పులివెందుల పేరు అవిగొడ్డలి.. షర్మిల ట్రోలింగ్ మామూలుగా లేదుగా?

Publish Date:Apr 11, 2026

Advertisement

వైసీపీ అధినేత జగన్ ను ఆయన సొంత సోదరి, ఏపీసీసీ చీఫ్ షర్మిల ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు. జగన్ పై తెలుగుదేశం, జనసేనల పార్టీలను మించి షర్మిల విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా జగన్ ప్రతిపాదించిన మావిగన్ రాజధానిని టార్గెట్ చేస్తూ షర్మిల ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు. 
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న తీరుపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఎండగట్టారు. అమరావతిని  జగన్  నిరంతరం ప్రయత్నిస్తున్నారనీ,  ఇప్పుడు కొత్తగా  మావిగన్   ప్రతిపాదనను తెరపైకి తెచ్చి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆమె మండిపడ్డారు. రాజధాని నిర్మాణానికి లక్షల కోట్లు ఖర్చవుతాయని వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని ఆమె తిప్పికొట్టారు.

ఇటీవల పార్లమెంటులో అమరావతిని అధికారిక రాజధానిగా గుర్తించడంతో ఎన్డీయే ప్రభుత్వం మైలేజ్ సాధించగా, దానిని అడ్డుకునేందుకు వైసీపీ నెగటివ్ ప్రచారం మొదలుపెట్టింది. అమరావతి సాధ్యం కాదని, అది కేవలం భ్రమ అని ప్రచారం చేస్తున్న వైసీపీ తీరును షర్మిల ఎద్దేవా చేశారు. జగన్ ప్రతిపాదించిన  మావిగన్  అనే పేరును షర్మిల జగన్ దిమ్మదిరిగేలా ఎద్దేవా చేశారు.   మావిగన్ అమరావతికి ప్రత్యామ్నాయం అయితే.. పులివెందులకు అవి గొడ్డలి అని పేరుపెట్టడం సబబుగా ఉంటుందన్నారు.   కడప ఎంపీ అవినాష్ రెడ్డి పేరును, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వచ్చి గొడ్డలిని ముడపెడుతూ పులివెందులకు అవిగొడ్డలి అని పేరుపెట్టాలని జగన్ కు సూచించారు. అవినాష్ రెడ్డి పేరులోని అవి అక్షరాలను  వివేకా హత్యకేసులో గొడ్డలికి ముడిపెడుతూ ఆమె జగన్ లక్ష్యంగా సంధించిన విమర్శనాస్త్రం ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్స్ లో తెగ వైరల్ అయ్యింది. జగన్ రాజధానికి ప్రతిపాదించిన మావిగన్ పేరు కంటే.. తాను పులివెందులకు సూచించిన అవిగొడ్డలి పేరు జనానికి తేలిగ్గా అర్ధమౌతుందంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాక్ ఆఫ్ ది స్టేట్ గా మారిపోయాయి.  

జగన్ మావిగన్ ప్రతిపాదనను తిప్పికొడుతూ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నేతలు.. అమరావతి  స్వయం సమృద్ధి నగరం అంటూ వివరణలు ఇచ్చుకుంటుంటే.. షర్మిల మాత్రం దూకుడుగా వైసీపీ అధినాయకత్వాన్నే లక్ష్యం చేసుకుని విమర్శలు గుప్పించా, కూటమి పార్టీల కంటే ముందున్నారు.   ఇప్పుడు  షర్మిల చేసిన  అవి గొడ్డలి  వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.  

