జెన్సీ ప్రకటించిన జూన్ 25వ తేదీని ‘సంవిధాన్ హత్యా దివస్’ (రాజ్యాంగ హత్య దినం) పేరిట అధికారికంగా ప్రకటించింది. ఈ చర్య ఆనాడు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని ప్రకటించడం కంటే దారుణమైన చర్య అనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఏనాడో ఒక మాజీ ప్రధాని తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పుడు అధికారికంగా విమర్శించే విధంగా చేయడం సబబు కాదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇప్పుడు బీజీపీకి అధికారం వుంది కాబట్టి, తనను ఆపే అవకాశం ఎవరికీ లేదు కాబట్టి ‘రాజ్యాంగ హత్య దినం’ అంటూ ప్రకటించారు. కొంతకాలం తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వమో, మరో ప్రభుత్వమో వస్తుంది. అప్పుడు మోడీ నోట్ల రద్దు చేసిన రోజును ‘అత్యంత తలతిక్కల దినం’ అనో, మోడీ ప్రమాణ స్వీకారం చేసిన రోజును ‘అత్యంత విషాదాత్మక దినం’ అని ప్రకటిస్తే ఎలా వుంటుంది? ఇందిరాగాంధీని కానీ, మోడీని కానీ వ్యక్తిగతంగా ఎంతయినా విమర్శించవచ్చు. ఇలా  ‘హద్దులు’ మీరి ఆ విమర్శలకు ‘అధికారం’ కల్పించడం ఎంతవరకు సబబు అని విజ్ఞులు ప్రశ్నిస్తున్నారు.

భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ నాయకులను జనం దృష్టిలో పలుచన చేసే విధంగా నిర్మించే సినిమాలకు మద్దతు ఇస్తోంది. ఇప్పుడు సమయం సందర్భం లేకుండా ‘ఎమర్జెన్సీ’ అంశాన్ని పైకి తీసుకొచ్చి, దానికి అధికారికంగా ఒక పేరును ఇవ్వడం అనేది త్వరలో రాబోతున్న ‘ఎమర్జెన్సీ’ అనే సినిమాకి హైప్ తేవడమే అనే విమర్శలు వినిపిస్తున్నాయి. బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ నటించిన ‘ఎమర్జెన్సీ’ అనే సినిమా సెప్టెంబర్ 6, 2024న విడుదలవుతోంది. ఇందిరా గాంధీ మీద తమ ద్వేషాన్ని అధికారికంగా వెళ్ళగక్కడంతోపాటు కంగన రనౌత్ నిర్మాత కూడా అయిన ‘ఎమర్జెన్సీ’ సినిమా మీద నేటితరం ప్రేక్షకులకు ఆసక్తి కలిగించే ప్లానులో భాగంగా బీజేపీ ప్రభుత్వం తీసుకోకూడని నిర్ణయం తీసుకుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

By
en-us Political News

  
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్‌ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
హైదరాబాద్‌ నగరంలో నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.