Publish Date:Aug 27, 2024
మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే, వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయకురాలు ఆర్కే రోజా వైసీపీకి గుడ్ బై చెప్పేశారా? ఇక దేవుడిచ్చిన జగనన్న ముఖం కూడా చూడకూడదని నిర్ణయించేసుకున్నారా? అంటే ఔననే సమాధానమే వస్తోంది. ఆమె తన సోషల్ మీడియా ఖాతాల నుంచి వైసీపీనీ, జగన్ ను అన్ ఫాలో అయ్యారు. అలా వైసీపీని అన్ ఫాలో చేయడం ద్వారా ఇక తనకు ఆ పార్టీతో ఎటువంటి సంబంధం లేదని చెప్పకనే చెప్పేశారు.
ఆమె హఠాత్తుగా తీసుకున్న ఈ నిర్ణయంతో గత కొంత కాలంగా ఆమె తమిళనాడు నుంచి తన రాజకీయ ప్రయాణాన్ని ఫ్రెష్ గా మెదలు పెట్టనున్నారని జరుగుతున్న ప్రచారానికి బలం చేకూర్చారని పరిశీలకులు అంటున్నారు. వైసీపీ శ్రేణులు కూడా ఇక రోజాకు ఏపీతో, వైసీపీతో బంధం తెగిపోయి నట్లేనని చెబుతున్నారు. వాస్తవానికి ఒక్క రోజా అనే కాదు ఇటీవలి ఘోర పరాజయం తరువాత పలు వురు వైసీపీ సీనియర్లు పార్టీకి దూరం అయ్యారు. అధికారంలో ఉన్నంత కాలం, స్థాయి కూడా చూసుకోకుండా ఇష్టారాజ్యంగా తెలుగుదేశంపైనా, ఆ పార్టీ అగ్రనాయకుల మీదా నోరెట్టుకు పడిపోయిన వాళ్లంతా ఇప్పుడు నోరుకుట్టుకుని మౌనాన్ని ఆశ్రయిస్తున్నారు. విడదల రజని, అనిల్ కుమార్ యాదవ్, కొడాలి నాని, వల్లభనేని వంశి, గుడివాడ అమర్నాథ్ ఇలా వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం స్థాయి మరిచి చెలరేగిన నేతలెవరూ ఇప్పుడు కాగడా పెట్టి వెతికినా కనిపించడం లేదు.
ఆ కోవలోనే రోజా కూడా నడుస్తున్నారు. సినీ నటిగా ఆమెకు తమిళనాట ఉన్న క్రేజ్, గుర్తింపునకు తోడు దర్శకుడిగా రోజా భర్త సెల్వమణికి కూడా ఆ రాష్ట్రంలో ఒకింత పలుకుబడి ఉండటంతో రోజా సేఫ్ సైడ్ గా తమిళనాడుకు మకాం మార్చేశారని వైసీపీ వర్గాలే బెబుతున్నాయి. ఇప్పుడామె తమిళనాడు వేదికగా పోలిటిక్స్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సమాయత్తమౌతున్నారని అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/roja-unfollow-ycp-and-jagan-25-183693.html
ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన చందాదారులను ఆకట్టుకునేందుకు మరో వినూత్నమైన ఆఫర్‌ను ముందుకు తెచ్చింది.
ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న భూ సమస్యల పరిష్కారంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
భాగ్యనగరంలో వరుస ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
పాతబస్తీ రాజకీయాల్లో కీలక నేతగా, ఎంఐఎం శాసనసభా పక్ష నేతగా కొనసాగుతున్న అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపాయి.
తెలంగాణ సాంస్కృతిక ఆత్మకు ప్రతీక అయిన బతుకమ్మ సంబరాలను ఈ ఏడాది అత్యంత వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది.
భార్యాభర్తల బంధం అంటే కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా నిలవడం.. జీవితాంతం కలిసి నడవడం. కానీ.. మధ్యప్రదేశ్‌లో ఓ భర్త డబ్బు కోసం ఆ బంధానికే తూట్లు పొడిచాడు.
దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో భారత సంతతి పైలట్ స్మిత్ మచ్చర్‌పై కో-పైలట్ హమామ్ అల్ హమామీ దాడికి పాల్పడిన ఘటన ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.
భారతదేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన యూపీఐ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.
పెట్రోల్‌లో ఇథనాల్ కలపడాన్ని ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వ తాజా విధానాలు ఇప్పుడు సామాన్యుల వంటగదిపై తీవ్ర ప్రభావం
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి.
వికారాబాద్ జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన అనంతగిరి హిల్స్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
హైదరాబాద్ నగరంలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది.
గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని చారిత్రాత్మక బాపూఘాట్ వద్ద జాతిపిత మహాత్మా గాంధీకి రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నివాళులు అర్పించింది.