పోలీస్ కొలువుల జాతర.. 7 వేల పోస్టుల భర్తీకి తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్.!

Publish Date:Jul 3, 2026

Advertisement

తెలంగాణలోని నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.  పోలీసు శాఖలో వివిధ  విభాగాలలో ఖాళీగా ఉన్న  7వేల పోస్టుల  భర్తీకి  చేసేందుకు  ఆమోదముద్ర వేసింది.  

ఈ భారీ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా అ పోలీస్, జైళ్లు, అగ్నిమాపక శాఖ, అలాగే స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ వంటి   విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనుంది.   మొత్తం 7వేల పోస్టులలో ఇప్పటికే   5వేల పోస్టుల భర్తీకి సంబంధించిన జీవోలను  జారీ చేసింది.   మిగిలిన 2వేల పోస్టులకు సంబంధించిన జీవోలు కూడా నేడో రేపో వెలువడనున్నాయని అధికార వర్గాల సమాచారం. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి   ఆర్థిక శాఖ అనుమతులు కూడా ఇప్పటికే లభించాయి. 

ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో, తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి (టీఎస్ఎల్‌పీఆర్‌బీ) సమగ్ర నోటిఫికేషన్ జారీ చేయడానికి  సన్నద్ధమైంది. ఒకటి రెండు రోజుల్లోనే.. అభ్యర్థుల వయోపరిమితి, విద్యార్హతలు, శారీరక ప్రమాణాలు, సిలబస్, పరీక్షల నిర్వహణ తేదీలతో కూడిన పూర్తి వివరాలనుటీఎస్ఎల్‌పీఆర్‌బీ తన అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనుంది. గత కొంతకాలంగా రాష్ట్రంలో కొత్త పోలీస్ నోటిఫికేషన్లు విడుదల చేయాలని, వయోపరిమితి సడలించాలని నిరుద్యోగ అభ్యర్థులు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.  

Telangana Police Recruitment 2026, TSLPRB Notification, TS Police Constable Jobs, Telangana SI Vacancies, Govt Jobs in Telangana, TS Home Department Jobs

By
en-us Political News

  
ప్రస్తుతం ఏక్‌నాథ్ షిండే ఆరోగ్య పరిస్థితి పూర్తిగా నిలకడగానే ఉందని, ఆందోళన చెందాల్సిన పని లేదని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. నిరంతరం వైద్యుల బృందం ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తూ తగిన చికిత్స అందిస్తోంది.
ఈ లీగల్ బ్యాటిల్‌లో ప్రశ్న రావణ్ తరఫున వాదించడానికి ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ రంగంలోకి దిగారు. రావణ్ పై ఎన్ని కేసులైనా పెట్టుకోండి, అతడిని బెయిలుపై బయటకు తీసుకువస్తానని జడశ్రావణ్ కుమార్ ప్రకటించారు.
వ్యాపార పెట్టుబడుల పేరుతో నమ్మించి, విదేశాల నుంచి మహిళలను రప్పించి, వారిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఉదంతం ఇప్పుడు అంతర్జాతీయంగా పెను సంచలనం సృష్టిస్తోంది. ఈ అమానుష కాండలో పాకిస్థాన్ ఉప ప్రధాన మంత్రి, విదేశాంగ మంత్రి అయిన ఇషాక్ దార్ సమీప బంధువు ప్రధాన నిందితుడిగా ఉండటం పాక్ రాజకీయాల్లో దుమారం రేపుతోంది.
బండ్ల గణేష్, ఆయన తండ్రి, సోదరుడు ప్రమోటర్లుగా వ్యవహరిస్తున్న శ్రీ పరమేశ్వర పౌల్ట్రీ ఫామ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ వ్యాపార అవసరాల కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి భారీ మొత్తంలో రుణాలు తీసుకుంది. ఈ బ్యాంకు రుణాలకు గ్యారెంటీగా హైదరాబాద్‌ జూబ్లీహిల్స్ పరిధిలోని షేక్‌పేట్‌లో ఉన్న సుమారు 500 గజాల నివాస భవనాన్ని వారు తాకట్టు పెట్టారు.
ఐపీఎల్ 2026 సీజన్‌లో అసాధారణ ఆటతీరుతో వెలుగులోకి వచ్చిన ఈ యంగ్ బ్యాటర్ ఇంటర్నేషనల్ ఎంట్రీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే.. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో వైభవ్‌కు తుది జట్టులో చోటు దక్కకపోవడంపై క్రికెట్ దిగ్గజాల విమర్శించడమే కాకుండా, సోషల్ మీడియా వేదికగా కూడా విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ లక్ష్యంగా నెటిజనులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
ఇరాన్ మాజీ అత్యున్నత నాయకుడు (సుప్రీం లీడర్) అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల క్రతువుకు సంబంధించి అంతర్జాతీయంగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
సోషల్ మీడియా దిగ్గజం మెటా యాజమాన్యంలోని ప్రముఖ ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌పై భారత ప్రభుత్వం అత్యంత తీవ్రమైన చర్యకు ఉపక్రమించింది.
రాష్ట్ర పోలీసు శాఖ పని తీరును మరింత ప్రజలకు చేరువ చేసే దిశగా డీజీపీ ఆనంద్ కీలక ఆదేశాలు జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజధాని అంశం మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
పారిశ్రామికాభివృద్ధి, ఉపాధి కల్పన, స్థానిక ఆర్థిక వ్యవస్థ బలోపేతం లక్ష్యంగా కుప్పం నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాల
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ జరిగి దశాబ్ద కాలం దాటినా, రాష్ట్రానికి ఒక శాశ్వతమైన, తిరుగులేని రాజధానిని నిర్మించుకోలేకపోవడం తెలుగు జాతి దురదృష్టం.
ఆంధ్రప్రదేశ్‌లోని మామిడి సాగుదారులకు కేంద్ర ప్రభుత్వం ఒక తీపి కబురు అందించింది.
కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానంతరం భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో స్వీకరించే శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయాలు ఈ ఏడాది జూన్ నెలలో రికార్డు స్థాయికి చేరుకున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.