అత్తాకోడళ్లు పొరపాటున కూడా ఇలాంటి విషయాలు షేర్ చేసుకోకూడదట..!

Publish Date:Jul 1, 2025

Advertisement

 

పెళ్లైన ప్రతి అమ్మాయి ఒక కొత్త ఇంటికి వెళుతుంది. అక్కడ భర్తతో పాటు ఆమె అత్తమామలు కూడా ఉంటారు. సాధారణంగా చాలా ఇళ్లలో  భార్యాభర్తల కంటే అత్తాకోడళ్ల మధ్య జరిగే గొడవలే ఎక్కువ ఉంటాయి.  అత్తాకోడళ్లు కలిసి ఒకే చోట ఉన్నా, లేకపోయినా.. అత్తాకోడళ్లు కొన్ని విషయాలు ఒకరితో మరొకరు చెప్పుకోకుండటం మంచిదని రిలేషన్షిప్ నిపుణులు అంటున్నారు. ఇంతకూ ఒకరితో ఒకరు అనకూడని విషయాలేంటి? తెలుసకుంటే..

బంధువుల విషయాలు..

అత్తవైపు బంధువులు అయినా, కోడలి వైపు బంధువులు అయినా చెడుగా మాట్లాడకూడదు.  ఎవరివైపు బంధువుల గురించి వారికి ప్రేమ, అభిమానం ఉంటాయి.  అత్త కోడలివైపు వారి గురించి, కోడలు అత్తవైపు వారి గురించి ఎప్పుడూ మాట్లాడకూడదు.  ఒకవేళ మాట్లాడితే ఇద్దరి మధ్య బేదాభిప్రాయాలు వస్తాయి.

డబ్బు,నగలు..

అత్తాకోడళ్ల మధ్య ఏవైనా చర్చలు జరిగినా,  ఒకరితో ఒకరు ఏదైనా చెప్పుకున్నా అది ఇంటి పనుల గురించి,  ఏదైనా సమస్య ఉంటే వాటి గురించి మాట్లాడుకోవాలి. అంతే తప్ప డబ్బు, నగల గురించి ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవడం,  ఒకరితో ఒకరు గొడవ పడటం చేయకూడదు.

ఫిర్యాదులు..

ఎంతైనా భర్త అనేవారు అత్త కొడుకు.  అతను ఏదైనా తప్పు చేసినప్పుడు అతని గురించి అత్తకు ఫిర్యాదు చేయడం మంచిది కాదు. తప్పు చేసినా సరే.. కోడలి ముందు కొడుకును తక్కువ చేయాలసి అతడిని దండించాలని ఏ అత్త అనుకోదు. పైగా తిరిగి కోడలినే మందలించే అవకాశం ఉంటుంది.  దీని వల్ల అత్తాకోడళ్ల మధ్య గొడవలు వస్తాయి.

కోడలి తల్లిదండ్రులు..

పెళ్లైన మాత్రాన ఆడపిల్లకు తల్లిదండ్రులంటే పరాయితనం రాదు.  కని, పెంచి, పెద్ద చేసిన తల్లిదండ్రుల పట్ల ఆమె ప్రేమ జీవితాంతం ఉంటుంది.  అయితే కోడలు తన ఇంట్లో ఉంటోంది కదా అని అత్తగారు కోడలి తల్లిదండ్రుల గురించి చులకనగా మాట్లాడటం, వారిని నిందించడం చేయరాదు.  ఇది చాలా  గొడవలకు దారి తీస్తుంది.

పోలిక..

కోడలిని ఇతర కోడళ్లతో లేదా కూతురితో పోల్చడం, అత్తను ఇతర ఇంటిలోని అత్తతో పోల్చడం లాంటివి అత్తాకోడళ్లు చేయరాదు. దీని వల్ల ఇద్దరి మధ్య బంధం తెగిపోతుంది.

అలవాట్లు..

కోడలు అయినా, అత్త అయినా వారు పెరిగిన వాతావరణంకు తగ్గట్టు వారి  అలవాట్లు ఉంటాయి.  ఆ అలవాట్ల గురించి పదే పదే విమర్శలు చేయడం, హేళన చేయడం చేయరాదు. ఇది చాలా అవమానకరంగా ఉంటుంది.

పిల్లల పెంపకం..

జనరేషన్ మార్పును బట్టి పిల్లల పెంపకంలో కూడా తేడాలు ఉంటాయి.  ఒకప్పుడు పెద్ద వాళ్లు పెంచిన విధానం వేరు..  నేటితరం వారు పిల్లలను పెంచే విధానం వేరు ఉంటుంది.  వీటి కారణంగా ఒకరిమీద మరొకరు వాదించుకోకూడదు.  

