సామాజిక బాధ్యత.. చంద్రబాబు దార్శనికతే బొద్దులూరి యశస్వి ఆయుధాలు

Publish Date:Jun 10, 2024

Advertisement

ఏపీలో ఐదేళ్ల‌పాటు సీఎంగా జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అరాచ‌క పాల‌న‌కు ప్రజ‌లు న‌ర‌క‌యాత‌న అనుభ‌వించారు. అడుగ‌డుగునా ఇబ్బందుల‌ను ఎదుర్కొన్నారు. ఇదేమ‌ని ప్ర‌శ్నించిన వారిపై వైసీపీ గూండాలు దాడులు చేయ‌డం, పోలీసులు అక్ర‌మ కేసుల‌తో జైళ్ల‌కు పంపించ‌డం.. మ‌రీ ప్ర‌శ్నిస్తే చంపేయ‌డం. ఇదీ ఐదేళ్లు జ‌గ‌న్ పాల‌న తీరు. దీంతో వైసీపీ ప్ర‌భుత్వంపై నోరెత్తేందుకు కూడా ప్ర‌జ‌లు వణికిపోయారు. అలాంటి స‌మ‌యంలో  తెలుగుదేశం ప్ర‌జ‌ల త‌ర‌పున గొంతెత్తింది. జ‌గ‌న్ అరాచ‌క పాల‌న‌పై పోరాడేందుకు దైర్యాన్ని ఇచ్చింది. ఈ విషయంలో తెలుగుదేశం కార్యకర్తలు  దాడుల‌కు గుర‌య్యారు, పోలీసుల లాఠీదెబ్బ‌లు తిన్నారు,  జైళ్ల‌కు వెళ్లారు. అయినా, జ‌గ‌న్ అరాచ‌కాల‌కు ఎదురొడ్డి పోరాటం చేసి ప్ర‌జ‌ల‌కు అండ‌గా నిల‌బడ్డారు. జ‌గ‌న్ చేసేది త‌ప్పు అంటూ ప్ర‌జ‌ల్లో చైత‌న్య నింపారు. అలాంటి వారిలో ఎన్ఆర్ఐ టీడీపీ నాయకుడు బొద్దులూరి యశ‌స్వి (య‌ష్‌) ముందువరుసలో నిలిచారు. జ‌గ‌న్ ప్ర‌భుత్వం దుర్మార్గ‌  పాల‌నపై ప్ర‌జ‌ల‌కు ఎప్ప‌టిక‌ప్పుడు తెలియజేస్తూ వారిలో చైత‌న్య జ్వాలను ర‌గిల్చారు. త‌ద్వారా ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు ఓటు ద్వారా వైసీపీని పాతాళానికి తొక్క‌డంలో య‌శ‌స్విది కూడా కీలక పాత్ర‌ అనడంలో అతిశయోక్తి ఇసుమంతైనా లేదు.   

తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్‌ఐ నాయకుడు బొద్దులూరి య‌శ‌స్వి ఉన్న‌త విద్యావంతుడు. తెనాలిలో జ‌న్మించిన య‌శ‌స్వి.. తెలంగాణ‌లో త‌న విద్యాభ్యాసం  పూర్తి చేశారు.  ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో సీఎం చంద్ర‌బాబు నాయుడు ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయడం, ఆయన కృషితో హైదరాబాద్ కు తరలివచ్చిన వేలాది ఐటీ కంపెనీలు యువతకు అపార ఉద్యోగావకాశాలు కల్పించడం తెలిసిందే. ఆ సమయంలోనే యశస్వి కూడా ఉద్యోగస్తుడయ్యారు. అలా ఐటీ ప్రొఫెషనల్ గా కెరీర్ ప్రారంభించిన  యశస్వి 21 దేశాలు తిరిగి చివరికి అమెరికాలో స్థిరపడ్డారు. 