By
en-us Political News

  
ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్‌ రెడ్డికి జాయింట్‌ కో-ఆర్డినేటర్‌ బాధ్యత..!
అర్బన్ నక్సల్, రూరల్ నక్సల్ అనే పదాల సరసన ఇప్పుడు దిమాగీ నక్సల్అ నే కొత్త బ్రాండ్‌ను చేర్చారన్నారు భరద్వాజ. అంతేందుకు ఆపరేషన్ కగార్ పేరుతో నక్సలైట్లను భౌతికంగా నిర్మూలిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా ప్రకటించి మార్చి 31 2026 డెడ్ లైన్ విధించిన సంగతిని గుర్తు చేశారు.
ఐదేళ్లు అధికారంలో ఉన్న జగన్ ఐదు డీఎస్సీలు నిర్వహించాల్సిన ఆయన ప్రభుత్వం ఒక్క డీఎస్సీ ఎందుకు నిర్వహించలేకపోయిందో చెప్పాలన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకూ ఇప్పుడు వైసీపీ లోకేష్ రాజీనామా చేయాలన్న డిమాండ్ కూ పొంతన లేదన్నారు.
ఈ కొత్త పాలకమండలిలో వివిధ రాష్ట్రాల నుంచి కీలక నాయకులకు చోటు కల్పించారు.  కాగా బిజెపి జాతీయ ఉపాధ్యక్ష పదవుల్లో మొత్తం 13 మంది నాయకులకు అవకాశం దక్కింది. వీరిలో  పురందేశ్వరి ఒకరు. 
వనపర్తి కాంగ్రెస్‌లో టికెట్ వివాదం..నేను కూడా జీవన్ రెడ్డిలా తిరగబడతా..!
ప్రజాసమస్యలపై చర్చ జరగాల్సిన మండలిలో ఇరు పార్టీలకు చెందిన నేతలూ.. వ్యక్తిగత దూషణలతో సభలో మాటల యుద్ధానికి దిగారు.  ముఖ్యంగా  మండలిలో విపక్ష నాయకుడు, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, మంత్రి అచ్చెన్నాయుడుల మధ్య మాటల మంటలు రేగాయి. పరస్పరం విమర్శలు, ఆరోపణలు గుప్పించుకున్నారు.
సెంబ్లీ ఎన్నికలలో తన జన సురాజ్ పార్టీ ఘోర పరాజయం పాలైనప్పటికీ... ఇటీవల బంకీపూర్ నియోజకవర్గ ఉప ఎన్నికలో ప్రశాంత్ కిశోర్ బీజేపీ కంచు కోటను బద్దలు కొట్టి మరీ విజయం సాధించారు.
భారత ప్రధాన న్యాయమూర్తి ఒక కేసు విచారణ సందర్భంగా చేసిన కాక్రోచ్ అన్నపదం ఎంతటి సంచలనానికి దారి తీసిందో.. ప్రధాని తన పంద్రగస్టు ప్రసంగంలో ఉపయోచించిన దిమాగీ నక్సల్ పదం కూడా అంతకు మించి సంచలనం సృష్టించింది. 
 ఏపీ గ్రీన్ కార్యనిర్వాహక కమిటీ చైర్మన్‌గా నాగబాబును నియమిస్తూ..  ఆయనకు కేబినెట్ హోదాను కల్పించింది. ఈ మేరకు రాష్ట్ర పర్యావరణ, అటవీ శాఖ  సోమవారం ఉత్తర్వులు ారీ చేసింది.  
గత కొంతకాలంగా పార్టీలో తనను ఏ విధంగా పక్కన పెట్టారో  వివరించారు. ముఖ్యంగా సింగరేణి కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సమయంలో, తన కుమారుడి విద్యాభ్యాసానికి సంబంధించిన గ్రాడ్యుయేషన్ వేడుకల కోసం అమెరికా వెళ్లిన  సమయంలోనే కనీసం ముందస్తు సమాచారం,  షోకాజ్ నోటీసు కూడా ఇవ్వకుండా  తనను ఆ పదవి నుంచి తొలగించారని గుర్తు చేశారు.
వందే మాతరం గేయానికి ఆమె చేసిన అపచారాన్ని 140 కోట్ల మంది భారతీయులు ఆమెను ఎన్నటికీ క్షమించరన్నారు.  వందేమాతరం గేయానికి చేసిన అపచారానికి ఆ  గేయ రచయిత బంకించంద్ర ఛటోపాధ్యాయతో పాటు  40 కోట్ల దేశ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని అమిత్ షా డిమాండ్ చేశారు.  
ఆంధ్రప్రదేశ్ లో జగన్ పార్టీకి అదేనండీ వైసీపీకి జనం కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా అర్హత లేదని 2024 ఎన్నికలలో విస్పష్ట తీర్పు ఇచ్చేశారు. అయినా నిస్సిగ్గుగా జగన్ కోర్టును విపక్ష హోదా కోసం ఆశ్రయించారు.
ఎవరైనా సరే పార్టీ గీత దాటి మాట్లాడితే సహించేది లేదు..మహేష్ కుమార్ గౌడ్..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.