                                   *రూపశ్రీ.

By
en-us Political News

  
వేసవికాలం అనగానే మండే ఎండలు గుర్తుకు వస్తాయి.  ప్రతి ఏడాది ఈ ఎండల ప్రభావం పెరుగుతూనే ఉంటోంది. ఈ కారణంగానే చాలామంది ఇళ్లలో ఏసీలు పెట్టించుకుంటారు.  అయితే ఏసీ పెట్టించుకునే అంత స్తోమత లేనివారు కనీసం కూలర్ అయినా...
వివాహం అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదు, రెండు కుటుంబాలు , రెండు విభిన్న మనస్తత్వాల కలయిక కూడా.  పెళ్లి తర్వాత ప్రతి జంట తమ సంబంధాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తుంది..
నేటి కాలంలో ఫిట్‌నెస్‌పై అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా జిమ్ వెళ్లేవారు తమ ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు...
మీ జుట్టు మీ అందానికి ఒక కిరీటం వంటిది. కానీ నేటి ఒత్తిడితో కూడిన జీవనశైలి, కాలుష్యం మరియు రసాయనాల వాడకం వల్ల జుట్టు ఆరోగ్యం దెబ్బతింటోంది. మీ జుట్టును ఒత్తుగా, పొడవుగా మరియు ఆరోగ్యంగా ఎలా ఉంచుకోవాలో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం...
ప్రేమించిన వారిని వదిలి వేరొకరిని పెళ్లి చేసుకుంటున్నారా? మీ జీవితం మరియు మీ భాగస్వామి భవిష్యత్తు కోసం ఈ విషయాలు తప్పక తెలుసుకోండి...
ఈ రోజుల్లో చాలా మంది ఎదుర్కొంటున్న అతి పెద్ద ఆరోగ్య సమస్య హార్మోన్ల అసమతుల్యత (Hormonal Imbalance). మనం ఎంత ప్రయత్నించినా బరువు తగ్గకపోవడం, ఎప్పుడూ అలసటగా అనిపించడం, మానసిక ఒత్తిడి.. ఇవన్నీ మీ హార్మోన్లు పంపే సంకేతాలు కావచ్చు...
పుట్టిన తర్వాత పిల్లలు పెద్దగా అయినా.. వారు చదువులు పూర్తయ్యి,  పెళ్ళి చేసుకుని, వారు కూడా పిల్లలను కన్నా సరే.. తల్లిదండ్రులకు మాత్రం తమ పిల్లలు ఎంతవాళ్లైనా ఇంకా చిన్న పిల్లలు గానే అనిపిస్తూ ఉంటుంది...
జీవితంలో విజయం సాధించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ విజయం కొందరే సాధిస్తారు. దీనికి కారణాలు చాలా ఉంటాయి...
భారతీయుల ఇళ్లలో చాలా వరకు కరివేపాకు మొక్క పెంచుతూ ఉంటారు. ఇంటి బయట ఏ మాత్రం కాస్త స్థలం ఉన్నా సరే.. మొదటగా కరివేపాకు మొక్కనే పెంచుతూ ఉంటారు. కరివేపాకు మొక్క ఎదుగుదలకు కూడా భారతీయ...
వేసవి కాలం వచ్చిందంటే ప్రతి ఇంట్లో కూలర్ల దుమ్ము దులిపి వాడటానికి సిద్దం చేస్తుంటారు.  అయితే చాలా మంది ఇబ్బంది పడే సమస్య కూలర్ నుండి దుర్వాసన రావడం.  కూలర్ ను శుభ్రం చేసి వాడటానికి సిద్దం చేసినా సరే..
భారతీయుల ఆహారంలో బెల్లం ప్రధాన పదార్థం. తీపి పదార్థాల తయారీ నుండి కూరలలో కూడా రుచి కోసం బెల్లం వాడుతూ ఉంటారు.  అయితే వేసవి కాలంలో బెల్లం విషయంలో పెద్ద సమస్య ఎదురవుతుంది....
ఒక్కసారి ఆలోచించండి.. ఉదయం నిద్రలేవగానే మీరు చూసే మొదటి ముఖం ఎవరిది? మీ భాగస్వామిదా లేక మీ మొబైల్ ఫోన్ స్క్రీనా? ఒకప్పుడు పక్కపక్కనే కూర్చుని మనసు విప్పి మాట్లాడుకునే వాళ్ళం..
నేటి కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యలలో ‘ఫ్రోజెన్ షోల్డర్’ (Frozen Shoulder) ఒకటి. వైద్య పరిభాషలో ‘అడెసివ్ క్యాప్సులైటిస్’ అని పిలిచే ఈ సమస్య వల్ల భుజం కీలు బిగుసుకుపోయి
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.