ఇది అయ్యే పనేనా సజ్జలా?

Publish Date:May 18, 2023

Advertisement

రాష్ట్రంలో వైసీపీ పరిస్థితి నానాటికీ తీసికట్టు నాగంభోట్లు అన్నట్లుగా తయారౌతోంది. ఇప్పటికే వైసీసీ నేతలెవరూ  ముఖ్యమంత్రి జగన్ సహా ప్రజలలోకి వెళ్లేందుకు ధైర్యం చేయడం లేదు. తమ వాచాలతను ప్రదర్శించడానికి  మీడియా సమావేశాలను ఉపయోగించుకుంటున్నారు. చివరాఖరికి ముఖ్యమంత్రి కూడా బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లోకి సొమ్ములు జమ చేయడానికి అంటే ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభల నుంచి జనం పారిపోతున్నా.. పెద్దగా పట్టించుకోవడం లేదు.

ఆ మిగిలిన జనానికే తన ఫ్రస్ట్రేషన్ అంతా ప్రదర్శిస్తూ విపక్షాలను తిట్టిపోస్తున్నారు. పార్టీ పరంగా సభలూ, సమావేశాలూ నిర్వహించే ధైర్యం సన్నగిల్ల ప్రభుత్వ కార్యక్రమాలనే పార్టీ కార్యక్రమాలుగా మార్చేసుకుని విపక్ష నేతలపై విమర్శలు గుప్పించి తమ జబ్బలు తామే చరుచుకుంటున్నారు. వైనాట్ 175 నుంచి మీ బిడ్డను నేను.. విపక్షాని ఓటు వేయకండని బతిమలాడుకుంటున్నారు. సింహం సింగిల్ గా వస్తుంది.. దమ్ముంటే తెలుగుదేశం, జనసేనలు విడివిడిగా ఎన్నికల రణరంగంలో పోటీ చేయండి అంటూ సవాళ్లు విసిరిన జగన్ ఇప్పుడు.. బీజేపీతో పొత్తు కోసం వెంపర్లాడుతూ హస్తినలో  కమలం పార్టీ అగ్రనేతల అప్పాయింట్ మెంట్ కోసం చకోరపక్షిలా ఎదురు చూస్తున్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికార వైసీపీపై వాడవాడలా చార్జిషీట్లు విడుదల చేస్తూ ఎక్కడికక్కడ వైసీపీ నేతల దుర్మార్గాలను ఎండగడుతుంటే.. వైసీపీ అధినేత జగన్ మాత్రం బీజేపీ పెద్దల ప్రాపకం కోసం తహతహలాడుతున్నారు.

అదలా ఉంచితే.. తాము జనంలోకి వెళ్లే అవకాశం లేకపోవడాన్ని వైసీపీ పెద్దగా పట్టించుకోవడం లేదు కానీ.. విపక్ష నేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ జనంలో తిరగడం, వారికి ప్రజలు బ్రహ్మరథం పట్టడం భరించ లేకపోతున్నారు. విపక్ష నేతల సభలను రోడ్ షోలను అడ్డుకోవడానికి తీసుకువచ్చిన జీవో నంబర్ 1ను కోర్టు     కొట్టివేయడంతో  వైసీపీలో అసహనం అవధులు దాటింది.

జీవో నంబర్ 1 చెల్లదని చెప్పినది న్యాయస్థానం అన్న విషయాన్ని మరచిపోయి.. చంద్రబాబు సభలకు, రోడ్ షోలకు అనుమతులిచ్చి ఇంకా ఎంత మంది ప్రాణాలు తీయమంటారు? అని ప్రశ్నిస్తోంది. రాజ్యాంగం ప్రకారం సంక్రమించిన హక్కులను కాదనడం సాధ్యం కాదని గూబ గుయ్యిమనేలా న్యాయస్తానం విస్పష్ట తీర్పు ఇచ్చినా తత్వం బోధపడలేదు. సకల శాఖల మంత్రి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కోర్టు తీర్పు తరువాత  విపక్షాల సభలు, సమావేశాలను అడ్డుకోవడానికి చట్టం తీసుకువస్తామని సెలవిచ్చారు.

ఇందు కోసం న్యాయ నిపుణులతో చర్చిస్తున్నామన్నారు. అసలు చంద్రబాబు పాల్గొన్న రెండు కార్యక్రమాలలో అవాంఛనీయ సంఘటనలు జరగడం , ఆ వెంటనే ఆఘమేఘాల మీద జీవో రావడం వెనుక కుట్ర ఉందా అన్న అనుమానాలను పరిశీలకులు అప్పట్లోనే వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఆ అనుమానాలకు బలం చేకూర్చే విధంగానే.. సజ్జల సభలను, రోడ్ షోలను అడ్డుకోవడానికి చట్టం తీసుకువస్తామనడం ఉందని విశ్లేషిస్తున్నారు.  

By
en-us Political News

  
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు. 
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం,  హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు. 
 కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.  రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్‌ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.  
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.  తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో  అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.  అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ   అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది. 
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ..  తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ  తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి. 
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది.  సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును  దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి  కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది.  ఈ నేపథ్యంలో తాను కేవలం  మంత్రి పదవిని  మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.