విద్యార్థి దశ నుంచే రాజకీయాలలో చురుకుగా ఉండే యశస్వి 2014లో ఉమ్మడి రాష్ట్ర విభజన తరువాత చంద్రబాబుకు, తెలుగుదేశం కు మద్దతుగా స్వరాష్ట్రానికి వచ్చి బ్రింగ్ బ్యాక్ బాబు, జాబు కావాలంటే బాబు రావాలి క్యాంపెయిన్ లో చురుకుగా పాల్గొన్నారు. ఆ సమయంలో కుటుంబాన్ని వదిలి ఆంధ్రప్రదేశ్ లో దాదాపు ఆరు నెలల పాటు ఎన్నికల ప్రచారంలో చురుకుగా పాల్గొన్నారు. అందులో భాగంగా దాదాపు 116 నియోజకవర్గాలలో విస్తృతంగా ప్రచారం చేశారు. 2014 ఎన్నికలలో తెలుగుదేశం విజయం సాధించి చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాతే తిరిగి అమెరికా వెళ్లారు. 
సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు అన్న తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ మాటలను విశ్వసించి తూచా తప్పకుండా ఆచరించే యశస్వి తన సంపాదనలో కొంత భాగం పేదల కోసం వ్యయం చేయడం ఒక అలవాటుగా మార్చుకున్నారు. కోవిడ్ సమయంలో తల్లిదండ్రులను కోల్పోయిన పలువురు పిల్లల విద్య బాధ్యతను తీసుకుని వారిని చదివిస్తున్నారు. అమెరికాలో ఉన్నా ఆయనకు సొంత రాష్ట్రంపై ప్రేమ ఎక్కువ. 

 ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాల‌ని కోరుకునే వ్య‌క్తుల్లో య‌శ‌స్వి ముందు వ‌రుస‌లో ఉంటాడు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ విడిపోయిన త‌రువాత తొలి ఐదేళ్లు చంద్ర‌బాబు హ‌యాంలో ఏపీ అన్నిరంగాల్లో దూసుకెళ్లేందుకు ముంద‌డుగు వేసింది. కానీ, 2019లో జ‌గ‌న్ సీఎం అయిన త‌రువాత ఏపీ ప‌త‌నం ప్రారంభ‌మైంది. జ‌గ‌న్ క‌క్ష‌పూరిత రాజ‌కీయాల‌తో అరాచ‌క పాల‌న‌ను సాగించారు. ప్ర‌శ్నించిన వారిపై దాడులు చేయ‌డం, చంద్ర‌బాబు హ‌యాంలో ఏపీలో పెట్టుబ‌డులు పెట్టిన కంపెనీల‌ను త‌రిమేయ‌డంతో యువ‌త‌కు క‌నీసం ఉపాధి అవ‌కాశ‌లుకూడా లేకుండా చేశారు. దీంతో ఏపీ ప్ర‌జ‌లు ఉపాధికోసం ఇత‌ర రాష్ట్రాల‌కు వెళ్లాల్సి వ‌చ్చింది. ఈ ప‌రిస్థితిని చూసి చలించిపోయిన యశస్వి  అమెరికాలో ఉంటూనే ఏపీలో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అరాచ‌క పాల‌న‌పై ప్ర‌జ‌ల్లో చైత‌న్యం నింపేందుకు   ప్ర‌య‌త్నించారు. ఎప్ప‌టిక‌ప్పుడు జ‌గ‌న్ పాల‌నా విధానాల‌ను సోష‌ల్ మీడియాలో ఎండ‌గ‌డుతూ వ‌చ్చారు. వాస్తవానికి వైసీపీ ప్రభుత్వ అరాచకాలపై మొట్టమొదట గళమెత్తినది యశస్వే.  జగన్ వేధింపులు, వైసీపీ మూకల అరాచకాలు, దాడులు, దౌర్జన్యాలపై తెలుగుదేశం పోరు మొదలు పెట్టడానికి ముందే   అమెరికాలో ఉంటూనే ఏపీలో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అరాచ‌క పాల‌న‌పై ప్ర‌జ‌ల్లో చైత‌న్యం నింపేందుకు య‌శ‌స్వి ప్ర‌య‌త్నించారు. ఎప్ప‌టిక‌ప్పుడు జ‌గ‌న్ పాల‌నా విధానాల‌ను సోష‌ల్ మీడియాలో ఎండ‌గ‌డుతూ వ‌చ్చారు. 

