హిందూపురంలో తక్కువ ఓటింగ్.. కారణమేంటో తెలుసా?

Publish Date:May 16, 2024

Advertisement

ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ ముగిసి మూడు రోజులైంది. రాష్ట్రంలో పోలింగ్ శాతం ఎంతన్నది అధికారికంగా ఎన్నికల సంఘం ప్రకటించింది. రాష్ట్రంలో మొత్తం 81.86శాతం పోలింగ్ నమోదైంది. ఇది 2019 ఎన్నికలలో నమోదైన పోలింగ్ కంటే రెండు శాతం ఎక్కువ. సాధారణంగా అధిక ఓటింగ్ యాంటీఇంకంబెన్సీకి తార్కానమని రాజకీయ పండితులు చెబుతారు. ఫలితాలు కూడా అలాగే వస్తుంటాయి. ఈ సారి ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర సగటు ఓటింగ్ కంటే కీలక నియోజకవర్గాలలో అధిక పోలింగ్ జరిగింది. ఉదాహరణకు చెప్పాలంటే తెలుగుదేశం అధినేత పోటీ చేసిన కుప్పంలో, వైసీపీ అధినేత పోటీ చేసిన పులివెందులలో, అలాగే జనసేనాని పోటీలో ఉన్న పిఠాపురంలో, తెలుగుదేశం జాతీయ కార్యదర్శి పోటీలో ఉన్న మంగళగిరిలో రాష్ట్ర సగటు కంటే అధిక పోలింగ్ నమోదైంది. 
అయితే ఆశ్చర్యకరంగా నందమూరి బాలకృష్ణ పోటీ చేసిన హిందుపూర్ నియోజకవర్గంలో మాత్రం ఓటింగ్ తగ్గింది. హిందూపూర్ లో ఈ సారి 77.82 శాతం పోలింగ్ నమోదైంది. ఇది 2019 ఎన్నికలలో నమోదైన పోలంగ్ కంటే కూడా స్వల్పంగా తక్కువ. దీంతో హిందూపూర్ లో తక్కువ ఓటింగ్ నమోదు కావడానికి కారణాలపై విస్తృత చర్చ జరుగుతోంది. ఇక్కడ నుంచి 2014, 2019 ఎన్నికలలో తెలుగుదేశం అభ్యర్థి బాలకృష్ణ విజయం సాధించారు. ఈ సారి ముచ్చటగా మూడో సారి కూడా విజయకేతం ఎగురవేసి హ్యాట్రిక్ కొట్టాలన్న ఉత్సాహంతో ఉన్నారు.

అయితే హిందూపూర్ లో రాష్ట్ర సగటు కంటే పోలింగ్ తక్కువ నమోదు కావడానికి కారణం ఏమిటి? ఇక్కడ పరిస్థితి వైసీపీకి అనుకూలంగా ఏమైనా ఉందా అన్న సందేహాలు కొందరిలో వ్యక్తం అయ్యాయి. అయితే హిందూపుర్ తెలుగుదేశం పార్టీకి కంచుకోట. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ ఇక్కడ ఆ పార్టీ ఓడిపోయిన పరిస్థితి లేదు. ఇక బాలకృష్ణ విషయానికి వస్తే ఆయన హిందూపూర్ నుంచి 2014, 2019 ఎన్నికలలో విజయం సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా జగన్ గాలి వీచిన 2019 ఎన్నికలలో కూడా ఆయన ఘన విజయం సాధించారు. అంతే కాదు 2014 ఎన్నికలలో సాధించిన మెజారిటీ కంటే ఎక్కువ సాధించారు. ఆ ఎన్నికలలో రాయలసీమ మొత్తంలో తెలుగుదేశం కేవలం మూడంటే మూడు స్థానాలలోనే విజయం సాధించింది. అంతే కాదు ఆ ఎన్నికలలో చంద్రబాబు మెజారిటీ కూడా భారీగా తగ్గింది. అటువంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా బాలకృష్ణకు హిందుపూర్ ఓటర్లు బ్రహ్మరథం పట్టారు.  మరి అటువంటిది అంతా సానుకూలంగా ఉన్న ఈ సమయంలో హిందుపూర్ లో ఓటింగ్ శాతం తక్కువ నమోదు కావడమేమిటన్న ప్రశ్నకు పరిశీలకులు హేతుబద్ధంగా ఇస్తున్న విశ్లేషణ ఏమిటంటే.. హిందుపూర్ లో వైసీపీ ప్రచారం సమయంలోనే కాడె వదిలేసింది.

