యాడకి పోయనారబ్బా...! 

Publish Date:Oct 6, 2023

Advertisement

ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజాపై టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణ మూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆర్కే రోజా మీడియా ముందుకొచ్చి కన్నీటి పర్యంతమవుతూ.. బండారు సత్యనారాయణ మూర్తిపై నిప్పులు చెరిగారు. అంతవరకు ఓకే కానీ.. ఆర్కే రోజాపై ఇంతగా అబండాలు వేస్తే.. తన సొంత పార్టీ నుంచే ఆమెకు మద్దతు లభించకపోవడం పట్ల ఫ్యాన్ పార్టీలోని ఓ వర్గం తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తుంది. ఇక సహచర మహిళా మంత్రులు విడదల రజినీ, తానేటి వనిత, ఉష శ్రీ చరణ్‌లు స్పందించి ఉంటే బాగుండేదనే ఓ అభిప్రాయం సైతం సదరు వర్గంలో వ్యక్తమవుతోంది. కనీసంలో కనీసంగా హోం మంత్ర తానేటి వనిత అయినా స్పందించి ఉండాల్సిందనే చర్చ సైతం ఆ వర్గంలో కొన.. సాగుతోంది. 

పోని జగన్ తొలి కేబినెట్‌లో నోరున్న మంత్రులు నాని బ్రదర్స్, అనిల్ కుమార్ యాదవ్, వెల్లంపల్లి శ్రీనివాస్, కురసాల కన్నబాబు వగైరా వగైరా.. అలాగే ప్రస్తుత కేబినెట్‌లోని మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్, గుడివాడ అమర్నాథ్ ఎక్సెట్రా ఎక్సెట్రా అయినా స్పందించి ఉంటే.. మీకు అండగా మేమంతా ఉన్నామంటూ.. ఆర్కే రోజాకు ఓ భరోసా కల్పించినట్లుగా ఉండేదని చర్చ సైతం సదరు వర్గంలో నడుస్తోంది. 

అయినా ఫ్యాన్ పార్టీని తిడితే నన్ను తిట్టినట్టే.. మా పార్టీ అధినేత సీఎం వైయస్ జగన్‌ని విమర్శిస్తే.. నన్ను విమర్శంచినట్లేనంటూ.. అటు టీడీపీ, ఇటు జనసేన పార్టీల అధినేతలపై ఓ రేంజ్‌లో విరుచుకు పడిపోయే రోజమ్మకు రాకూడని కష్టం కమ్ముకొచ్చిందనే ఓ చర్చ సైతం ఫ్యాన్ పార్టీలోని ఆ వర్గంలో వైరల్ అవుతోంది.  

అయినా తమ పార్టీలోనే నేతలంతా.. పార్టీ అధినేత వైయస్ జగన్‌పై విమర్శలు గుప్పిస్తేనే స్పందిస్తారా? అంతేకానీ.. సహచర మంత్రికి కష్టం వచ్చినప్పుడు స్పందించే గుణం వారికి లేదా అనే ఓ విధమైన సందేహం సైతం ఆ వర్గంలో పెల్లుబికుతోంది. అదీకాక  తిరుమలలో ఆ దేవదేవుడిని సందర్శించుకొన్న తర్వాత ఆనందనిలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ కూడా ప్రతిపక్ష పార్టీల నేతలపై తన మాటలతో ఆర్కే రోజా విరుచుకు పడిపోతుందని.. అంతేకానీ.. దేవుడి దర్శనానికి వచ్చాం.. ఈ సమయంలో రాజకీయాలు మాట్లాడకూడదనే కనీస జ్జానం కూడా ఆమెలో ఏ కోశాన లేదని సదరు వర్గంలో విమర్శలు అయితే వెల్లువెత్తుతోన్నాయి. 

అదీకాక అటు వెండితెర మీదే కాదు.. ఇటు బుల్లి తెర మీద సైతం ఎన్నీ ప్రోగ్రామ్ సింగిల్ హ్యాండ్ అన్నట్లు ఆర్కే రోజా  వ్యవహరించేదని.. కానీ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. ఆ కార్యక్రమాలకు సాధ్యమైనంత దూరంగా ఉంటుందని..  అలాంటి వేళ.. ఇటువంటి పరిస్థితుల్లో కనీసం చిత్ర సీమలోని వారైనా ఆర్కే రోజాకు మద్దతుగా మీడియా ముందుకు వచ్చి.. బండారు సత్యనారాయణ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు ఓ ప్రకటన చేసినా బాగుండేదనే ఓ అభిప్రాయం సైతం సదరు వర్గంలో వినిపిస్తుంది. 

