ఏం తిన్నా నీరు తాగే అలవాటుందా.. ఈ పండ్లు తిన్నాక మాత్రం తాగొద్దండీ బాబూ!

Publish Date:Nov 25, 2023

Advertisement

ఆహారం శరీరానికి శక్తిని అందిస్తుంది. సాధారణంగా ఆహారం తింటున్నప్పుడు, తిన్న తరువాత నీరు తాగుతుంటారు. ఘనాహారం తినేటప్పుడు కొంచెం అయినా నీరు తాగాల్సిన అవసరం ఏర్పడుతుంది. కానీ నిజానికి ఆహారం బాగా నమిలి తింటే అస్సలు నీరు తాగాల్సిన అవసరమే లేదని వైద్యుల నుండి పోషకాహార నిపుణుల వరకు అందరూ చెబుతారు. కానీ కొందరికి మాత్రం ఏం తిన్నా నీరు తాగే అలవాటు ఉంటుంది. టిఫిన్, స్నాక్స్, పండ్లు, భోజనం ఇలా ఏం తిన్నా నీరు తాగుతుంటారు. కానీ కొన్ని పండ్లు తిన్న తరువాత నీరు అస్సలు తాగకూడదని వైద్యులు చెబుతున్నారు. ఇంతకూ ఆ పండ్లేంటో తెలుసుకుంటే..

బొప్పాయి..

బొప్పాయిలో చాలా మంచి పోషకాలు ఉంటాయి. వీటి ఆకులు, గింజలు, పండు అన్ని తింటారు. అయితే బొప్పాయి పండు తిన్నతరువాత  నీరు తాగకూడదు. ఎందుకంటే బొప్పాయిలో పపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది చాలా ఆలస్యంగా జీర్ణం అవుతుంది. బొప్పాయి తిన్నాక నీరు తాగితే జీర్ణాశయంలో ఇబ్బంది ఏర్పడుతుంది. కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి.

మామిడి పండ్లు..

నోరూరించే మామిడి పండ్లు తినడం అందరికీ మహా ఇష్టం. కానీ మామిడి పండ్లు తినగానే మామిడి పీచు పండ్లలో ఇరుక్కుందని కొందరు, అలవాటులో మరికొందరు నీరు పుక్కిలిస్తూ తాగుతుంటారు. కానీ మామిడి పండ్లు తిన్నాక నీరు తాగితే నష్టాలుంటాయి. మామిడి పండ్లలో ఉండే విటమిన్-సి, పోషకాలు శరీరానికి అస్సలు అందవు. పైపెచ్చు అజీర్ణానికి కారణమవుతుంది.

పుచ్చకాయ..

అధికశాతం నీరు కలిగిన పుచ్చ పండు తిన్నాక కూడా చాలామంది నీరు తాగుతారు. అదొక అలవాటు. పుచ్చకాయలో 90శాతం నీరు ఉంటుంది, మిగిలిన 10శాతం ఫైబర్, విటమిన్లు గట్రా ఉంటాయి.  అయితే పుచ్చకాయ తిన్న వెంటనే నీరు తాగితే కడుపు ఉబ్బరం, అజీర్తీ చేస్తుంది.

పైనాపిల్..

తియ్యగా, పుల్లగా ఉండే పైనాపిల్ సిట్రస్ పండు కోవకే చెందుతుంది. దీన్ని తిన్న తరువాత నీరు తాగినప్పుడు  గమనిస్తే నాలుక మండినట్టు ఉంటుంది.  దీనికి కారణం పైనాపిల్ లో బ్రోమెలనిన్ ఎంజైమ్ లు ఉంటాయి. ఇవి నాలుక మండటానికి కారణం అవుతాయి. కేవలం నాలుకే కాదు.. కడుపులో కూడా అసౌర్యం ఏర్పడుతుంది. పైనాపిల్ తినగానే నీరు తాగితే విరేచనాలు, కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయి.

అరటిపండు..

అరటిపండు పౌష్టికాహారంలో ఒక భాగం. వ్యాయామం చేసిన తరువాత, ప్రతిరోజూ పిల్లలు, పెద్దలు ఒక అరటిపండు తింటే మంచిదని చెబుతారు. అరటిపండులో కేలరీలు, పోషకాలు, చక్కెర శాతం ఎక్కువగానే ఉంటాయి. ఇక అరటిపండులో ఉండే పొటాషియం, మాంగనీస్ శరీరానికి ఎంతో అవసరం. కానీ అరటిపండు తిన్న తరువాత  నీరు తాగితే పండులో పోషకాలు శరీరానికి అందవు.

మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే పండ్లలో ఆల్రెడీ నీరు ఉంటుంది. అది శరీరాన్ని హైడ్రేట్ గా మారుస్తుంది. పండ్లలో ఉండే గుణాల కారణంగా పండ్లు తిన్న వెంటనే కొందరికి జలుబు కూడా చేస్తుంది. పండ్లను కూడా పూర్తీగా నమిలి తింటే అసలు నీరు తాగాల్సిన అవసరం ఉండదు.

                                                    *నిశ్శబ్ద.
 

