జగన్ కు బదులు సజ్జల జైలు యాత్రలు.. సంకేతమేంటి?!

Publish Date:Jun 4, 2025

Advertisement

వైసీపీలో పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఆ పార్టీ కీలక నేతలంతా జగన్ అరెస్టు ఖాయమంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా మద్యం కుంభకోణంలో జగన్ అరెస్టు అనివార్యమని అంతర్గత సంభాషణల్లోనే కాదు, మీడియా సమావేశాలలో కూడా చెప్పేస్తున్నారు. అదే జరిగితే పార్టీ సారథ్యం ఎవరిదన్న విషయంపై రకరకాల చర్చలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు, ఆయన జైలు ములాఖత్ లు జగన్ అరెస్టైతే పార్టీ పగ్గాలు చేపట్టేది తానేనని సంకేతాలు ఇస్తున్నట్లుగా ఉందని వైసీపీ వర్గాల్లోనే ఓ రేంజ్ లో చర్చ సాగుతోంది. 
తొలి నుంచీ కూడా ఒక వేళ జగన్ జైలుకెళ్లే పరిస్థితి వస్తే పార్టీ బాధ్యతలు ఆయన సతీమణి భారతి చేపడతారన్న భావన పార్టీ వర్గాల్లో కనిపించేది. అయితే భారతి పెద్దగా జనంలోకి రాకపోవడం, వైసీపీ నేతల అరెస్టులపై ఆమె ఏ మాత్రం స్పందించకపోవడంతో ఆమె పార్టీ కార్యక్రమాలకు దూరంగా, రాజకీయాలకు దూరంగా ఉండాలన్న ఉద్దేశంతో ఉన్నారని అవగతమౌతోందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే సజ్జల పేరు తెరపైకి వచ్చిందని చెబుతున్నారు. అందుకు అనుగుణంగానే సజ్జల ఇటీవలి కాలంలో పార్టీ వ్యవహారాలు, కార్యక్రమాలలో ఒకింత చురుకుగా, చొరవగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ఘన విజయం సాధించి ఏడాది పూర్తయిన సందర్భంగా వైసీపీ నిర్వహిస్తున్న వెన్నుపోటు దినం నిరసనలకు సంబంధించిన బాధ్యతలు సజ్జలే చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని క్యాడర్ కు పిలుపునిచ్చారు. అంతే కాకుండా ఇటీవలి కాలంలో తరచుగా ఆయన జైలు ములాఖత్ లు జరుపుతున్నారు. గతంలో ఈ పని జగన్ చేసేవారు. అయితే కారణాలేమైతేనేం.. జగన్ జైలు పరామర్శలు పూర్తిగా తగ్గిపోయాయి. ఆయన స్థానంలో ఆ పని సజ్జల చేస్తున్నారు. ఇటీవలే వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ ను గుంటూరు జైల్లో సజ్జల కలిసి పరామర్శించారు.

వైసీపీ అధికారంలో ఉండగా నందిగం సురేష్ అరాచకాలు, దౌర్జన్యాలూ ఓ రేంజ్ లో ఉండేవి.  తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై దాడిలో పాల్గొన్న వారిలో అత్యధికులు నందిగం అనుచరవర్గమేనన్న ఆరోపణలు ఉన్నాయి. అంతే కాదు.. నందిగం సురేష్ పై పలు కేసులు కూడా ఉన్నాయి.  ఈ క్రమంలోనే తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత నందిగం సురేష్ పై ఉన్న కేసుల బూజు దులిపింది. దీంతో ఆయన అరెస్టయ్యారు. ఆ తరువాత బెయిలు వచ్చింది. కానీ మరో  కేసులో ఆయన ఇటీవల మళ్లీ అరెస్టయ్యారు. ఈ నేపథ్యంలో   గుంటూరు జైల్లో ఉన్న  నందిగం సురేష్ తో సజ్జల సోమవారం (జూన్ 2)న. సజ్జల ములాఖత్ అయ్యారు.  నందిగం సురేష్ బాగోగులు, ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీసిన సజ్జల ఆయనకు ధైర్యం చెప్పారు,  దీంతో ఇప్పుడు సజ్జల జైల్లో ములాఖత్ లకు సంకేతమేంటన్న చర్చ పార్టీలో ప్రారంభమైంది. గతంలో చలా మంది వైసీపీయులు అరెస్టైనా జైలుకెళ్లి వారితో ములాఖత్ కాని సజ్జల ఇటీవలి కాలంలో వరుసగా జైలు పర్యటనలు చేయడం వెనుక గట్టి వ్యూహమే ఉందన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు,  

