హంటర్ బైక్.. ఈ క్రేజ్ ఏంట్రా నాయనా!

Publish Date:Aug 20, 2023

Advertisement

రాయల్ ఎన్‌ ఫీల్డ్ బైక్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. అటు పాతతరం.. ఇటు కొత్త తరాన్ని ఒకేలా ఆకర్షించే బైక్ ఏదైనా ఉందంటే అది రాయల్ ఎన్ ఫీల్డ్ అనే చెప్పుకోవచ్చు. మన భారతీయులు ముద్దుగా బుల్లెట్ బండి అని పిలుచుకునే ఈ బైకుపై మనసు పారేసుకుని రైడర్ ఉండరేమో. బైక్ కొనాలంటే ఎన్ ఫీల్డ్ మాత్రమే కొనాలని కలలు కనే కుర్రాళ్లే ఎక్కువ మంది ఉంటుంటారు. తన భర్తతో బుల్లెట్ బండెక్కి షికార్లు కొట్టాలనుకోని మహిళ ఉండదంటే అతి శయోక్తి కాదు. బుల్లెట్ బండెక్కి వచ్చేతప్పా.. పాట అని లక్షల వ్యూస్ సాధించడానికి బుల్లెట్ బైక్ పై యువతలో ఉన్న క్రేజ్ కూడా ఒక కారణం. ఎన్ ఫీల్డ్ స్టైలిష్ లుక్ తో పాటు 350 సీసీ, 500 సీసీలతో ఈ బైక్ సామర్ధ్యం కూడా బైక్ లవర్స్ ను ఆకర్షిస్తుంటుంది. అయితే, కొనాలనే మనసు ఉన్నా చాలామంది దీని ధర విషయంలో వెనకడుగు వేస్తుంటారు. ఎందుకంటే ఎన్ ఫీల్డ్ నుండి 350 సీసీ బైక్ సొంతం చేసుకోవాలంటే కనీసం రెండు లక్షలు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఈ ధరను చెల్లించగలిగిన వారు సొంతం చేసుకుంటుంటే మధ్య తరగతి కుటుంబాలలో చాలా మంది ప్రత్యామ్నాయ బైకులపైకి వెళ్లే వారు. దీన్ని దృషిలో పెట్టుకొనే ఎన్ ఫీల్డ్ మిడ్ సైజ్ సెగ్మెంట్ లో ఒక బైకు తీసుకొచ్చింది. అదే ఎన్ ఫీల్డ్ హంటర్ 350. 

రాయల్ ఎన్‌ఫీల్డ్ తన చవకైన బైక్ గా హంటర్ 350ని 2023 సంవత్సరం ఆగస్టులో తీసుకొచ్చింది. ఇది రూ.1.5 లక్షల ప్రారంభ ధరతో విడుదల చేయగా.. ఈ రేంజ్ ధర కలిగిన మిగతా అన్ని కంపెనీలను తలదన్నేలా ఇప్పుడు రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 దూసుకెళ్తుంది. కేవలం ఏడాది కాలంలోనే ఎన్ ఫీల్డ్ హంటర్ రికార్డు స్థాయి అమ్మకాలతో దూసుకెళ్లింది. హంటర్ 350 ఈ ఏడాది ఫిబ్రవరికే మన దేశంలో లక్ష యూనిట్లు అమ్ముడు కాగా ఈ ఐదు నెలల్లో మరో లక్ష యూనిట్ల సేల్స్ తో దుమ్మురేపింది. ప్రస్తుతం భారత్‌తోపాటు ఇండోనేషియా, జపాన్, దక్షిణ కొరియా, థాయిలాండ్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, బ్రిటన్, అర్జెంటీనా, కొలంబియా, మెక్సికో, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ వంటి దేశాల్లో ఈ బైక్స్ సేల్స్ జరుగుతుండగా.. త్వరలోనే బ్రెజిల్ లో కూడా ఆవిష్కరిస్తున్నారు. 

ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న కాంపాక్ట్ బైకులలో హంటర్-350 అత్యంత చౌకగా అందుబాటులోకి రావడం యువత  దీని వైపు మళ్లేలా చేసింది. ఇందులో 17 అంగుళాల అల్లాయ్  వీల్స్, బైక్ హ్యాండిల్స్, డైరెక్షన్ మార్పులు డిఫరెంట్ గా ఉండడం యువతను ఎక్కువగా ఆకట్టుకుంటున్నది. హంటర్-350తోపాటు మార్కెట్లోకి వచ్చిన క్లాసిక్-350, మీటర్-350 బైక్స్‌లోనూ 349సీసీ ఇంజిన్ ఉంది. కానీ హంటర్-350 బైక్ పట్ల చాలా మంది ఆసక్తిగా ఉన్నారు. అందుకే ఈ స్థాయి సేల్స్ సాధ్యమవుతున్నది. హంటర్-350 రెండు వేరియంట్లలోనూ 349సీసీ సింగిల్ సిలిండర్, ఎస్ఓహెచ్సీ, ఎయిర్ లేదా ఆయిల్ కూల్డ్ ఇంజిన్ విత్ 5-స్పీడ్ గేర్ బాక్స్ కలిగి ఉంటుంది. 6100 ఆర్పీఎంపై 20.2 బీహెచ్పీ, 4000 ఆర్పీఎంపై 27 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. ఫ్రంట్ అండ్ రేర్ డిస్క్ బ్రేక్‌లు, డ్యుయల్ చానెల్ ఏబీఎస్, ఎల్ఈడీ టెయిల్ లైట్, డ్యుయల్ టోన్ పెయింట్ థీమ్ వంటి ఫీచర్లు ఉంటాయి. రెట్రో వేరియంట్ లో డ్రమ్ బ్రేక్, సింగిల్ చానెల్ ఏబీఎస్, వైర్ స్పోక్ వీల్స్, సింగిల్ టోన్ కలర్ స్కీమ్స్ ఉన్నాయి. 

రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 పరిమాణం పరంగా వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే ఈ బైక్ యొక్క కొలతల విషయానికి వస్తే, దీని పొడవు 2,055 మిమీ, వెడల్పు 800 మిమీ, ఎత్తు 1,055 మిమీ కలిగి ఉంటుంది. వీల్‌బేస్ 1,370 మిమీ వరకు ఉంటుంది. ఇక సీట్ ఎత్తు భూమి నుండి 800 మిమీ వరకు ఉంటుంది. కావున రైడర్ కి మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తుంది. మరోవైపు రౌండ్ టర్న్ ఇండికేటర్స్, రౌండ్ టెయిల్ లైట్ కూడా ఇందులో ఉంది. దీని లుక్ రెట్రో తరహాలో ఉండటం మరో ప్లస్ పాయింట్. తక్కువ ధరలో రెట్రో లుక్ ఉన్న రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ దక్కించుకోవడం ఎవరినైనా ఇట్టే ఆకర్షిస్తుంది. ఇక ఈ రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 రంగుల విషయానికి వస్తే ప్రస్తుతం మార్కెట్లో రెబెల్ బ్లూ, రెబెల్ రెడ్, రెబెల్ బ్లాక్, డాపర్ యాష్, డాపర్ వైట్, డాపర్ గ్రే కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది.

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
 తిరుపతి, ఏలూరు, శ్రీకాకుళం, సాలూరు,  పిఠాపురం ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల సీట్ల సర్దుపాట్లు కూటమి శ్రేణుల మధ్య అగాధాన్ని పెంచుతూ ఐక్యతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత గడ్డ అయిన ఉమ్మడి కడప జిల్లాలో ఆ పార్టీకి తీవ్ర రాజకీయ ప్రతికూలత ఎదురౌతోందని చెప్పడానికి స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియే నిలువెత్తు నిదర్శనంగా చెబుతున్నారు.
కమ్మ నాయకుడు ఏబీవీకి స్వతంత్ర అభ్యర్థిగా మద్దతు ఇస్తూ, కాపు నాయకుడు  వంగవీటి రాధను జనసేనలోకి పంపారన్నది విజయసాయి రెడ్డి ఆరోపణ.  కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంలు ఏబీవీకి మద్దతు ఇవ్వడాన్ని కూడా ఆయన చంద్రబాబు వ్యూహంగానే అభివర్ణిస్తున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఏకగ్రీవాలకు  అవకాశం ఇవ్వకూడదని వైసీపీ అధినేత జగన్ పలు మార్లు విస్పష్టంగా చెప్పినా, ఆయనకు అత్యంత బలమైన పట్టు ఉన్న కడప జిల్లాలోనే కీలకమైన రెండు మునిసిపాలిటీలు ఏకగ్రీవం కావడం పార్టీపై జగన్ పట్టు సడలిందా అన్న అనుమానాలను తావిస్తోంది.
పుంగనూరుతో పాటు రాయచోటి, ధర్మవరం తదితర ప్రాంతాల్లో నామినేషన్ల దాఖలు సమయంలో ఉద్రిక్తతలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలను ప్రస్తావిస్తూ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి సరిగా లేదన్న వాదనతో కేంద్ర బలగాలను రంగంలోకి దించాలని వైసీపీ   ప్రయత్నించింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉండే బెజవాడ రాజకీయం మరోసారి వేడెక్కింది.
గుంపులను చెదరగొట్టేందుకు  టియర్ గ్యాస్   ప్రయోగించారు. అప్పటికీ పరిస్థితి అదుపులోకి రాలేదు. దీంతో  భద్రతా దళాలు ఆరు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపి ఆందోళనకారులను చెదరగొట్టాయి. 
బిల్లులకు అవసరమైన మద్దతు   లభిస్తుందనే ధీమాతో కేంద్రం పార్లమెంటు ప్రత్యేక సమావేశాల నిర్వహణకు నడుంబిగించిందని అంటున్నారు. అయితే రాజ్యాంగ సవరణ అవసరమైన ఈ బిల్లులకు సభలో మూడింట రెండొంతుల మోజారిటీ అవసరం.  కేంద్రం ఆ మద్దతును సమకూర్చుకోగలుగుతుందా అన్న విషయంపై సర్వత్రా ఆసక్తి, ఉత్కంఠ వ్యక్తమౌతోంది. 
ఎడతెగని చర్చలు, మంతనాల అనంతరం, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి మధ్య సీట్ల కేటాయింపు ప్రక్రియ  పూర్తయింది.
ఇలాంటి అణచివేత చర్యలు, అరెస్టులు  పరిస్థితిని మరింత దిగజార్చుతాయని పేర్కొన్నారు. ఇంత కాలం కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని, బీజేపీని జగన్ నేరుగా విమర్శించిన లేదా వ్యతిరేకించిన సందర్భం లేదు. అటువంటి జగన్ ఇప్పుడు బొద్దింకల ఉద్యమానికి మద్దతుగా మాట్లాడటం, ఆ పార్టీ నేతల అరెస్టులను ఖండించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
చంద్రబాబుతో భేటీలో  ప్రధానంగా చెన్నై నగర తాగునీటి అవసరాలు,  తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా అదనపు నీటి కేటాయింపులపై చర్చ జరిగింది.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.