By
en-us Political News

  
ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో, మారుతున్న ఆహారపు అలవాట్ల వల్ల చాలామంది శరీరానికి కావలసిన పోషకాలను సరిగ్గా అందజేయలేకపోతున్నారు. ఈ క్రమంలో శరీరంలో విటమిన్లు, ఖనిజాల లోపాన్ని భర్తీ చేయడానికి..
గుండె మానవ శరీరంలో అత్యంత కీలకమైన అవయవం, ఇది శరీరమంతటికీ ఆక్సిజన్ , పోషకాలను అందించడానికి నిరంతరం రక్తాన్ని పంపింగ్ చేస్తుంది. అయితే, మారుతున్న జీవనశైలి, ఒత్తిడి,  ఆహారపు అలవాట్లు సరిగా లేకపోవడం..
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యం అనేది ఒక సవాలుగా మారింది. ముఖ్యంగా 30-32 ఏళ్ల చిన్న వయసులోనే జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూనో, ఫంక్షన్లలో డ్యాన్స్ చేస్తూనో అకస్మాత్తుగా గుండెపోటుతో కుప్పకూలిపోతున్న వార్తలు మనల్ని..
చాలామంది రాత్రి వేళల్లో హాయిగా నిద్రిస్తున్న సమయంలో అకస్మాత్తుగా కాళ్ల పిక్కలు పట్టేయడం (Leg Cramps at Night) వల్ల తీవ్రమైన నొప్పితో మేల్కొంటూ ఉంటారు. కండరాలు గట్టిగా బిగుసుకుపోయి, కాళ్లు కదల్చలేనంతగా వచ్చే ఈ నొప్పిని ఆయుర్వేదంలో..
వేడి, విరేచనాలు లేదా వాంతులు వంటివి శరీరంలోని నీరు , ఎలక్ట్రోలైట్ల సమతుల్యతను త్వరగా దెబ్బతీస్తాయి. ఇలాంటి పరిస్థితులలో ఓఆర్ఎస్ తాగడం చాలా ముఖ్యం. చాలా నీరసంగా ఉన్నప్పుడు, ఆహారం సరిగా తీసుకోలేనప్పుడు...
ప్రతి మనిషి ఇతర మనిషికి చాలా  విభిన్నంగా, ప్రత్యేకంగా ఉంటారు. కొందరు చాలా శాంతంగా ఉంటారు, మరికొందరు ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూ చాలా చలాకీగా ఉంటారు. ఇంకొందరు చాలా చిన్న విషయాలకే తొందరగా కోపం
భారతీయులకు టీ, కాఫీ ఒక పెద్ద ఎమోషన్. గతంలో కంటే ప్రస్తుతకాలంలో  టీ తాగేవారి సంఖ్య చాలా పెరిగింది.  ఏదైనా పని చురుగ్గా చేయాలంటే చాలామంది మొదటగా టీ తాగుతారు.  ఇక పని మధ్యలో కూడా టీ తాగుతూ ఉత్సాహం తెచ్చుకుంటారు...
బలమైన రోగనిరోధక వ్యవస్థ అనేక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ముఖ్యంగా వైరస్‌లు, బ్యాక్టీరియా , ఇతర ఇన్ఫెక్షన్ల వల్ల కలిగే సమస్యలను చాలా వరకు నివారించవచ్చు. అయితే రోజురోజుకూ జీవనశైలి పేలవంగా మారడం..
ఉదయాన్నే నిద్రలేచి మంచం దిగగానే కాలి మడమలో సూదితో గుచ్చినట్లుగా తీవ్రమైన నొప్పి వస్తుంది కొందరికి.  ఇలా లేవగానే ఆ నొప్పితో కొన్ని అడుగులు వేయడమే చాలా కష్టంగా అనిపిస్తుంది. చాలామంది ఈ నొప్పిని సీరియస్ గా తీసుకోరు.  కొద్దిసేపు అలా నడవగానే అదే తగ్గిపోతుందిలే అని కాంప్రమైజ్ అయిపోతారు....
మన శరీరంలో కిడ్నీలు అత్యంత కీలకమైన అవయవాలు. అవి రక్తాన్ని శుద్ధి చేస్తూ, విషతుల్యాలను బయటకు పంపుతాయి. కానీ, దురదృష్టవశాత్తూ కిడ్నీ సమస్యలు వస్తే అది ఒక పీడకలలా మారుతుంది. డయాలసిస్ బెడ్ మీద గంటల తరబడి గడపడం..
నోటి ఆరోగ్యం అనేది మన సంపూర్ణ ఆరోగ్యానికి ముఖద్వారం లాంటిది. చాలా మంది పళ్ళను తెల్లగా, శుభ్రంగా ఉంచుకుంటే సరిపోతుందని అనుకుంటారు, కానీ పళ్ళ కంటే వాటిని పట్టి ఉంచే చిగుళ్ల ఆరోగ్యం చాలా ముఖ్యం. చిగుళ్ల వ్యాధులు..
ప్రస్తుత కాలంలో చాలా మందిని వేధించే ప్రధాన ఆరోగ్య సమస్యల్లో ‘ఐబీఎస్’ (Irritable Bowel Syndrome - IBS) ఒకటి. దీనినే తెలుగులో ‘పేగుల్లో గడబిడ’ లేదా జీర్ణకోశ సమస్య అని అంటారు. కొంతమందికి ఆహారం తీసుకోగానే మోషన్స్‌కు వెళ్లాల్సి.....
వేసవిలో ఎండలో తిరిగి అలసటతో  ఇంటికి తిరిగి రాగానే చాలా మందికి ఫ్రిజ్‌లోంచి చల్లటి నీళ్లు తాగే అలవాటు ఉంటుంది. తీవ్రమైన ఎండ, చెమటల తర్వాత చల్లటి నీరు తాగితే చాలా రిలాక్స్ గా ఉపశమనంగా అనిపిస్తుంది....
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.