రఘురామకృష్ణం రాజు పోటీ ఎక్కడ.. పార్టీ ఏది?

Publish Date:Aug 20, 2023

Advertisement

ఏపీలో ఎన్నికల సమయం సమీపిస్తోంది. రాజకీయ పార్టీలన్నీ తమ తమ వ్యూహాలలో, ఎత్తుగడలతో రెడీ అయిపోతున్నాయి. పొత్తుల విషయంలో చర్చ జోరుగా సాగుతోంది. పంచాయతీలు, వార్డు సభ్యులకు తాజాగా జరిగిన ఉప ఎన్నికలలో అధికార పార్టీకి జనం దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు. పట్టణాలు, నగరాలలో ఏదో కొంత వ్యతిరేకత ఉంటే ఉండొచ్చు కానీ.. పల్లెల్లో మాకు తిరుగేలేదని ధీమాతో ఉన్న అధికార వైసీపీకి.. జనం పల్లెలెటలా కదులుతున్నాయో శాంపిల్ చూపించేశారు.

ఒక వైపు రాజకీయ వాతావరణం హీటెక్కి ఉంటే.. కొన్ని స్థానాలలో ఎవరు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు? పొత్తులు ఉంటే.. ఎవరు ఏ పార్టీ టికెట్ మీద పోటీ చేస్తారు అన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తం అవుతోంది. అలా రాష్ట్రం మొత్తం ఆసక్తి కనబరుస్తున్న అంశం వైసీపీ రెబల్ ఎంపీ రాఘురామ కృష్ణం రాజు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు అన్నదే. ట్రిపులార్ అన్నా, రఘురామకృష్ణం రాజు అన్న ఎవరికీ  ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అవును వైసీపీ రెబల్ ఎంపీగా నిత్యం వార్తల్లో ఉంటూ జగన్ సర్కార్ తప్పులను మా ప్రభుత్వం, మావాడు అంటూనే ఎండగట్టే నరసాపురం ఎంపీ.  గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ టికెట్ మీద నర్సాపురం నుంచి గెలిచారు. అలా గెలిచారు.. ఇల అసమ్మతి ఎంపీగా ముద్ర పడ్డారు.  

రాష్ట్ర ప్రభుత్వాన్ని మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి క్రమం తప్పకుండా ప్రతిరోజూ రచ్చబండకు ఈడుస్తునే ఉన్నారు. సర్కార్ అగ్రహానికి గురయ్యారు. జగన్ రెడ్డి సీఐడీ పోలీసులు ఆయనకు, థర్డ్ డిగ్రీ రుచి చూపించారు. నిజానికి చెప్పాలంటే అయన కథ చాలానే వుంది. 

అది పక్కన పెట్టి ప్రస్తుతంలోకి వస్తే ... ఇప్పడు ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అయన తెలుగు దేశం పార్టీలో చేరేందుకు పావులు కదుపుతునట్లు రాజకీయవర్గాలలో గట్టిగా వినిపిస్తోంది.  నిజానికి,గతంలో రఘురామ కృష్ణం రాజు.. బీజేపీకి సన్నిహితంగా మెలిగారు. ఒక దశలో ఆయన కాషాయం కట్టేసినట్లేననే వార్తలు కూడా వచ్చాయి. అయితే, కారాణాలు ఏవైనా, ఆయన బీజేపీలో చేరలేదు. అయితే, బీజేపీతో సన్నిహితంగా మెలుగుతూ వచ్చారు. కానీ, గత కొంత కాలంగా ఆయన బీజేపీతో లాభం లేదనే నిర్ణయానికి వచ్చారో ఏమో కానీ, కొత్త పంథాను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. రాజకీయాలలో కొనసాగేందుకు తెలుగుదేశంలో చేరే  ఆలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు. 