అయినా టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుపైన.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పైన.. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌పైన.. చిన్నంతరం పెద్దంతరం అనేదే లేకుండా తమ మాటలతో దాడికి దిగే ఆర్కే రోజా లాంటి వాళ్లకి ఇటువంటి శాస్తి తప్పక జరగాల్సిందేనని ఫ్యాన్ పార్టీలోని సదరు వర్గం క్లియర్ కట్‌గా స్పష్టం చేస్తుంది. పోనీ జగన్ ప్రభుత్వంలో నామినేటిడ్ పోస్టుల్లో కొలువు తీరిన పోసాని కృష్ణమురళి, ఆలీ లాంటి వాళ్లు అయినా స్పందిస్తే బావుంటుందని.. అయినా జగన్ పార్టీ గద్దెనెక్కిన నాటి నుంచి అంటే.. ఈ నాలుగున్నరేళ్లలో.. పలువురు మంత్రులు, కొంత మంది మాజీ మంత్రులు, అతికొద్ది మంది ఎమ్మెల్యేలు మీసాలు తిప్పుతూ... తొడలు కొడుతూ, బూతులు తిడుతూ ప్రత్యర్థి పార్టీల నేతలు, అధినేతలపై చెలరేగిపోతూ ఉంటారని.. అలాంటి వారంతా.. ఆర్కే రోజాకు ఆపద వచ్చినప్పుడు ఏమైయ్యారు. ఎక్కడికి పోయారని ఫ్యాన్ పార్టీలోని సదరు వర్గం ఒకింత ఆందోళనతో ప్రశ్నిస్తోంది.

By
en-us Political News

  
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు.  గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో   మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు. 
 2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్   ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో  పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది. 
ఏపీలో జరుగుతున్న పురపాలక సంఘం ఎన్నికల ఫలితాల్లో అధికార కూటమి పక్షాలు తమ జోరును ప్రదర్శిస్తున్నాయి.
రాష్ట్రంలోని పలు ముఖ్యమైన మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయాలు నమోదు చేస్తున్నారు. ముఖ్యంగా  కడప జిల్లాలోని బద్వేల్ మున్సిపల్ చైర్‌పర్సన్ పీఠాన్ని కూటమి దక్కించుకుంది.
 పులివెందుల మున్సిసిపల్ ఎన్నికల పోలింగ్ రోజున వైసీపీ  అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్లాన్ చేసిన డ్రామాలు, ఎన్నికల వాతావరణాన్ని దెబ్బతీసేందుకు చేసిన ప్రయత్నాలను ఎస్ఈసీ  దృష్టికి తీసుకెళ్లారు. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడమే లక్ష్యంగా వైసీపీ శ్రేణులు ప్రవర్తించాయని, రాజ్యాంగబద్ధంగా జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడానికి ప్రయత్నించారని ఆరోపించారు.
తాను ఒక్కసారి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ప్రత్యర్థులు ఎవరూ నిలబడలేరని ఆయన హచ్చరించారు.    ఈ అస్తవ్యస్త పరిస్థితుల మధ్య ఎన్నికల్లో ఓటు వేయడం అంటే ఆ అక్రమాలను అంగీకరించడమే అవుతుందని భావించి, తాను ఓటు హక్కును వినియోగించుకోకుండానే పులివెందుల నుంచి వెనుదిరగారు.
రేపే మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌.. ప్రశాంతంగా సాగేనా.?
విజయసాయి ఈ వీడియో చేయడం వెనుక పొలిటకల్ స్ట్రాటజీ ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తారకరత్న కుమార్తెతో వీడియో చేయడం ద్వారా తెలుగుదేశం శ్రేణుల మద్దతు పొంది తన పొలిటికల్ రూట్ లో ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ర్నాబ్ తుపానుతో అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ సరఫరాను సత్వరమే పునరుద్ధరించడానికి తమిళనాడు సహాయాన్ని కోరింది. ఈ మేరకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తమిళనాడు ప్రభుత్వాన్ని  రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ పునరుద్ధరణ  వేగవంతం చేయడానికి  అదనపు విద్యుత్ శాఖ సిబ్బందిని, పరికరాలను కోరారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.