ఈ నియోజకవర్గంలో విజయంపై వైసీపీకి ఆశల్లేకపోవడంతో ఆ పార్టీ ప్రచారం కూడా పేలవంగా సాగింది.  ఇక్కడ బాలకృష్ణ ప్రత్యర్థిగా  దీపిక నిలబడ్డారు. నియోజకవర్గంలో ఆమె ప్రచారం అత్యంత పేలవంగా ఉంది. అంతే కాకుండా హిందుపూర్ నియోజకవర్గ వైసీపీలో గ్రూపు విబేదాలు తీవ్రంగా ఉన్నాయి. ఆ పార్టీ నేతల మధ్య ఐక్యత లేదు. తన విజయం పట్ల పూర్తి విశ్వాసంతో ఉన్న బాలకృష్ణ హిందూపూర్ తో పాటు కూటమి అభ్యర్థుల విజయానికి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించారు.  ఇక షెడ్యూల్ ప్రకటనకు ముందు వెలువడిన దాదాపు డజనుకు పైగా సర్వేలన్నీ కూడా హిందూపూర్ లో బాలకృష్ణ విజయం నల్లేరు మీద బండినడకేనని పేర్కొన్నాయి.   ఇక పోల్ మేనేజ్ మెంట్ విషయంలో కూడా హిందుపూర్ లో వైసీపీ ఘోరంగా విఫలమైంది. ఓటర్లను పోలింగ్ బూత్ లకు తీసుకువచ్చే ప్రయత్నం కూడా ఆ పార్టీ చేయలేదు. 

ఇక పోలింగ్ శాతం తక్కువగా ఉండడానికి హిందూపురం అర్బన్ ఓటర్లు పోలింగ్ బూత్ లకు రాలేదనీ, అలాగే ఇక్కడ నుంచి వలస వెళ్లిన వారికి ఓటింగ్ కు వచ్చేలా చేయడానికి పెద్దగా ప్రయత్నాలు జరగలేదనీ అంటున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే విజయంపై ధీమా ఉండటంతో తెలుగుదేశం పార్టీ కూడా వలస వెళ్లిన వారిని రప్పించేందుకు పెద్దగా కృషి చేయలేదని అంటున్నారు.  హిందుపూర్ లో బాలయ్య పై ఎలాంటి వ్యతిరేకతా లేకపోవడం వల్లనే ఓటింగ్ శాతం పెరగలేదనీ, పడిన ఓటంతా సానుకూల ఓటేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