ఈ క్ర‌మంలో.. ప్ర‌శ్నించిన వారిని చిత్ర‌హింస‌లుపెట్టే జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి దృష్టి య‌శ‌స్వి వైపు మ‌ళ్లింది.. దీంతో ఆయనను ఇబ్బందులు పెట్టేందుకు ప్ర‌భుత్వం అనేక ప్ర‌య‌త్నాలు చేసింది.  ఏపీలోని ఆయన ఇంటిపై దాడులు చేసింది. చేయించింది. ఇంటిని ధ్వంసం చేసింది. దీంతో య‌శ‌స్వీ త‌న త‌ల్లిదండ్రుల‌ను హైద‌రాబాద్ కు మకాం మార్పించారు.  జగన్ ప్రభుత్వం య‌శ‌స్వీపై పగపట్టినట్లు వ్యవహరించింది. లుక్ అవుట్ నోటీసులు  జారీ చేసింది.  ఆర్థిక నేర‌గాళ్లు, ఉగ్ర‌వాదాలను వెంటాడినట్లు వెంటాడింది. వేటాడింది.   ప్ర‌భుత్వ ప్ర‌జావ్య‌తిరేక పాల‌న‌ను ప్ర‌శ్నించినందుకు జ‌గ‌న్ ప్ర‌భుత్వం య‌శ‌స్వీకి లుక్ అవుట్ నోటీసులు ఇచ్చిందంటే ఏ స్థాయిలో కక్షపూరితంగా వ్యవహరించిందో, ఆయనను ఇబ్బందులు పెట్టేందుకు ఎంతకు తెగించిందో అర్దం చేసుకోవచ్చు. చివ‌రికి..  ఏపీలో ఉంటున్న త‌న త‌ల్లి ఆరోగ్యం బాగా లేక‌పోవ‌టంతో చూసేందుకు  వ‌చ్చిన య‌శ‌స్విని  ఏపీ సీఐడీ పోలీసులు శంషాబాద్ విమానాశ్ర‌యంలో అర్ద‌రాత్రి   అదుపులోకి తీసుకొచి గుంటూరు సీఐడీ కార్యాల‌యానికి త‌ర‌లించారు. నాలుగు గంట‌ల త‌రువాత 41ఏ నోటీసు ఇచ్చి వ‌దిలి పెట్టారు. 

అయితే అలా వదిలిపెట్టడానికి జగన్ సర్కార్ ఉదారత ఏమీ కారణం కాదు. యశస్విని అదుపులోనికి తీసుకోవడానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశ వ్యాప్తంగా, దేశ విదేశాల్లో వెల్లువెత్తిన నిరసనలే కారణం. సామాజిక మాధ్యమంలో జగన్ ప్రభుత్వ చర్యను వ్యతిరేకిస్తూ నెటిజనులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ఆ కారణంగానే యశస్విని అనివార్యంగా, గత్యంతరం లేక జగన్ సర్కార్ వదిలింది. లేకుంటే రఘురామకృష్ణం రాజును చిత్రహింసలు పెట్టినట్లే యశస్విని కూడా ట్రీట్ చేసి ఉండేది.  ఇక యశస్విపై జారీ చేసిన లుక్ ఔట్ నోటీసును హైకోర్టు   ర‌ద్దు చేసింది.

ఇక యశస్వి జగన్ సర్కార్ వేధింపులు, బెదరింపులు, అక్రమ అరెస్టులకు ఇసుమంతైనా బెదరలేదు.  ఆ త‌రువాత కూడా య‌శ‌స్వి ఏపీ ప్ర‌భుత్వం అవ‌లంబిస్తున్న ప్ర‌జా వ్య‌తిరేక  విధానాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేస్తూ వారిలో చైత‌న్యం నింపుతూ వ‌చ్చారు. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఘోర ఓట‌మిని చ‌వి చూడ‌బోతున్నారని య‌శ‌స్వి  ఎన్నిక‌ల‌కు ఐదు నెల‌ల ముందునుంచే చెబుతూ వ‌చ్చారు. య‌శ‌స్వి చెప్పిన‌ట్లుగా వైసీపీ ఘోర ప‌రాభ‌వం పాలైంది.   

సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో జ‌న‌సేన‌, తెలుగుదేశం, బీజేపీ క‌లిసి పోటీ చేయాల‌ని, అలా జ‌రుగుతుంద‌ని మొద‌టి నుంచి య‌శ‌స్వి నమ్మకంగా ఉన్నారు. అదే చెబుతూ వచ్చారు.  తెలుగుదేశం ఒంట‌రిగా బ‌రిలోకి దిగితే 110 నుంచి 120 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో విజ‌యం సాధిస్తుంద‌నీ.. కానీ, వైసీపీని ఏపీలో పూర్తిగా పాతాళానికి తొక్కేయాలంటే తెలుగుదేశం, జ‌న‌సేన క‌ల‌వాల‌ని, దీనికి  బీజేపీ కూడా తోడైతే  వైసీపీకి 10 నుంచి 14 స్థానాల‌కంటే ఎక్కువ రావ‌ని ఎన్నిక‌లకు ఐదారు నెలల ముందే య‌శ‌స్వి అంచ‌నా వేశారు.ఆయన అంచనాకు తగ్గట్టుగానే ఏపీలో తెలుగుదేశం, జ‌న‌సేన‌, బీజేపీ క‌లిసి పోటీ చేశాయి. వైసీపీ కేవ‌లం 11 స్థానాల‌కే ప‌రిమితం అయింది. అయితే, య‌శ‌స్వి ఓ ఇంట‌ర్వ్యూలో మ‌రో విష‌యాన్నికూడా చెప్పుకొచ్చారు. ఎన్నిక‌ల త‌రువాత వైసీపీ క‌నుమ‌రుగ‌వుతుంద‌ని, వైసీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిపోతార‌ని అన్నారు. వైసీపీ నేత‌ల తీరు చూస్తుంటే ఆ ప్ర‌క్రియ‌ కూడా ప్రారంభ‌మైన‌ట్లే క‌నిపిస్తోంది.

మొత్తానికి ఏపీలో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అరాచ‌క పాల‌న‌కు ఎదురొడ్డి పోరాడిన వారిలో  టీడీపీ ఎన్ఆర్ఐ  నాయకుడు య‌శ‌స్వి ముందు వరుసలో ఉంటారనడంలో సందేహం లేదు.  తెలుగుదేశం పార్టీ పట్ల యశస్వి బొద్దులూరి అంకిత భావం, పార్టీ కోసం ఆయన చేసిన కృషి, పడిన శ్రమను పార్టీ అధిష్ఠానం పలు సందర్భాలలో ప్రత్యేకంగా ప్రస్తావించి ప్రశంసించింది. చంద్రబాబు సంస్కరణలు, దార్శనికత కారణంగా ఉన్నత స్థానాలకు ఎదిగిన యశస్విలాంటి యువత పార్టీకి అవసరమైన ప్రతి సందర్భంలోనూ ముందుకు వచ్చి పని చేయడం ముదావహం.

