నిందితులకు రెడ్ కార్పెట్.. నిర్దోషులకు జైలు.. జగన్ సర్కార్ విధానమా?

Publish Date:Oct 14, 2023

Advertisement

హత్య చేసి శవాన్ని డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అనంతబాబును వైసీపీ సస్పెండ్ చేసింది. అయితే అది ఉత్తుత్తి సస్పెన్షనేనని తేటతెల్లమైపోయింది. ముఖ్యమంత్రి నిర్వహించే పార్టీ సమావేశాలలో ఆయన పాల్గొంటున్నారు. సీఎం తూర్పోగోదావరి జిల్లా పర్యటనల్లో అంతా తానై ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో వైసీపీ ఆయనపై సస్పెన్షన్ ఎత్తివేసిందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వడ్డించేవాడు మనవాడైతే చాలు భోజనం పంక్తిలో చివర కూర్చున్నా ఏం ఇబ్బంది లేదు అన్నట్లు ఎమ్మెల్సీ అనంతబాబు జగన్ కు అస్మదీయుడు కావడంతో ఆయన కూడా పార్టీలో ఉంటే ఏంటి? సస్పెండైతే ఏమిటి? అన్నట్లుగానే వ్యవహరిస్తున్నారు.

పార్టీ వర్గాలు, పోలీసులు కూడా ఆయనకు రెడ్ కార్పెట్ పరిచి మరీ రాచమర్యాదలు చేస్తున్నారు.   ఔను నిజమే హత్య కేసులో నేరం అంగీకరించి బెయిలుపై బయటకు వచ్చిన ఎమ్మెల్సీ అనంతబాబు ఇప్పుడు జగన్ చుట్టూనే తిరుగుతున్నారు.  జగన్ రెడ్డి గోదావరి జిల్లాల పర్యటనకు వచ్చిన సందర్భంగా  అనంతబాబుకు జగన్ రెడ్డి పక్కనే ఉంటున్నారు. అన్నిటికీ మించి గత  నెల 26న తాడేపల్లి హత్య చేశానంటూ స్వయంగా నేరాన్ని అంగీకరించిన అనంతబాబును పక్కన పెట్టుకుని జగన్ ప్రజలకు ఏం సంకేతమిస్తున్నట్లు అని చర్చ రాజకీయవర్గాలలో విస్తృతంగా జరుగుతోంది. ఇక అనంతబాబు స్వయంగా హత్య చేసినట్లు అంగీకరించినా.. ఆయనే స్వయంగా నేరాన్ని అంగీకరించారని పోలీసులే వెల్లడించినా.. దర్యాప్తు ముందుకు సాగడం లేదు. పైగా పోలీసులు ఆయనకు ఎక్కడ లేని మర్యాదా చూపుతూ అడుగులకు మడుగులొత్తుతున్నారంటేనే రాష్ట్రంలో నేరస్థులకు ఏ విధంగా ఏ స్థాయిలో అండదండలు అందుతున్నాయన్నది  అవగతమౌతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గొడ్డలి పోటును గుండెపోటుగా చిత్రీకరించడానికి  జరిగిన ప్రయత్నాలూ, అవి విఫలమైన తరువాత.. ఆ కేసులో నేరారోపణలు ఏదుర్కొంటున్న వారికి ప్రభుత్వపరంగా అందిన, ఇప్పటికీ అందుతున్న అండదండలనూ ఉదహరిస్తూ.. ఏపీలో జగన్ హయాంలో భారత రాజ్యాంగం మరుగున  పడిపోయిందనీ, ప్రత్యేకంగా ఏపీ కోసం జగన్ రెడ్డి తనదైన సొంత రాజ్యాంగాన్ని రూపొందించారా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం  చేస్తున్నారు.

ఇక అనంతబాబు విషయానికి వస్తే..   ఔను నా మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం తన వ్యక్తిగత వ్యవహారాల్లో మితిమీరిన జోక్యం చేసుకుంటున్న కారణంగా తానే స్వయంగా హత్య చేశానని పోలీసుల ఎదుట అంగీకరించారు. ఈ హత్యలో మరెవరికీ ప్రమేయం లేదని అనంతబాబు తమ విచారణలో అంగీకరించిట్లు  పోలీసులు వెల్లడించారు.  దీంతో అప్పట్లో ఆయనపై అనివార్యంగా కేసు నమోదు చేసి జైలుకు పంపినా.. జైల్లో ఆయనకు రాచమర్యాదలు చేశారని అప్పట్లోనే వార్తలు వచ్చాయి.  అయితే హత్య కేసులో నేరాన్ని అంగీకరించిన అనంతబాబును పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించినా వైసీపీ ఆయనకు తెరవెనుక అండదండలను అందిస్తూనే వచ్చింది. వస్తోంది.

ఇప్పుడు ఆయన బెయిలు మీద బయటకు వచ్చి  జగన్ ను అంటిపెట్టుకుని తిరుగుతున్నారు. జిల్లాలో పార్టీ ముఖ్య నేతగానే వ్యవహారాలన్నీ చక్కబెడుతున్నారు. దీంతో వైసీపీ అనంతబాబును సస్పెండ్ చేయడం కేవలం ప్రజలను మభ్యపెట్టేందుకేనని తేటతెల్లమైపోయిందని అంటున్నారు.  నిందితులకు  రెడ్ కార్పెట్ పరిచి, నిర్దోషులను ఖైదులో ఉంచడం అన్నది జగన్ సర్కార్ విధానమా అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

By
en-us Political News

  
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్,   విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  
 నామినేషన్ల ఉపసంహరణ గడువు  ముగిసే నాటికి  రాష్ట్ర వ్యాప్తంగా  77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.  ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు.  గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో   మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.