జగన్ నెల్లూరు పర్యటన రద్దు కు కారణమేంటో తెలుసా?
Publish Date:Jul 2, 2025
.webp)
Advertisement
పేరుకే పరామర్శ యాత్ర.. కానీ వాస్తవంగా ఆ పేరుమీద మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ చేసేది బలప్రదర్శన. ఇప్పటి వరకూ జగన్ చేసిన పరామర్శ యాత్రలన్నీ ఈ విషయాన్ని నిర్ద్వంద్వంగా రుజువు చేశాయి. ఈ నేపథ్యంలోనే ఆయన నెల్లూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న కాకాణి గోవర్ధన్ రెడ్డిని పరామర్శించడానికి అంటూ తలపెట్టిన యాత్రకు పోలీసులు రోడ్ షోకు అవకాశం లేకుండా ఆయన హెలికాప్టర్ నేరుగా జిల్లా జైలుకు అతి సమీపంలో ల్యాండ్ అయ్యేలా హెలీప్యాడ్ కు అనుమతి ఇచ్చారు.
అయితే జగన్ ఉద్దేశం పరామర్శ కాదు..పెద్ద ఎత్తున జనసమీకరణ జరిపి బల ప్రదర్శన చేయడం. అందుకు అవకాశం లేకపోవడంతో జగన్ నెల్లూరు పర్యటనను రద్దు చేసుకున్నారు. జగన్ పర్యటన రద్దుకు కారణం ఇది అయితే.. జగన్ నెల్లూరు పర్యటనకు పోలీసులు అడ్డంకులు
సృష్టించారంటూ వైసీపీ ప్రచారం చేసుకుంటోంది. జగన్ హెలికాప్టర్ ల్యాండ్ కావడానికి సరైన స్థలం ఇవ్వలేదంటూ వైసీపీ చేస్తున్న విమర్శలన్నీ అవాస్తవాలేనని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. వాస్తవానికి గురువారం (జూన్ 3) జగన్ నెల్లూరు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ ను పరామర్శించాల్సి ఉంది. ఇందుకు పోలీసులు అనుమతి కూడా ఇచ్చారు. అయితే వైసీపీ కోరిన ప్రాంతంలో కాకుండా వేరే చోట జగన్ హెలికాప్టర్ కోసం హెలిపాడ్ కు అనుమతి ఇచ్చారు.
అయితే జగన్ తన పరామర్శ యాత్రలకు భారీ ర్యాలీ, జనసమీకరణలతో అట్టహాసంగా చేపట్టి శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా ప్లాన్ చేసుకుంటారు. ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే ప్రభుత్వ వైఫల్యం, పోలీసుల నిర్లక్ష్యం అంటూ విమర్శలు గుప్పించేందుకు సిద్ధంగా ఉంటారు. ఇక జగన్ పర్యటన ఆద్యంతం వైసీపీ శ్రేణులు ఆగడాలు, అరాచకాలకు అంతే లేదన్నట్లుగా చెలరేగిపోతాయి. ఇటీవల జగన్ యాత్రలలో అదే జరిగింది. ఈ నేపథ్యంలో జగన్ నెల్లూరు పర్యటన విషయంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. జగన్ భారీ ర్యాలీలకు అవకాశం లేకుండా నెల్లూరు జైలుకు సమీపంలో హెలిపాడ్ కు అనుమతి ఇచ్చారు. ఎందుకంటే జగన్ పరామర్శయాత్ర అంటూ బలప్రదర్శనకు పాల్పడుతున్నారని పోలీసులు అంటున్నారు. దీంతో శాతి భద్రతల సమస్య ఉత్పన్నమయ్యేలా వైసీపీ శ్రేణులు వ్యవహరిస్తున్నాయంటున్నారు. ప్రజా భద్రత ధ్యేయంగా తాము అన్ని చర్యలూ తీసుకోవాల్సి ఉంటుందనీ, అందుకే నెల్లూరు జైలుకు సమీపంలో హెలిపాడ్ ఏర్పాటు కు సూచించామనీ పోలీసులు చెబుతున్నారు. దీంతో జగన్ పర్యటనకు పోలీసులు అడ్డంకులు సృష్టించారన్న వాదనలో వాస్తవం లేదని తేలిపోయిందనీ, నెల్లూరు జైలుకు సమీపంలో హెలిప్యాడ్ ఏర్పాటు చేయడం వల్ల భారీ ర్యాలీకీ అవకాశం లేకుండా పోతుంది. హెలికాప్టర్ దిగా నేరుగా జిల్లా జైలుకు వెళ్లి కాకాణిని పరామర్శించి మళ్లీ వెంటనే అదే హెలికాప్టర్ లో వెనక్కు వెళ్లిపోవాల్సి ఉంటుంది.
పోలీసులు ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటంటే ఇటీవలే జగన్ పల్నాడు పర్యటన సంద ర్భంగా ఆయన ప్రయాణిస్తున్న వాహనం కింద పడి సింగమయ్య అనే వైసీపీ కార్యకర్త మరణించారు. ఈ సంఘటనకు సంబంధించి జగన్ పై కేసు కూడా నమోదైంది. దీంతో జగన్ రోడ్డు మార్గంలో భారీ వాహన శ్రేణితో ర్యాలీగా వచ్చే అవకాశం లేకుండా జైలుకు అతి సమీపంలో హెలిపాడ్ ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు వైసీపీకి సూచించారు. అయితే జగన్ కు మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి పరామర్శ కంటే రాజకీయ బల ప్రదర్శనే ముఖ్యం కనుక నెల్లూరు పర్యటనను, కాకాణి పరామర్శనూ రద్దు చేసుకున్నారు. అయితే తన పర్యటనకు పోలీసులు అడ్డంకులు సృష్టించారనీ, అనుమతి ఇవ్వలేదనీ ప్రచారం చేసుకుంటున్నారు. పల్నాడు వంటి సంఘటన పునరావృతం కాకూడదన్న ఉద్దేశంతోనే తాము నెల్లూరు జైలుకు అతి సమీపంలో హెలిపాడ్ కు స్థలం చూపామని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.
http://www.teluguone.com/news/content/reason-for-jagan-nellore-tour-cancil-39-201108.html












