జగన్ రెడ్డిని కుమ్మేసిన రేవంత్ రెడ్డి.. 

Publish Date:Jul 1, 2021

Advertisement

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి చీఫ్ గా నియమితులైన ఎంపీ రేవంత్ రెడ్డి దూకుడు మరింత పెంచారు. మాములుగానే ఫైర్ బ్రాండ్ లీడర్ గా పంచ్ డైలాగులతో ప్రత్యర్థులకు చుక్కలు చూపించే రేవంత్ రెడ్డి.. పీసీసీ చీఫ్ గా ఎంపికయ్యాక మరింత స్పీడ్ పెంచారు. అధికార టీఆర్ఎస్ తో పాటు బీజేపీ లక్ష్యంగా రెచ్చిపోతున్నారు. రోజుకో బాంబ్ పేల్చుతూ రాజకీయ కాక రేపుతున్నారు. రేవంత్ ఎప్పుడు ఏం మాట్లాడుతారో, ఎవరిని టార్గెట్ చేస్తారో అన్న ఆసక్తి జనాల్లో కనిపిస్తోంది. ఇక ప్రత్యర్థి పార్టీల నేతలైతే రేవంత్  తనను టార్గెట్ చేస్తారమోనన్న భయంతో వణికిపోతున్నారని చెబుతున్నారు.

తెలుగు రాష్ట్రాల మధ్య సాగుతున్న జల వివాదంపై తన దైన శైలిలో స్పందించారు రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రజలకు నీళ్ళు  సంస్కృతి... కానీ అవే నీళ్లు కేసీఆర్ కు ఏటీఎం గా మారాయని ఆరోపించారు.పరివాహక ప్రాంతాలకు నీళ్లు ఇవ్వకుండా ...ఇతర ప్రాంతాలకు నీళ్లు తరలించడం సహాజ సూత్రాలకు విరుద్దమన్నారు. రెండు ప్రాంత ప్రజలను రెచ్చగొట్టి ఇరు వర్గాలు లబ్ది పొందుతున్నారని విమర్శించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా రోజుకు 11టీఏంసీల నీరు జగన్ ప్రభుత్వం  తరలించబోతుందని చెప్పారు రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్టుల ద్వారా రోజు కు 1 టీఎంసీ  నీరు కు మించి తరలించలేరన్నారు. 

జూరాలలో మనకు కనిపించిన నీరు...సంగంబండ తర్వాత కనపించదన్నారు రేవంత్ రెడ్డి. సంగంబండ దగ్గర జలదోపిడి జరుగుతుందని.. దీనికి ప్రధాన కారకుడు కేసీఆరే అని ఆరోపించారు. కృష్ణా నది నుండి ఏపీ ఎన్నీ నీళ్లు తీసుకోబోతుందో స్పష్టంగా అసెంబ్లీ లో జగన్మోహన్ రెడ్డి ప్రకటించారని తెలిపారు. ఆ తర్వాతే ప్రగతి భవన్ లో జగన్ కు కేసీఆర్ అథితి మర్యాదలు చేశారని చెప్పారు. ప్రగతి భవన్ లో కేసీఆర్ తో జగన్  సమావేశం తర్వాతే  రాయలసీమ ఎత్తిపోతల పథకం పనుల్లో వేగం పెరిగిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. జగన్ కు కేసీఆర్ అమ్ముడు పోవడం వల్లే ఈ  పరిస్థితి వచ్చిందన్నారు రేవంత్ రెడ్డి. 

తెలంగాణ లో ఉన్న ఆంధ్ర వాల్లకోసమే గట్టిగా మాట్లాడట్లేదని జగన్ అనడం హాస్యాస్పదమ్ననారు రేవంత్ రెడ్డి. తన తండ్రి ని తిడితే నోరు మెదపని వాడు ఏపీకి ఏం న్యాయం చేస్తారని సెటైర్ వేశారు. 
వైఎస్ ను తిడితే...అటు జగన్ ,ఇటు విజయమ్మ ఒక్కరు కూడా నోరు మెదపలేదన్నారు. గతంలో కాంగ్రెస్ నుంచి ఇతర పార్టీ లకు వెళ్లిన నేతలు తిరిగి   కాంగ్రెస్ వైపు రాకుండా చేసేందుకు ..వైఎస్ షర్మిల ను పావుగా వాడుతున్నారని చెప్పారు.  జలవివాదాలతో లబ్ది పొందేందుకు జగన్ ,కేసీఆర్ వేసిన స్కెచ్ ఇదన్నారు. కృత్రిమ వాతావరణం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. 