By
en-us Political News

  
తనను పార్టీ నుంచి బయటకు గెంటేసిన బీఆర్ఎస్ కు చుక్కలు చూపిస్తానని హెచ్చరించారు. బీఆర్ఎస్ హయాంలో అవినీతి జరిగిందని ఇప్పటికే బాహాటంగా విమర్శలు గుప్పిస్తూ వచ్చిన కల్వకుంట్ల కవిత ఈ సారి కేటీఆర్ రాజకీయాలను ఎండగట్టారు. తన సోదరుడు కేటీఆర్ కంటే పార్టీ కోసం తానే ఎక్కువగా కష్టపడ్డాన విస్పష్టంగా తేల్చేశారు.
శివాజీ చేసిన వివాదాస్పద కామెంట్లపై నాగబాబు కౌంటర్ ఒకింత ఘాటుగా ఉంది. అందులో సందేహం లేదు. అయితే మామూలుగా అయితే నాగబాబు కౌంటర్ వివాదాస్పదం అయ్యే అవకాశం లేదు. కానీ శివాజీ వ్యాఖ్యలపై మెగా ఫ్యాన్స్ ఒకింత సానుకూలత వ్యక్తం చేయడంతో నాగబాబును వివాదంలోకి లాగారు. సోషల్ మీడియా వేదికగా నాగబాబుపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.
ఇక కుటుంబ వారసత్వం రేహాన్ వాద్రాకు అప్పగించడానికి రాహుల్ రెడీ అయిపోయారనడానికి సూచనగా.. రేహాన్ వాద్రా పేరు చివర గాంధీని కూడా ఇటీవలే అధికారికంగా చెర్చారు. ఔను రేహాన్ ఇంటి పేరును వాద్రా గాంధీగా ప్రికాంక వాద్రా అధికారికంగా మార్పించారు.
ఆలయ ప్రాంగణంలో గానీ, మీడియా ముందు గానీ రాజకీయ వ్యాఖ్యలు చేసే వారిపై, వాటిని ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్న హెచ్చరికలు సైతం జారీ చేసింది. తిరుమలగిరిపై కేవలం “గోవింద నామస్మరణ” మాత్రమే ఉండాలన్నది టీటీడీ భావన.
అసెంబ్లీ, మండలిలో పార్టీ గళాన్ని బలంగా వినిపించేందుకు సీనియర్ నేతలకు బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నేతలుగా బాధ్యతలు అప్పగించారు. ఈ నియామకాల ద్వారా అటు అసెంబ్లీలో, ఇటు మండలిలో అధికార పక్షాన్ని దీటుగా ఎదుర్కోవాలని దిశానిర్దేశం చేసినట్లయింది. అయితే అలా నియమించిన ఉప నేతలలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు పేరు లేదు.
అసెంబ్లీలో బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నేతలను నియామస్తూ బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు
ఈ నేపథ్యంలోనే పంచాయతీ ఎన్నికల్లో లభించిన విజయానికి కొనసాగింపు సాధ్యమైనంత త్వరగా మునిసిపోల్స్ నిర్వహించేయాలని రేవంత్ సర్కార్ యోచిస్తోంది.
ఇటీవ‌ల జ‌గ‌న్ పుట్టిన రోజు సందర్భంగా పొటేళ్ల‌ను బ‌లిచ్చి ఆయ‌న‌ ఫోటోల‌కు ఆ ర‌క్తాన్ని త‌ర్ప‌ణం చేశారు వైసీపీ అభిమానులు. అంతేనా హింసాత్మ‌క కామెంట్లను ఫ్లెక్సీల‌పై పోస్ట్ చేసి.. వీరంగం ఆడారు.
అధికారం అండ చూసుకుని మంచి, చెడు, ఉచ్ఛం, నీచం అన్న తేడా లేకుండా దాడులు, దౌర్జన్యాలు, అవినీతి, అక్రమాలు, కబ్జాలతో చెలరేగిపోయారు. అటువంటి నేతలంతా వైసీపీ అధికారం కోల్పోయిన తరువాత నాటి తప్పిదాలకు మూల్యం చెల్లించాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
అధికారం కోల్పోయిన తరువాత ఇద్దరి వ్యవహార తీరు దాదాపు ఒకేలా ఉంటోంది. క్రియాశీల రాజకీయాలకు దూరంగా, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. పార్ట్ టైమ్ పొలిటీషియన్లుగానే వ్యవహరిస్తూ వచ్చారు. ఇరువురూ కూడా పరాజయం తరువాత అసెంబ్లీకి డుమ్మా కొడుతూనే వచ్చారు. అలా అసెంబ్లీకి గైర్హాజర్ కావడానికి ఎవరి కారణాలు వారు చెప్పుకున్నా ఫలితం మాత్రం సభకు ఆబ్సెంట్ కావడమే.
తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ హయాంలో అంటే పదేళ్ల పాటు తెలంగాణ అసెంబ్లీ ప్రభుత్వ సమావేశం అన్నట్లుగా మారిపోయింది. విపక్ష సభ్యులకు మైక్ అన్నది అందని ద్రాక్షగా మారిపోయిన పరిస్థితి. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తరువాత సభా నిర్వహణలో స్పష్టమైన మార్పు కానవచ్చింది. సభాసంప్రదాయాలకు, విలువలకు రేవంత్ సర్కార్ పెద్ద పీట వేసింది. అర్ధవంతమైన చర్చలు జరిగేందుకు అనుకూలమైన వాతావరణం ఏర్పడింది.
ఓట్ల కోసం చేసిన ప్ర‌జాధ‌నం ఖ‌ర్చు తోపాటు.. చేసింది చెప్పుకోడానికి అద‌న‌పు ఖ‌ర్చు కూడా భారీ ఎత్తున‌ జ‌రిగేది. ఇంతా చేసి తాను చేసింది చెప్పుకోలేక పోయానంటూ జగన్ ఆవేదన చెందడమేంటని నెటిజనులు తెగ శోధించారు.
సుదీర్ఘ విరామం తరువాత విపక్ష నేత హోదాలో కేసీఆర్ ఈ సమావేశాలకు హాజరయ్యారు. సభ ప్రారంభానికి ముందే ఆయన సభలో తనకు కేటాయించిన సీటులో కూర్చున్నారు. ఆ తరువాత అసెంబ్లీలోకి ప్రవేశించిన రేవంత్ రెడ్డి నేరుగా కేసీఆర్ స్థానం వద్దకు వెళ్లి ఆయనను ఆప్యాయంగా పలుకరించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.