ప్రశ్న రావణ్ పై ఉపా చట్టం ప్రయోగం వెనుక అసలు కారణాలివే.!

Publish Date:Jul 8, 2026

Advertisement

తెలుగువన్ ఎక్స్ క్లూజివ్

ఆంధ్రప్రదేశ్‌లో గత కొద్ది రోజులుగా తీవ్ర సంచలనం సృష్టిస్తున్న ప్రశ్న రావణ్ అలియాస్ జోసెఫ్ అరెస్ట్ వ్యవహారం సరికొత్త మలుపు తిరిగింది. గన్నవరం పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి, కోర్టు ముందు హాజరుపరచగా న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించడంతో నెల్లూరు జైలుకు తరలించారు. అయితే, ఆయనపై కేవలం పవన్ కళ్యాణ్ లేదా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులను దూషించారనే కారణంతోనే కాకుండా, అత్యంత కఠినమైన  ఉపా చట్టం కింద దేశద్రోహం కేసులు నమోదు చేయడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఈ కేసు పూర్వాపరాలను పరిశీలిస్తే.. కేవలం దళిత క్రిస్టియన్ శంఖారావం సభలో మాట్లాడిన వ్యాఖ్యల కోణంలోనే కాకుండా..  ఆయన వెనుక ఉన్న ఒక పెద్ద నెట్‌వర్క్‌ను పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌లో ఎండగట్టారు. గన్నవరం పోలీసులు సమర్పించిన నివేదిక ప్రకారం, ప్రశ్న రావణ్ దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించేలా ప్రవర్తించారనే బలమైన ఆరోపణలు ఉన్నాయి. నిషేధిత మావోయిస్టు పార్టీకి మద్దతుగా, యువతను ఆ మార్గం వైపు ప్రేరేపించేలా ఆయన కంటెంట్ ఉందనేది పోలీసుల ప్రధాన అభియోగం.

ముఖ్యంగా గత ఏడాది నవంబర్‌లో ఆయన విడుదల చేసిన కొన్ని వీడియోలను పోలీసులు పెన్ డ్రైవ్ రూపంలో న్యాయస్థానానికి సమర్పించారు. నిషేధిత సీపీఐ (ఎంఎల్) మావోయిస్టు సంస్థకు చెందిన కేశవరావు, హిడ్మా వంటి అగ్రనేతలను కీర్తిస్తూ..  వారు అమరజీవులని, మళ్లీ పుడతారని, యుద్ధం కొనసాగుతూనే ఉంటుందని రావణ్ వ్యాఖ్యానించినట్లు రిమాండ్ రిపోర్ట్‌లో స్పష్టంగా పేర్కొన్నారు. అమాయక గరిజన యువతను టార్గెట్ చేసుకుని దేశానికి వ్యతిరేకంగా యుద్ధం ప్రకటించేలా ఈ ప్రసంగాలు ఉన్నాయని ప్రాసిక్యూషన్ వాదిస్తోంది.

ఈ పరిణామాలపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ  రామకృష్ణ తెలుగువన్ న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడుతూ.. ఉపా' చట్టం కింద ఒకసారి కేసు నమోదైతే సాధారణ ఐపీసీ సెక్షన్లలాగా బెయిల్ రావడం సులభం కాదన్నారు. అయితే.. ఈ చట్టాన్ని శాంతిభద్రతలు సజావుగా ఉన్న ఏపీలో ప్రయోగించడం ఆందోళన కు గురిచేస్తోందనీ,  ప్రభుత్వం మారిన ప్రతిసారీ ఒకరు నేరస్థుడిగా, మరొకరు ప్రజాసేవకుడిగా మారిపోయే సంప్రదాయం సరికాదన్నారు.

ప్రస్తుతం ప్రశ్న రావణ్ ముందున్న ఏకైక మార్గం హైకోర్టును ఆశ్రయించడమేనన్న ఆయన..  ప్రశ్న రావణ్.. ఆయన తరపు న్యాయవాదులు క్వాష్ పిటిషన్  దాఖలు చేసి, ఈ ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని కోరే అవకాశం ఉందన్నారు. హైకోర్టుకు ఉన్న ప్రత్యేక అధికారాల ద్వారా వీడియో కంటెంట్‌ను క్షుణ్ణంగా పరిశీలించి..  ఒకవేళ ఆ ప్రసంగాల వల్ల సమాజంలో తక్షణ నష్టం లేదా హింస జరగలేదని భావిస్తే రావణ్‌కు ఉపశమనం లభించే అవకాశాలు ఉన్నాయని  రామకృష్ణ అభిప్రాయపడ్డారు. 