జులై 8 వైఎస్ పుట్టినరోజు సందర్భంగా వైఎస్ కూతురు తెలంగాణ లో పార్టీ ప్రారంబించబోతుందని రేవంత్ రెడ్డి అన్నారు.  వైఎస్ అంటే తెలంగాణ లో రైతులు గుర్తుకు వస్తారు..  అంతే గాని తెలంగాణ లో ఏం చేసినా చెల్లుతుంది అంటే కుదరదని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ ,వైఎస్  అంటే సంక్షేమం గుర్తుకు వస్తుందన్న రేవంత్ రెడ్డి.. అలాంటి వారిని తిడితే  కుష్ఠురోగం వస్తుందన్నారు. కేసీఆర్ రాజకీయ ప్రయోజనాలు  ,కేటీఆర్ ఆర్థిక ప్రయోజనం వల్లే సమస్య వచ్చిందన్నారు. తెలంగాణ లో ఉన్న నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ పై పోలీసులెందుకు.. ఎవరిని రెచ్చగొట్టడం కోసమని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఏ సెంటిమెంట్ తో కేసీఆర్ గద్దెనెక్కాడో.. అదే సెంటిమెంట్ తో అందపాతాలానికి పోతారని రేవంత్ రెడ్డి అన్నారు. నీళ్లు ,నిధులు ,నియామకాలు.. ఈ మూడే కేసీఆర్ ను గద్దె దించుతాయని స్పష్టం చేశారు.

By
en-us Political News

  
తెలంగాణ ప్రయోజనాలే తమకు పరమావధన్న ఆయన పార్లమెంటులో ఈ ప్రతిపాదనపై చర్చ,  ఓటింగ్ జరిగినప్పుడు తమ పార్టీకి చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు అనుకూలంగా ఓటు వేస్తారని వెల్లడించారు.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులు ఆమోదం పొందితే దేశ రాజకీయాలలో కాంగ్రెస్ ప్రతిష్ఠ బాగా మసకబారుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నాయి. ఇది 2029 సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ గెలుపు అవకాశాలపై నిస్సందేహంగా ప్రతికూల ప్రభావం చూపుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
తొలి విడత పంచాయతీ ఎన్నికలలో  వైసీపీ మద్దతుదారులు కనీసం పాతిక శాతం  స్థానాలను కూడా గెలుచుకోలేకపోయారు. అదే సమయంలో తెలుగదేశం కూటమి మద్దతు ఉన్నఅభ్యర్థులు తిరుగులేని విజయాలతో ప్రభంజనం సృష్టించారు. 
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ బిల్లు ఉద్దేశాలను, ప్రక్రియను  తప్పుబడుతుండగా, ఇండియా కూటమిలోని పలు ప్రాంతీయ పార్టీలో,  సీట్ల వాటా రక్షణ, సవరణల ఆధారంగా తమ వైఖరిని మార్చుకుంటున్న సంకేతాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి.
డీలిమిటేషన్ తో పాటు, మహిళా రిజర్వేషన్ల అమలును తీసుకురావడమే ఈ సమావేశాల నిర్వహన ప్రధాన లక్ష్యంగా కేంద్రంలోని మోడీ సర్కార్ చెబుతున్నప్పటికీ, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఈ హడావుడి సమావేశాల వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం బీజేపీకి రాజకీయ లబ్ధి చూకూర్చడమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయం మేరకు ఏ   రాష్ట్రంలోనూ  సీట్ల వాటా తగ్గదు, ప్రస్తుత నిష్పత్తిని కాపాడుతూనే అన్ని రాష్ట్రాల్లోనూ సమానంగా స్థానాలు పెరుగుతాయి.  అంతేకాకుండా, 2051 సీట్ల విషయంలో మార్పులు లేకుండా స్తంభనను అమలు చేయడం ద్వారా భవిష్యత్ జనాభా గణాంకాల ఆధారంగా రాష్ట్రాల మధ్య సీట్ల నిష్పత్తి మారకుండా నియంత్రించామని కేంద్రం చెబుతోంది. 
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన శుక్రవారం (నవంబర్ 27) సాయంత్రం జరిగే  ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశంలో వీరు పాల్గొంటారు. ఈ సమావేశంలో పాల్గొనాల్సిందిగా ప్రధాని నరేంద్రమోడీ ఆహ్వానించడంతో వీరిరువురూ ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు.
ఇటీవలి కాలంలో ఆయన బీజేపీకి దూరంగా జరుగుతున్నారనీ, అదే సమయంలో ఇండియా కూటమికి దగ్గరౌతున్నారనీ వార్తలు వినవస్తున్న నేపథ్యంలో... కేంద్రంలోని ఎన్డీయే కూటమి పార్లమెంటులో డీ లిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టడానికి సమాయత్తమైన తరుణంలో ఆయన మద్దతు ఇస్తారా ఇవ్వరా అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.