By
en-us Political News

  
అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ మధ్య పోరు హోరాహోరీగా సాగే అవకాశం ఉంది, దీని ఫలితాన్ని అనేక నిర్మాణాత్మక మరియు రాజకీయ అంశాలు ప్రభావితం చేస్తున్నాయి.
కాపు రిజర్వేషన్ ఉద్యమ నేతగా ముద్రగడ పద్మనాభం తన చోటుకు ఎసరు వస్తున్నదా అన్న అనుమానంతో.. ఆ కాపు నేత తానేనని చాటుకోవడానికి తన వంతు ప్రయత్నాలు మొదలెట్టేశారంటున్నారు. నేను సైతం అంటూ ఆయన రంగంలోకి దిగినట్లు వైసీపీ వర్గీయులే అంతర్గత సంభాషణల్లో చెప్పుకుంటున్నారు. ఇందుకు తార్కానాలు కూడా చూపుతున్నారు.
ఉభయ సభలలో ఆమోదం పొందిన ఆ బిల్లు ఇప్పుడు దేశ ప్రథమ పౌరురాలు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వద్దకు చేరింది. ఇక ఆమె సంతకం పెట్టడానూ ఈ బిల్లు చట్టంగా మారుతుంది. ఆమె నేడో, రేపో ఈ బిల్లుపై సంతకం చేయడం ఖాయమని అంటున్నారు.
తమిళనాడులో 2026 ఎన్నికలు హోరాహోరీగా సాగే పోరుగా రూపుదిద్దుకుంటున్నాయి, ఇందులో స్పష్టమైన విజేత ఎవరూ లేరు. స్వల్ప ఓట్ల మార్పులు సీట్ల ఫలితాలపై నిర్ణయాత్మక ప్రభావాన్ని చూపవచ్చు.
రాజకీయం అంటే కేవలం అధికారంలో ఉండటం మాత్రమే కాదని, ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తూ ముందుకు సాగాలని వైసీపీకి హితవు పలుకుతున్నట్లుగా మాట్లాడుతూనే.. ఆ పార్టీకి కర్తవ్యబోధ చేశారు.
బిజెపికి 1951లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్థాపించిన భారతీయ జనసంఘ్‌తో పునాదులు పడ్డాయి. అక్క‌డి నుంచి ఈ పార్టీ అంచ‌లంచ‌లుగా ఎదిగి నేడీ స్థితికి చేరుకుంది. గ‌తంలో వాజ్ పేయి ఈ పార్టీకి అధికార వాస‌న రుచి చూప‌డంతో.. ఇప్పుడు వ‌రుస‌గా మూడు ప‌ర్యాయాల పాటు అధికారం చేజిక్కించుకుని.. ప్ర‌స్తుతం అప్ర‌తిహాత జైత్ర యాత్ర చేస్తోంది.
చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక పోలవరం జిల్లా చింతూరు, ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లో ఎండలు మండిపోతాయి. వడగాలుల ప్రభావం కూడా తీవ్రంగా ఉంటుంది.
రాఘవ్ చద్దా, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య తలెత్తిన అంతర్గత విభేదాలు ఇప్పుడు బహిరంగ యుద్ధంగా మారాయి.
న్ని ఎన్నికలలో విచిత్రాలు జరగవు. ప్రతిసారీ ఒకటే జరిగితే, దాన్ని విచిత్రం అనరు కదా? ఎన్నికలు జరిగి నిండా రెండేళ్లు కాకముందే నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఓటి పలుకు వినపడుతున్నది. కొందరు ప్రముఖులు పక్కదారులు చూస్తున్నారని, పక్క పార్టీతో బేరసారాలు జరుపుతున్నారని కూడా వినపడుతున్నది.
అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన పంథాను మార్చుకోలేదనేది స్పష్టమవుతోంది. ఐదేళ్ల పాలనలో మూడు రాజధానుల మంత్రం జపించిన జగన్.. ఇప్పుడు మచిలీపట్నం-విజయవాడ-గుంటూరును కలిపి ఒక మెగా సిటీగా మార్చాలనే సరికొత్త ప్రతిపాదనను ముందుకు తెచ్చారు.
మూడు రాజధానుల అంశం గత ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయానికి ప్రధాన కారణాలలో ఒకటి అన్న విషయాన్ని విస్మరించి.. మళ్ళీ అదే తరహా ప్రత్యామ్నాయ వాదనలు వినిపించడం పట్ల రాజకీయవర్గాలలో విస్మయం వ్యక్తమౌతోంది. పార్టీ కేడర్ సైతం మావిగన్ ఏంటి అదేదో పంటకు పట్టే తెగుల్లా ఉందని నెత్తీ నోరూ బాదుకుంటోంది.
ఆ రోజు సభలో ఓ మంత్రి తనపై చెయ్యి చేసుకున్నారని పేర్కొన్నారు. మరో మంత్రి ఏకవచనంతో తిట్టిపోశారు, కులం పేరుతో దూషిస్తూ తన పుట్టుకను నిందించారన్నారు. శాసనమండలిలో తన సిబ్బందినీ దగ్గరికి రాకుండా వైసీపీ సభ్యులు అడ్డుపడ్డారని, తన చుట్టూ చేరి బెదిరింపులు, ప్రలోభాలతో రకరకాలుగా ఇబ్బంది పెట్టారన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు 5 కోట్ల మంది ప్రజల తరఫున కృతజ్ణతలు తెలిపారు. దేశం మొత్తానిది ఒక దారైతే... తమదో దారి అన్నట్లు వైసీపీ వ్యవహరించిందని దుయ్యబట్టారు. రాష్ట్రం, దేశం నాశనమైనా పర్వాలేదు.. మాకు స్వార్థ రాజకీయమే ముఖ్యమన్నట్లుగా వైసీపీ వ్యవహరించిందని విమర్శించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.