  ఇంతకాలం టీడీపీ, జనసేన కూటమిలో బీజేపే కూడా జట్టుకడుతుందనే నమ్మకంతో ఉన్న ఆయన,ఇటీవల చోటి చేసుకున్న పరిణామాల నేపథ్యంలో  బీజేపీపై ఆశలు వదులుకున్నట్లు తెలుస్తోంది. గత కొంత కాలంగా తాను నరసాపురం నుంచే పోటీ చేస్తాననీ, అయితే ఏ పార్టీ అన్నది త్వరలో నిర్ణయించుకుంటాననీ చెబుతూ వచ్చిన ఆయన ఇప్పుడిక తెలుగుదేవం గూటికే చేరాలని నిర్ణయానికి వచ్చేసిన ట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇటీవల  రెండురోజులపర్యటనకు ఢిల్లీ వెళ్ళిన తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు తెలుగుదేశం ఎంపీలతో కలిసి కృష్ణం రాజు కూడా స్వగతం పలికారు.  ఆ సందర్భంగానే తాను నరసాపురం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా లోక్ సభకు పోటీ చేయాలని ఆశిస్తున్నట్లు ఆ సందర్భంగా చంద్రబాబుకు చెప్పినట్లు తెలుస్తోంది.  ఒక వేళ నరసాపురం కుదరకపోతే..   మరే లోక్‌సభ నియోజకవర్గం టికెట్‌ను అయినా తనకు కేటాయించాలని కోరినట్లు చెబుతున్నారు. చంద్రబాబు కూడా రఘురామరాజు విజ్ణప్తికి సానుకూలంగా స్పందించారని అంగటున్నారు. 

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అత్యంత కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ భిన్నమైన వైఖరిని ప్రదర్శించారు.  ప్రధాని మోదీతో ఆదివానం ఒకే వేదిక పంచకున్న తమిళనాడు సీఎం విజయ్.. ఆ బహిరంగ వేదికపైనే  రాష్ట్ర సమస్యలను, అలాగే  రావాల్సిన నిధులను ప్రస్తావించి అందరి దృష్టినీ ఆకర్శించారు. ప్రధాని వేదికపైనే ఆసీనులై ఉన్నప్పటికీ, ఏమాత్రం సంకోచించకుండా రాష్ట్ర ప్రయోజనాలే తమకు అత్యంత ముఖ్యమని విజయ్ కుండబద్దలు కొట్టారు. 
 సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేయే ప్రభుత్వ విధానాలపై న్యాయపోరాటానికి దిగడం, తనకు జరిగిన అన్యాయంపై పార్టీ హైకమాండ్ కూ, సీఎం రేవంత్ రెడ్డి తీరుపై అగ్రనేత రాహుల్ కు ఫిర్యాదు చేస్తానంటూ హెచ్చరికలు జారీ చేయడం సంచలనంగా మారింది.  
జగన్ అక్రమాస్తులకేసుల విచారణను వేగవంతం చేయాలని ఈడీ కోర్టును ఆశ్రయించడాన్ని సమర్ధించిన తెలుగుదేశం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. ఈ కేసులను  కేవలం రోజువారీ విచారణ కాకుండా, ప్రతి రోజూ, రోజంతా విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.  
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఇండియా కూటమి నేతల విజ్ణప్తికి నో చెప్పారు. తనను కలవాలంటూ ఇండియా కూటమి నేతలు చేసిన అభ్యర్థనను ఆయన తిరస్కరించారు. రాజకీయ పార్టీల నేతలతో సమావేశం కావడం కుదరదని విస్పష్టంగా తేల్చేశారు.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్ల ఖరారు వంటి   కీలకమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకునే నిమిత్తం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశానికి  జనసేన అధినేత, ఉప ముఖ్య మంత్రి  పవన్ కల్యాణ్‌తో పాటు జనసేన మంత్రుల గైర్హాజర్ పొలిటికల్ చర్చలకు వేదికగా మారింది.
2015లో ప్రారంభమైన ఈ పథకం కృష్ణా డెల్టా రైతులకు సాగునీటి భరోసా కల్పించడంలో కీలకంగా నిలిచింది.   కృష్ణా డెల్టాలో సాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు నీటి లభ్యతను స్థిరీకరించాలనే ఉద్దేశంతో నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు నూటికి నూరు శాతం ఫలితాలను సాధించింది.
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు. 
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.