నందిగం కంటే ముందు సజ్జల విజయవాడ సబ్ జైలులో  మద్యం కుంభకోణం కేసులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న   సీఎంఓ మాజీ   కార్యదర్శి   ధనుంజయ్ రెడ్డి, జగన్ మాజీ ఓఎస్డీ  కృష్ణమోహన్ రెడ్డిలను సజ్జల నేరుగా బెజవాడ జిల్లా జైలుకు వెళ్లి మరీ కలిశారు.  ఆ తరువాత   నెల్లూరు కేంద్ర కారాగారంలో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డినీ కలిశారు. ఇప్పుడు తాజాగా నందిగం సురేష్ తో గుంటూరు జైలులో ములాఖత్ అయ్యారు. దీంతో ఒక వేళ జగన్ జైలుకు వెడితే ఆయన ఆబ్సెన్స్ లో సజ్జలే పార్టీని నడిపిస్తారన్న సంకేతాలను ఆయన తన ములాఖత్ భేటీల ద్వారా చాటుకుంటున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

By
en-us Political News

  
కల్వకుంట్ల తారకరామారావు జన్మదినం జులై 24 ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ కేటీఆర్ కు పాతిక కిలోల సన్నబియ్యాన్ని కానుకగా పంపారు. అదీ తాను స్వయంగా ఆ బర్త్ డే గిఫ్ట్ ను అందించకుండా, ర్యాపిడో బైక్ బుక్ చేసి.. ఆ కానుకను తెలంగాణ భవన్ కు కేటీఆర్ కు పంపించారు.
వాస్తవానికి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే కేబినెట్ భేటీకి డిప్యూటీ సీఎం హాజరు కాకపోవడానికి రాజకీయ కారణాలున్నాయా అన్న అనుమానాలకు ఆస్కారం లేని పరిస్ధితి ఉంది. ఎందుకంటే.. ఇటీవలే ముంబై లోని కోకిలా బెన్ అంబానీ ఆస్పత్రిలో పవన్ కల్యాణ్ భుజానికి శస్త్ర చికిత్స జరిగింది. ఆయనకుపూర్త విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించడం వల్లనే కేబినెట్ భేటీకి రాలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
మత్స్యకారుల నాయకుడిగా, మాజీ మంత్రిగా గుర్తింపు పొందిన సీదిరి అప్పలరాజు ఇటీవల వార్తల్లో నిలిచారు.
జగన్ సొంత కుంపటి పెట్టుకున్న నాటి నుంచీ వెన్నంటి ఉన్న విజయసాయిరెడ్డి, సమీప బంధువు అయిన బాలినేని లకు పార్టీలో దక్కిన మర్యాద తెలిసిందే. ఇప్పుడు తాజాగా నిన్న మొన్నటి వరకూ జగన్ కు అత్యంత సన్నిహితుడిగా, నమ్మిన బంటుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి ఇప్పుడు కనీసం తాడేపల్లి ప్యాలెస్ గేటు వద్ద ఎంట్రీ కూడా దొరకడం లేదు.
ఇటీవల నిరుద్యోగ యువతను ఉద్దేశించి సుప్రీంకోర్టు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా, సామాజిక మాధ్యమాల్లో రాజుకున్న ఆగ్రహం ఇప్పుడు దేశ రాజధాని జంతర్ మంతర్ వద్ద విశ్వరూపంతో నిలిచింది. ప్రశ్నించే హక్కును కోల్పోయిన తరానికి ప్రాతినిధ్యం వహిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ రూపంలో విద్యార్థులు, యువత ఉద్యమిస్తున్నారు.
ఏపీలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీ ఈ అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది. జాతీయ స్థాయి నీట్ లీకేజీ వ్యవహారంలోకి ఏపీ మెగా డీఎస్సీ పరీక్షల అంశాన్ని జోడించి లబ్ధి పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన డీఎస్సీ పరీక్షల్లో అనేక అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైసిపి నాయకత్వం విమర్శిస్తూ, నీట్ తో పాటు డీఎస్సీ అక్రమాలపై కూడా విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది.
దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల నిర్వహణ, ప్రశ్నాపత్రాల లీకేజీ ఆరోపణలు తీవ్ర స్థాయిలో దుమారం రేపుతున్నాయి.
రాజకీయం గురించి కాదు. పార్టీ గురించి కాదు.ఒక నాయకుడి గురించి కూడా కాదు....ఒక తరం గురించి. విజృంభించిన లాఠీల్లో రక్తం చిందించిన ఈ తరం గురించి.
గతంలో అంటే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, దూషణలతో చెలరేగిన వల్లభనేని వంశీ తాజా లేఖలో మాత్రం చంద్రబాబుకు గౌరవం ఇస్తూ అయ్యా చంద్రబాబుగారూ అని మర్యాదగా సంభోధించారు. అంతే కాకుండా చంద్రబాబు చొరవను, రైతుల పట్ల ఆయనకు ఉన్న అక్కరనూ ప్రశంసలతో ముంచెత్తారు.
అధికారాన్ని అడ్డుపెట్టుకుని నిబంధనలకు తిలోదకాలిచ్చి.. ఇష్టారాజ్యంగా వ్యవహరించిన వైసీపీ ఇప్పుడు కేసుల చిక్కుల్లో నిండా ఇరుక్కుంది. అధికారంలో ఉండగా చట్టాలకు మనం అతీతులం అన్నట్లుగా వ్యవహరించిన వైసీపీ నేతలకు ఒక్కరొక్కరుగా పోలీసు కేసులను, సీఐడీ విచారణలను ఎదుర్కొంటూ, అరెస్టులు, బెయిళ్లు అంటూ న్యాయస్థానాల చుట్టూ తిరగాల్సి పరిస్థితిలో ఉన్నారు.
ఆయన రాజీనామాకు యువత పట్టుబడుతోంది. అయితే ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న యువత డిమాండ్ ను పట్టించుకోవడం లేదు. నీట్ పై తొలి సారిగా స్పందించి, సోషల్ మీడియా వేదికగా న్యాయం చేస్తాననీ, లీకేజీ బాధ్యులను కఠినంగా శిక్షిస్తామనీ, అందుకోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామనీ చెప్పిన మోడీ.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీమానా చేయాలన్న యువత డిమాండ్ ను ఇసుమంతైనా పరిగణనలోకి తీసుకోలేదు.
గత ప్రభుత్వ హయాంలో ముంబైకి చెందిన నటిని, ఆమె కుటుంబ సభ్యులను అక్రమంగా అరెస్టు చేసి ఆంధ్రప్రదేశ్‌కు తీసుకురావడంపై విచారణ వేగం పుంజుకుందన్న ఆయన.. గతంలో ఎన్నికల కోడ్ అమలులోకి రావడానికి సరిగ్గా రెండు నెలల ముందు ముంబైలో ఉన్న కాదంబరి జత్వానీని, ఆమె తల్లిదండ్రులను ఏపీ పోలీసులు అరెస్ట్ చేసి.. ఫోర్జరీ భూలావాదేవీల కేసు సాకుగా చూపి దాదాపు 40 రోజుల పాటు జైలులో ఉంచారన్నారు.
గత ఎన్నికల్లో మంగళగిరి స్థానం నుంచి నారా లోకేష్ సాధించిన చారిత్రాత్మక విజయం ఆయనకు రాజకీయంగా పెద్ద మైలేజీని ఇచ్చింది. గతంలో ఓటమిని చవిచూసిన చోటే ఐదేళ్ల పాటు నిరంతరం ప్రజల్లో ఉంటూ, సమగ్ర ప్రచారంతో విజయం సాధించడం ఆయన రాజకీయ ప్రస్థానంలో ఒక కీలక మలుపుగా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.