సబ్బం హరి పోటీ ఎవరితో?

Publish Date:Apr 24, 2014

Advertisement

 

అనకాపల్లి సిట్టింగ్ యంపీ సబ్బం హరి, కొన్ని నెలల క్రితం వరకు కూడా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూనే వైకాపా తరపున పనిచేసారు. జగన్ జైలు నుండి విడుదల కాగానే కాంగ్రెస్ ను వీడి వైకాపాలో చేరేందుకు ముహూర్తం కూడా ఖరారు చేసుకొన్నారు. అయితే ఆయన వైకాపాలో చేరక మునుపే అత్యుత్సాహానికి పోయి “ఎన్నికల తరువాత తమ పార్టీ (వైకాపా) కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తుందని” నోరుజారడంతో, ఆయనకి వైకాపా తలుపులు మూసుకుపోయాయి.

 

ఆ తరువాత నుండి మళ్ళీ ఆయన నిఖార్సయిన కాంగ్రెస్ నాయకుడిలాగే వ్యవహరిస్తూ, అందివచ్చిన సమైక్యాంధ్ర ఉద్యమంతో మాజీ సీయం కిరణ్ కుమార్ రెడ్డికి క్రమంగా దగ్గరయ్యారు. ఆనక కాంగ్రెస్ అధిష్టానం బహిష్కరణ వేటు వేయడంతో, కాంగ్రెస్ నుండి వేరుపడి కొత్త పార్టీ పెట్టుకొన్న కిరణ్ కుమార్ రెడ్డితో ఆయన కూడా సమైక్యమయిపోయారు. ఈసారి జైసాపా పార్టీ టికెట్ మీద వైజాగ్ నుండి లోక్ సభకు పోటీ చేస్తున్నారు.

 

ఆయన వైజాగ్ ఎంచుకోవడానికి ప్రధాన కారణం తను పార్టీలో చేరక ముందే తన మొహం మీద తలుపులేసి అవమానించిన వైకాపాపై ప్రతీకారం తీర్చుకోవడానికే! ఈసారి ఎన్నికలలో తాను గెలవకపోయినా పరువాలేదు కానీ విజయమ్మ గెలవకుండా అడ్డుపడగలిగితే ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలిని ఓడించిన ఘనత దక్కుతుంది. అంతే గాక తమ పార్టీ గౌరవాధ్యక్షురాలినే గెలిపించుకోలేకపోయినందుకు వైకాపాకు తీరని అవమానమే. ఆవిధంగా వైకాపా ప్రతీకారం తీర్చుకోన్నట్లవుతుందని సబ్బం హరి ఆలోచన.

 

సబ్బం హరి అందుకు సమర్దుడేనని చెప్పవచ్చును. బీజేపీ తరపున వైజాగ్ నుండి లోక్ సభకు పోటీ చేస్తున్న కంబంపాటి హరిబాబు పేరు వైజాగ్ ప్రజలు విని ఉండకపోవచ్చునేమో కానీ వైజాగ్ కి మాజీ మేయర్ గా విశేష సేవలందించిన సబ్బం హరి గురించి తెలియని వారుండరు. స్థానికుడయిన ఆయనకు అనేకమంది అనుచరులున్నారు, అన్ని పార్టీల నేతలతో మంచి పరిచయాలు ఉన్నాయి. అందువలన ఆయన ఈ ఎన్నికలలో తాను గెలిచినా గెలవకున్నా విజయమ్మ విజయావకాశాలకు గండి కొట్టగల సమర్ధుడు.

 

ఆయన కాంగ్రెస్ లేదా బీజేపీ అభ్యర్ధులలో ఎవరో ఒకరికి లోపాయికారిగా సహకరించి నట్లయితే విజయమ్మ విజయం అనుమానమే అవుతుంది. ఎన్నికల తరువాత కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలున్నాయని ఆయన భావించినట్లయితే ఆ పార్టీ అభ్యర్ధికి సహకరించవచ్చును. తద్వారా ఎన్నికల తరువాత ఆయన బీజేపీలోకి మారిపోయి, చేసిన సహాయానికి ప్రతిఫలంగా ఏ రాజ్యసభ సీటులోనో ఒద్దికగా సర్దుకు పోవచ్చును. అందువల్ల ఒకవేళ విజయమ్మ ఓడిపోయినట్లయితే ఆమె ఓటమికి సబ్బం హరే కారణమని చెప్పవలసి ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి మనసు మార్చుకొని ఆయనతో రాజీపడినట్లయితే, ఆయన విజయమ్మకే సహకరించినా ఆశ్చర్యం లేదు.