Prashna Ravana Arrest AP, Former Judge Ramakrishna Interview,  UAPA Case Andhra Pradesh, Ravana Remand Report, AP Politics Telugu News

 

By
en-us Political News

  
అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు అమరావతి ప్రతిపాదన తెచ్చినప్పుడు దొనకొండ పేరును గట్టిగా వినిపించాలని జగన్‌కు సీనియర్ నేత మైసూరా రెడ్డి సహా పలువురు సూచించారు. కానీ.. జగన్ అసెంబ్లీలో ఆ విషయాన్ని మర్చిపోయి విజయవాడ చుట్టుపక్కల రాజధాని పెట్టాలంటూ మాట్లాడారని, ఆ తర్వాత మాట మార్చలేక కాలయాపన చేశారని మధుసూదన్ రెడ్డి చెప్పారు.
రాయలసీమలో వైసీపీ  కీలక నేతలు, మాజీ ప్రజాప్రతినిధులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. జగన్  ఏకపక్ష నిర్ణయాలతో విసిగిపోయిన వారి చూపు ఇప్పుడు జనసేనపై ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ఈ క్రమంలోనే వైసీపీ నుంచి భారీగా వలసలు ఉంటాయని, త్వరలోనే గ్రేటర్ రాయలసీమలో వైసీపీ  ఖాళీ  అయిపోయినా ఆశ్చర్యం లేదనీ అంటున్నారు. 
ఒకవేళ కోర్టులో ఇవి ఎడిటెడ్ వెర్షన్లు అని రుజువైతే.. న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించినందుకు ప్రభుత్వ ప్రతిష్ట మసకబారుతుందని, ఇది ఎన్డీయే కూటమి ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బ అవుతుందని హెచ్చరించారు.
తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్.. తాను గ్రౌండ్ రియాలటీని గత ఎన్నికల సమయంలో చెప్పినా నమ్మలేదనీ, తాను 2014 ఎన్నికల్లోనూ, మొన్నటి 2024 ఎన్నికల్లోనూ కూడా ఆరు నెలల ముందే చంద్రబాబు, లోకేష్‌లకు సీట్ల మార్జిన్ గురించి కచ్చితమైన అంచనాలు చెప్పినా వినలేదని.. తీరా చూస్తే క్షేత్రస్థాయిలో తాను చెప్పిన ఫలితాలే వచ్చాయని ఉదహరించారు.
తాజాగా గుడివాడలో కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ.. యూట్యూబర్ రావణ్ అరెస్ట్ ఉదంతంపై.. తనదైన శైలిలో తనకు మాత్రమే సాధ్యమైన రీతిలో కొత్త రాజకీయ కుట్ర సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా, రాష్ట్రంలో పారిశ్రామిక విప్లవాన్ని తీసుకురావడమే ధ్యేయంగా సాగిన ఈ పర్యటన ఏపీ యువతకు ఉపాధి అవకాశాల వెల్లువను తీసుకురానుంది. స్పీడ్, స్టెబిలిటీ, సర్వీస్ అనే మూడు సూత్రాల 3ఎస్ మోడల్ తో పారదర్శక పాలన అందిస్తామని కొరియా దిగ్గజాలకు లోకేష్ భరోసా ఇచ్చారు.
2020 ఎన్నికల్లో అప్పటి అధికార పార్టీ బీఆర్ఎస్ ఏకంగా 56 స్థానాలను కైవసం చేసుకుని తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంది. ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకున్న బీజేపీ 48 స్థానాలతో గట్టి పోటీ ఇవ్వగా, ఎంఐఎం 44 స్థానాల్లో విజయం సాధించి పట్టు నిలుపుకుంది. కానీ, నాటి అధికార పీఠం కోసం పోరాడిన కాంగ్రెస్ పార్టీ మాత్రం కేవలం 2 స్థానాలకే పరిమితమైంది.
తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లుగా.. వాగ్వాదం కాస్తా ఘర్షణగా మారింది. పరస్పర దాడులకు దారి తీసింది. రాళ్లు, కర్రలతో ఇరువర్గాలూ పరస్పర దాడులకు తెగబడ్డారు. దీంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది.
వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకుని, ఒంగోలులోని వైసీపీ కార్యాలయంలో ఆయనకు నివాళులు అర్పించేందుకు ఏర్పాట్లు చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నివాళులర్పించే క్రమంలో స్వల్ప తొక్కిసలాట జరిగింది.
ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి ఇప్పటివరకు లక్ష్మారెడ్డి గన్‌మెన్‌లను వెంట పెట్టుకోకుండా ప్రజల మధ్యకు వస్తున్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం ఆయనకు ప్రభుత్వం భద్రతా సిబ్బందిని కేటాయించినప్పటికీ.. తనకు ప్రత్యేక భద్రత అవసరం లేదని చెబుతూ వారిని విధుల్లో కొనసాగనివ్వలేదు.
సీఎం పర్యటన ద్వారా ఈ కేసులోని సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ డీఎంకే ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. భారతి సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత ఆలస్యం కాకుండా ఉండేందుకు, తమకు అనుకూలంగా నిర్ణయం వచ్చేలా చూసేందుకు ఆమె ముందు జాగ్రత్తగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినట్లు పరిశీలకులు భావిస్తున్నారు.
కోలీవుడ్‌లోని మరికొందరు స్టార్స్ రాజకీయాలలోకి అడుగులు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరో ధనుష్ కూడా రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.