రేవంత్ రెడ్డి సరికొత్త రాజకీయ సంచలనం!

Publish Date:Jun 23, 2026

Advertisement

తెలుగు వన్ ఎక్స్ క్లూజివ్

తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఒక సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు. సాధారణంగా ఒక జెడ్పీటీసీ  స్థాయి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాకు ఎదగడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. దీని వెనుక రేవంత్ రెడ్డి అసమానమైన ధైర్యం, రాజకీయంపై ఉన్న అపారమైన పట్టు దాగి ఉన్నాయి. తెలుగువన్ వాస్తవ వేదికలో జమీన్ రైతు సంపాదకుడు  డోలేంద్ర ప్రసాద్  రేవంత్ రెడ్డి కేవలం ఒక నాయకుడు మాత్రమే కాదు, ఆయన ఒక  రాజకీయ జ్ఞాని అని అభివర్ణించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో ఢిల్లీ అధిష్ఠానం లేదా రాహుల్ గాంధీ పాత్ర కంటే రేవంత్ రెడ్డి వ్యక్తిగత చొరవ, వ్యూహాలే అత్యంత కీలక పాత్ర పోషించాయన్నారు. 

ఎన్నికల బరిలో కేసీఆర్,  బీఆర్ఎస్ కూటమిని ఢీకొట్టడం ఎవరికైనా పెద్ద సవాలే. గతంలో కేసీఆర్ వాడే ఘాటైన రాజకీయ విమర్శలు, వ్యంగ్యాస్త్రాలపై ఆయనకు మాత్రమే పేటెంట్ హక్కు ఉందనే భావన ఉండేది. కానీ రేవంత్ రెడ్డి రాకతో..  ఆ ముద్రను పూర్తిగా చెరిపివేశారు. కేసీఆర్,  కేటీఆర్ ల కంటే  మరింత దూకుడుగా, ఘాటుగా రేవంత్ ప్రజల్లోకి వెళ్లారు. కేసీఆర్ శైలిలోనే ప్రజలను ఆకట్టుకునేలా మాట్లాడి, వాటిలో అసలైన పేటెంట్ రైట్ తనదే అని నిరూపించుకున్నారు. ప్రజాకర్షణలో ఆయన చూపిన వేగం, చొరవ కాంగ్రెస్ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది.

ఈ రాజకీయ సమరంలో కేవలం మాటలకే రేవంత్ రెడ్డి పరిమితం కాలేదు. ఆర్థిక వ్యూహాల్లోనూ, కుల సమీకరణాల్లోనూ ఆయన తనదైన శైలిని ప్రదర్శించారు. కేసీఆర్ ఎన్నికల కోసం ఎన్ని వేల కోట్లు వ్యయం చేశారనేది పక్కన పెడితే..  రేవంత్ రెడ్డి అంతకంటే ఒక రూపాయి ఎక్కువే పెట్టి దీటుగా నిలబడ్డారనే చర్చ రాజకీయ వర్గాల్లో బలంగా నడిచింది. ఎన్నికల నిర్వహణలోనూ, వ్యూహాల అమలులోనూ ఎక్కడా వెనకడుగు వేయలేదు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీలో తనకంటే ఎంతో సీనియర్లయిన నాయకులు ఉన్నప్పటికీ, వారందరినీ ఒకే తాటిపైకి తీసుకురావడంలో ఆయన అద్భుతమైన విజయం సాధించారని డోలేంద్ర ప్రసాద్ అన్నారు. సాధారణంగా కాంగ్రెస్ లాంటి పెద్ద పార్టీలో అంతర్గత విభేదాలు సహజం. కానీ సీనియర్లందరి సహకారం తీసుకుని, వారిని ఒక జట్టుగా నడిపించి విజయం సాధించడమే రేవంత్ రెడ్డి అసలైన సక్సెస్ సీక్రెట్ అని చెప్పారు. 

హైదరాబాద్ చుట్టుపక్కల ఉండే రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన సమీకరణాలు కూడా రేవంత్ రెడ్డి విజయానికి ఎంతగానో తోడ్పడ్డాయి. గత ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో ఉన్న భూములు, రియల్ ఎస్టేట్ కంపెనీల కబ్జాలు,  ఆక్రమణలపై అక్కడి భూస్వాములు, ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గం తీవ్ర ఆందోళన చెందింది. ఒకవేళ మళ్ళీ పాత ప్రభుత్వమే వస్తే తమ భూములు తాము కోరుకున్న ధరకు కాకుండా, వారు చెప్పిన ధరకే ఇచ్చుకోవాల్సి వస్తుందేమోననే భయం నెలకొంది. ఈ ఆందోళనతో రియల్ ఎస్టేట్ రంగంలోని ప్రముఖులు, రెడ్డి సామాజిక వర్గ భూస్వాములు అందరూ ఏకతాటిపైకి వచ్చారు. వీరంతా రేవంత్ రెడ్డికి అటు ఆర్థికంగా, ఇటు రాజకీయంగా పూర్తి మద్దతును ప్రకటించారు. ఈ బలమైన శక్తుల కలయికే రేవంత్ రెడ్డిని గెలుపు తీరాలకు చేర్చింది.

ఇక ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్తారంటూ వస్తున్న ఊహాగానాలలో ఎలాంటి నిజం లేదని  డోలేంద్రప్రసాద్ అన్నారు.  బీజేపీ సిద్ధాంతాల ప్రకారంఆర్ఎస్ఎస్ తో బలమైన సంబంధాలు లేని వారికి ఉన్నత పదవులు దక్కడం అసాధ్యమన్న డోలేంద్ర ప్రసాద్.. అస్సాం లాంటి ఈశాన్య రాష్ట్రాల మినహాయింపులు వేరన్నారు. గతంలో కిరణ్ కుమార్ రెడ్డి లాంటి సీనియర్ నేతలు బీజేపీలో చేరినా వారికి ఎలాంటి గుర్తింపు దక్కలేదనేదని ఉదహరించారు. రేవంత్ రెడ్డి   బీజేపీలోకి వెళ్తే అదే పరిస్థితి ఎదురవుతుందనీ, రేవంత్ అంతటి అమాయకుడు కాదన్నారు.   ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఆయనకు పూర్తి స్వేచ్ఛ, ప్రత్యేక గుర్తింపు ఉన్నాయి. రాహుల్ గాంధీ సైతం ఆయన మాటను కాదనలేని స్థాయిలో రేవంత్ రెడ్డి తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. అందుకే తెలంగాణలో ఈ తిరుగులేని గెలుపు కేవలం రేవంత్ రెడ్డి సొంతమని డోలేంద్ర ప్రసాద్ చెప్పారు.

వాస్తవ వేదిక పూర్తి చర్చ తెలుగువన్ చానెల్ లో చూడండి

By
en-us Political News

  
కోలీవుడ్‌లోని మరికొందరు స్టార్స్ రాజకీయాలలోకి అడుగులు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరో ధనుష్ కూడా రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు.
రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన విలువలతో కూడిన రాజకీయాలకు నిలువెత్తు రూపంగా నిలిచారు. సొంత ఇల్లు కూడా లేకుండా, ఒక పాత స్కూటర్ మినహా ఎలాంటి ఆస్తులు కూడబెట్టకుండా నిరాడంబరంగా జీవించారు.
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్‌కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్‌కతాలోని కాళీఘాట్‌లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.