హైదరాబాద్ లో రెడ్ అలర్ట్ : వాతావరణ శాఖ

Publish Date:Aug 17, 2024

Advertisement

సీజన్ కాని సీజన్ లోనే వర్షం తన ప్రతాపం చూపిస్తుంది. ఇక తనకంటూ రాసిపెట్టి ఉన్న సీజన్ ఇది. ఇక విజృభించడమే పనిగా పెట్టుకుంటుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి.  హైదరాబాద్ లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి.  శుక్రవారం మధ్యాహ్నం నుంచి పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  హైదరాబాద్ లోని సికింద్రాబాద్, అల్వాల్, తిరుమలగిరి, ప్యాట్నీ, ప్యారడైజ్, బోయినపల్లి, బేగంపేట, చిలకలగూడ, మారేడుమిల్లి ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. కూకట్పల్లి, కేపీహెచ్బీ కాలనీ, ఆల్విన్ కాలనీ, మూసాపేట్, హైదర్ నగర్, ప్రగతి నగర్, నిజాంపేట్, బాచుపల్లి, మేడ్చల్, బాలానగర్‌, జీడిమెట్ల ప్రాంతాల్లో.. అలానే కండ్లకోయ, కృష్ణాపూర్, దుండిగల్, గండిమైసమ్మ, మియాపూర్, చందానగర్, గచ్చిబౌలి, రాయదుర్గం, లింగంపల్లి, కొండాపూర్ ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తుంది.
సనత్ నగర్, ఎర్రగడ్డ, ఈఎస్ఐ, ఎస్ఆర్ నగర్, పంజాగుట్ట, అమీర్‌పేట్, యూసుఫ్‌గూడ, జూబ్లీహిల్స్‌ ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. కుత్బుల్లాపూర్‌, షాపూర్‌, జగద్గిరిగుట్ట, గుండ్ల పోచంపల్లి, సూరారం, బహదూర్‌పల్లి, సుచిత్ర ఏరియాల్లో భారీగా వాన కురుస్తోంది. కోఠి, బేగంబజార్‌, సుల్తాన్‌ బజార్‌, బషీర్‌ బాగ్‌, లక్డీకపూల్, నాంపల్లి, అబిడ్స్‌, హిమాయత్‌ నగర్‌, చిక్కడపల్లి, నారాయణ గూడ ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వానలకు డ్రైనేజీలు పొంగుతున్నాయి. మురికి నీరు రోడ్లపైకి చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ వర్షాల కారణంగా నగర వ్యాప్తంగా ట్రాఫిక్ కి తీవ్ర అంతరాయం ఏర్పడింది. అమీర్ పేట్, ఖైరతాబాద్, లక్డీకపూల్, ఖాజాగూడ సిగ్నల్, బయోడైవర్సిటీ సిగ్నల్, ఐకియా సిగ్నల్, మల్కం చెరువు, గచ్చిబౌలి ప్రధాన రహదారుల మీద వాహనాలు భారీగా నిలిచిపోయాయి.
అయితే  హైదరాబాద్ నగర వ్యాప్తంగా కుండపోత వానలు కురిసే అవకాశం ఉందని  హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. ఇవాళ రాత్రి కూడా కుండపోత వర్షం కురుస్తుందని రెడ్ అలర్ట్ జారీ చేసింది. భారీగా వర్షాలు పడతాయని.. నగరవాసులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు. వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించడంతో జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. వర్షాల కారణంగా ప్రమాదం సంభవిస్తే సహాయం కోసం 040 211 11 111 నంబర్ కి ఫోన్ చేయాలని జీహెచ్ఎంసీ అధికారులు వెల్లడించారు. రెడ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో నగరవాసులు అప్రమత్తంగా ఉండాలి. మరికొన్ని గంటల పాటు కుండపోత వానలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. 

By
en-us Political News

  
భారతీయ రాజకీయ రంగంలో మరోసారి తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
దసరా పండుగ సెలవులు ప్రారంభం కావడంతో భాగ్యనగరంలో ప్రయాణికుల రద్దీ తారాస్థాయికి చేరింది.
దేశ రాజధాని న్యూఢిల్లీలో రాజకీయ వేడి తారాస్థాయికి చేరింది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రముఖ జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం లైంగిక వేధింపుల ఉదంతంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
పశ్చిమ బెంగాల్‌లోని నందిగ్రామ్‌ అసెంబ్లీ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి హసిరాణి రథ్‌ భారీ విజయం సాధించారు.
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఏవియేషన్ రంగానికి సంబంధించి అత్యంత కీలకమైన చారిత్రాత్మక పరిణామం చోటుచేసుకుంది.
ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి ప్రకటన అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గాదె సాయి కృష్ణ కస్టోడియల్‌ డెత్‌ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) కీలక ఛార్జిషీట్‌ను కోర్టుకు సమర్పించింది.
ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే అత్యున్నత పురస్కారాలలో ఒకటైన 2026 సంవత్సరపు నోబెల్ శాంతి బహుమతిని భారత సంతతికి చెందిన ప్రముఖ న్యాయకోవిదురాలు నవనీతం నవి పిళ్లై గెలుచుకున్నారు.
అర్ధరాత్రి వేళ రోడ్లపై పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ నగరవాసులకు విజ్ఞప్తి చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు. 
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.