ఈ లోకమే వండి వార్చడానికి వేదికరా... ఎన్ డి ఎ నేతలకు నడ్డా నోరూరించే విందు
Publish Date:Jun 9, 2024
Advertisement
ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా
ఈ లోకమే వండి వార్చడానికి వేదికరా ఉలవచారు బిర్యానీ చిత్రంలో ఈ సాంగ్ గుర్తొచ్చే విధంగా ఉంది మోదీ ప్రమాణ స్వీకారోత్సవంలో నడ్డా విందు.
ఢిల్లీలో ఇవాళ కేంద్ర మంత్రివర్గ ప్రమాణ స్వీకారం అనంతరం ఎన్డీయే ఎంపీలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పసందైన విందు ఇస్తున్నారు. ఈ డిన్నర్ పార్టీకి సంబంధించిన మెనూ కూడా వెల్లడైంది.
ఢిల్లీలో అత్యధక ఊష్ణోగ్రతల రీత్యా ఈ విందులో ఐదు రకాల ఫ్రూట్ జ్యూస్ లు, వివిధ ఫ్లేవర్లలో షేక్ లు, స్టఫ్డ్ లిచీ, మట్కా కుల్ఫీ, మ్యాంగో క్రీమ్, మూడు ఫ్లేవర్లలో రైతా అందించనున్నారు. అంతేకాదు, జోధ్ పురీ సబ్జి, పప్పు, దమ్ బిర్యానీ, ఐదు రకాల రొట్టెలు వడ్డించనున్నారు. రుచికరమైన పంజాబీ వంటకాల కోసం ప్రత్యేకంగా ఫుడ్ కౌంటర్ ను ఏర్పాటు చేస్తున్నారు.
తృణధాన్యాలను (మిల్లెట్స్) ఇష్టపడే వారి కోసం బజ్రా కిచిడీ సిద్ధం చేస్తున్నారు. తీపి ఇష్టపడే వారి కోసం ఎనిమిది రకాల డిజర్ట్ లు, రసమలై, నాలుగు వెరైటీల్లో ఘేవర్... స్పెషల్ టీ, కాఫీ అందుబాటులో ఉంచుతున్నారు.
వరసగా ప్రధానిగా మూడోసారి నరేంద్రమోడీ నేడు ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఇందుకు రాష్ట్రపతి భవన్ వేదిక కాబోతోంది. సాయంత్రం 7.15 నిమిషాలకు ప్రధానిగా మోడీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇప్పటికే ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. మరోవైపు మోడీ 3.0 కేబినెట్‌లో చోటు దక్కించుకున్న ఎంపీలు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. మరోవైపు భారత ఇరుగుపొరుగు దేశాలైన బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, భూటాన్, మాల్దీవులు, షీసెల్స్, మారిషన్ దేశాలకు చెందిన దేశాధినేతలు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు
ఇదిలా ఉంటే, ప్రమాణస్వీకారం ముగిసిన తర్వాత జేపీ నడ్డా కొత్తగా ఎన్నికైన ఎన్డీయే ఎంపీలకు విందు ఏర్పాటు చేశారు. డిన్నర్ మెనూలో నోరూరించే వంటకాలు ఉన్నాయి. వివిధ రకాల జ్యూస్‌లో పాటు స్టఫ్డ్ లీచీ, మట్కా కుల్ఫీ, మ్యాంగో క్రీమ్‌తో సహా వేడిన రైతాను అందించనున్నారు.డిన్నర్‌లో జోధ్‌పురి సబ్జీ, దాల్, దమ్ బిర్యానీతో సహా ఐదు రకాల బ్రెడ్స్‌ని ఏర్పాటు చేశారు. పంజాబీ ఫుడ్ కౌంటర్ కూడా ఉంది. మిల్లెట్లను ఇష్టపడే వారికి బజ్రా కిచిడీ, రసమలై మెనూలో ఉంది.
http://www.teluguone.com/news/content/s-this-world-a-platform-for-cooking-a-mouthwatering-feast-for-nda-leaders-25-178212.html





