చిన్న సినిమాను కబళిస్తున్న పెద్ద సినిమాలు?
Publish Date:Jan 20, 2013
Advertisement
నేడు తెలుగు సినిమాలలో వేర్వేరు స్థాయి హీరోలున్నట్లే, సినిమాలలో కూడా చిన్నసినిమాలు, పెద్ద సినిమాలు, డబ్బింగ్ సినిమాలు అంటూ మూడు రకాలు పుట్టుకొచ్చాయి. పెద్ద సినిమాలంటే బడ్జెట్ కనీసం వంద కోట్లయినా ఉండాలి. అది ఆడుతుందా లేదా అనేది వేరే సంగతి. ఈ పెద్ద సినిమాలను నిర్మించే నిర్మాతలు తమ సినిమాలను ఏక కాలంలో అనేక సినిమా హాళ్ళలో విడుదలచేసుకోవడానికి వీలుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సినిమా హాళ్ళను క్రమంగా తమ అధీనంలోకి తెచ్చుకొన్నారు. చివరికి రాష్ట్రంలో బీ, సి, సెంటర్లలో ఉన్న సినిమా హాళ్ళను సైతం వారి అధీనంలోకి తెచ్చుకోగలిగేరు. ఆ దెబ్బకి చిన్న సినిమా నిర్మాతలు తమ సినిమాలు విడుదల చేసుకోవడానికి సినిమా హాళ్ళు దొరక్క, వాటిని నియంత్రిస్తున్న పెద్ద నిర్మాతల కాళ్ళ మీదపడితే తప్ప తమ సినిమాలు విడుదల చేసుకోలేని దీనస్థితిలో విలవిలలాడుతున్నారు. ప్రతీ నెలలో ఎవరో ఒక పెద్ద నిర్మాతది పెద్ద సినిమా విడుదల తప్పక ఉంటుంది. ఆ సినిమా కోసం రాష్ట్రంలో సినిమా హాళ్ళన్నీ ముందుగానే రిజర్వ్ చేయబడిపోతాయి. ఆ సమయంలో చిన్న సినిమా నిర్మాత ఎవరయినా తన సినిమా విడుదల చేసుకొందామన్నా అతనికి సినిమా హాళ్ళు దొరకవు. అందువల్ల ఎక్కడో ఊరవతల సినిమా హాళ్ళలో తన సినిమాను విడుదలచేసుకోవాలి, లేదా పెద్ద సెంటర్లలో తన సినిమాను విడుదలచేసుకోవాలంటే తప్పనిసరిగా పెద్ద సినిమా నిర్మాతల చుట్టూ తన సినిమా రీళ్ళ డబ్బాలు పట్టుకొని ప్రదక్షిణాలు చేయాలి. వారు అతనిని కనికరిస్తే సినిమా విడుదల అవుతుంది, లేదంటే ఇక ఆ సినిమా నిర్మాత కష్టం బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. సినిమా తీయడం ఒక ఎత్తయితే, నేడు సినిమా విడుదల చేసుకోవడం మరో ఎత్తుగా మారింది. ఇది చిన్న నిర్మాతలపాలిత శాపం గా మారింది. అనేక మంది చిన్న సినిమా నిర్మాలు మంచి సినిమాలు తీసినప్పటికీ, ఈ కారణంగానే ఆర్దికంగా నష్టబోయి, ఉన్నకాడికి తమ ఆస్తులు తెగనమ్ముకొని వీధిన పడినవారు చాలామందే ఉన్నారు. ఈ విషయాలన్నీ తెలిసినప్పటికీ పెద్ద నిర్మాతలు గానీ, పెద్ద హీరోలు గానీ స్పందించకపోవడంతో, తెలుగు సినిమా రంగంలో అందరికంటే సీనియర్ నిర్మాత, దర్శకుడు, నటుడు అయిన దాసరి నారాయణరావు గారు, చిన్న సినిమా నిర్మాతల కష్టాల పట్ల స్పందిస్తూ అనేక సార్లు పెద్ద నిర్మాతలకి వ్యతిరేఖంగా గొంతు విప్పి మాట్లాడినా ఫలితం లేకపోయింది. అందువల్ల, గురువారంనాడు సమావేశం అయిన చిన్న సినిమా నిర్మాతల కౌన్సిల్ ఫిబ్రవరి 20 తేదీ నుండి తమ సినిమాలను థియేటర్లలో విడుదల చేయకుండా నేరుగా డిటిహెచ్ ద్వారా టీవీలలో విడుదల చేయడానికి నిర్ణయించుకొన్నారు. ఈ ప్రయోగం సఫలం అవడం కష్టమని వారికీ తెలుసు గానే తమకు వేరే గత్యంతరం లేదని వారు ఈ నిర్ణయం తీసుకొన్నారు. నట్టికుమార్, విజయచందర్, చదలవాడ శ్రీనివాసరావు, ప్రసన్నకుమార్ తదితరులు కొందరు అందుకు అవసరమయిన ఒప్పందాలు త్వరలో కుదుర్చుకుంటామని అన్నారు. ఒక అందమయిన రంగుల కలల ప్రపంచం సృష్టించే మన తెలుగు సినిమా పరిశ్రమ, కొందరి స్వార్ధంవల్ల చిన్న నిర్మాతలకి పీడకలగా మారిపోవడం విచారకరం.
http://www.teluguone.com/news/content/samll-films-24-20510.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