By
en-us Political News

  
ఒడిశాకు చెందిన ఒక నిరుపేద వ్యక్తి తన సోదరి మరణానంతరం ఆమె బ్యాంకు ఖాతాలో ఉన్న ఇరవై వేల రూపాయలు విత్ డ్రా చేసుకోవడానికి బ్యాంకును సంప్రదించాడు. ఆ డబ్బుతో ఆమె అంత్యక్రియల తాలూకు ఖర్చులు లేదా ఇతర అవసరాలు తీర్చుకోవాలని చెప్పాడు.
గత ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియా వేదికగా రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని చేసిన దాడుల కేసులో వైసీపీ సోషల్ మీడియా అప్పటి ఇన్‌ఛార్జ్ సజ్జల భార్గవ్‌రెడ్డిని పులివెందుల పోలీసులు విచారించారు. సుమారు 9 గంటల పాటు సాగిన ఈ విచారణలో పోలీసులు ఆయనపై దాదాపు 70 ప్రశ్నలను సంధించారు.
బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రాష్ట్ర స్థాయి కమిటీ మినహా అన్ని కమిటీలను పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ రద్దు చేశారు.
బీఆర్ఎస్ 25వ వ్యవస్థాపక దినం పురస్కరించుకుని కేసీఆర్, కేటీఆర్ కవిత వ్యాఖ్యలకు దీటుగా సమాధానం ఇస్తారని ఆశించారు. అయితే అందుకు భిన్నంగా కేసీఆర్, కేటీఆర్ ల మౌనం అందరినీ విస్మయపరిచింది.
తమిళనాడులో ఎన్నికల పోలింగ్‌ ముగియడంతో.. అన్ని పార్టీలూ గెలుపు అంచనాల్లో నిమగ్నమయ్యాయి.
రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండుతుండటం, వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉండటంతోనే బహిరంగ సభ నిర్వహించకూడదని పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారని కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇచ్చిన వివరణ నమ్మశక్యంగా లేదని పార్టీ శ్రేణులే పెదవి విరుస్తున్నాయి.
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం ప్రసంగించిన కేటీఆర్.. 14ఏళ్లపాటు పోరాటం చేసి కేసీఆర్ తెలంగాణ సాధించారన్నారు.
శాసనమండలి కార్యాలయంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఈ ఇరువురి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
ముఖ్యంగా కవిత టీఆర్ఎస్ పార్టీ.. బీఆర్ఎస్ పార్టీని క్లిష్టపరిస్థితుల్లోకి నెట్టేసింది. బీఆర్ఎస్ అధినేత సొంత కుటుంబం నుంచే తిరుగుబాటు రావడం ఆ పార్టీ క్యాడర్ ను అయోమయంలో, గందరగోళంలో పడేసింది. పైగా కవిత.. పార్టీ పేరు టీఆర్ఎస్ కావడంతో బీఆర్ఎస్ పరిస్థితి వెంటిలేటర్ పైకి వెళ్లేలా మార్చిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ప్రతిపక్షాలు సమర్పించిన ఈ నోటీసులో ప్రధానంగా ఎన్నికల నిర్వహణలో పారదర్శకత లోపించిందని, నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించాయి. ఈ వ్యవహారంలో వివిధ పార్టీలకు చెందిన సభ్యులు ఏకతాటిపైకి వచ్చి నోటీసు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.
గతంలో ఇదే 152 స్థానాల పరిధిలో బీజేపీ బలం కేవలం 59 సీట్లు మాత్రమే. అయితే ఇప్పుడు ఆ సంఖ్యను రెండింతలు చేసి 110కి చేర్చడం అంటే అది సామాన్యమైన విషయం కాదు.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామక ప్రక్రియ ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన ప్రొఫెసర్ ఎం. కోదండరాం, మాజీ క్రికెటర్ మొహమ్మద్ అజారుద్దీన్ పేర్లకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా శనివారం ఆమోద ముద్ర వేశారు. దీనికి సంబంధించిన ఫైలుపై గవర్నర్ సంతకం చేయడంతో.. వీరిద్దరి నియామకానికి మార్గం సుగమమైంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.