బీఎల్ సంతోష్ హంగ్ ఆశల వెనుక మర్మం ఇదేనా?

Publish Date:Oct 10, 2023

Advertisement

తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ వెలువడింది. ఎన్నికల సన్నాహాల విషయంలో ఏ  పార్టీ ముందున్నది.. ఏ పార్టీ వెనుకబడింది అన్న సంగతి పక్కన పెడితే.. కేంద్ర ఎన్నికల సంఘం  మాత్రం తన పని తాను చేసేసి తాంబూలాలిచ్చేశాం తన్నుకు చావండి అనేసింది. తెలంగాణలో ప్రస్తుత  పరిస్థితులను గమనిస్తే త్రిముఖ  పోటీ అనివార్యం అనే అనిపిస్తుంది.

అయితే ఈ పోటీలో ఇప్పటికే బీజేపీ అస్త్ర సన్యాసం చేసేసింది. నిన్న మొన్నటి వరకూ రాష్ట్రంలో అధికారం మాదే అని ధీమాగా చెప్పిన బీజేపీ నేతలు ఇప్పుడు రాష్ట్రంలో హంగ్ వస్తుంది. అప్పుడు తిమ్మిని బమ్మిని చేసైనా, బమ్మిని తిమ్మిని చేసైనా అధికారం చేపడతామని చెబుతున్నారు. అలా బీజేపీ హంగ్ ఆశలపల్లకీలో ఊరేగుతుంటే.. సర్వేలు  మాత్రం వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ కు స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశాలున్నాయని పేర్కొంటున్నాయి.  అదే సమయంలో అధికార బీఆర్ఎస్ స్ట్రాంగ్ గా రెండో స్థానంలో నిలుస్తుందని చెబుతున్నాయి. మొత్తంగా ఇప్పటి వరకూ వెలువడిన రెండు సర్వేలూ కూడా రాష్ట్రంలో బీజేపీ సింగిల్ డిజిట్ కు మించి స్థానాలు సాధించే అవకాశాలు మృగ్యమేనని తేల్చేశాయి. తాజాగా వెలువడిన సీఓటర్ సర్వే కాంగ్రెస్ కు 48 నుంచి 60 స్థానాలు, బీఆర్ఎస్ కు 43 నుంచి 55 స్థానాలు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది.

అయితే  రెండు పార్టీల మధ్యా ఓ పదిహేసు స్థానాలలో తీవ్రమైన పోటీ ఉండటం వల్లే గెలిచే సీట్ల అంచనాలో గ్యాప్ ఎక్కువ ఉందని సర్వే పేర్కొంది.  సరే ఎలా చూసినా తెలంగాణలో  సప్పోజ్, ఫర్ సప్పోజ్ హంగ్ వస్తే చక్రం తిప్పే అవకాశం మాత్రం బీజేపీకి ఏ మాత్రం ఉండదన్నది మాత్రం వాస్తవమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 119 స్థానాలున్న అసెంబ్లీలో ఓ తొమ్మిది స్థానాలతో అధికారాన్ని చేపట్టే అవకాశం బీజేపీకి ఇసుమంతైనా ఉండదన్నది వారి విశ్లేషణ. ఈ విశ్లేషణలన్నీ ఇటీవల వెలువడిన రెండు సర్వేల ఆధాకరంగా జరిగినవే. 

ఇక ఓట్ల శాతం పరంగా చూసిన బీజేపీ కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు దూరంగా మూడో స్థానంలో నిలిచింది. సీవోటర్ సర్వే మేరకు కాంగ్రెస్ 39 శాతం ఓట్లు సాధిస్తుంది, బీఆర్ఎస్ 37శాతం ఓట్లతో రెండు స్థానానికి పరిమితమౌతే.. బీజేపీ 16 శాతం ఓట్లతో మూడో స్థానంలో నిలుస్తుంది. ఈ నేపథ్యంలో  బీజేపీ హంగ్ అంచనా అయితే గియితే నిజమైనా.. అధికారం చేపడతామన్న ఆశలు మాత్రం నెరవేరే అవకాశం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక్కడే విమర్శకులు బీజేపీ అగ్రనేత బీఎల్ సంతోష్ చేసిన హంగ్ తప్పదు.. అధికారం మాదే అన్న వ్యాఖ్యల వెనుక మర్మాన్ని ఎత్తి చూపుతున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ బీజేపీ బీ టీమ్ అంటూ ఎప్పటి నుంచో ఉన్న భావన వాస్తవమే అనడానికి సంతోష్ వ్యాఖ్యలు నిదర్శనమని అంటున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ను అధికారానికి దూరంగా ఉంచడం అనే  ఏకైక లక్ష్యంతో బీఆర్ఎస్ ఉద్దేశపూర్వకంగా రాష్ట్రంలో బీజేపీ గ్రాఫ్ పెంచిందని చాలా కాలంగా ఆరోపణలు ఉన్న సంగతి విదితమే. రాష్ట్ర కాంగ్రెస్ నేతలు, మరీ ముఖ్యంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఈ విషయంపై పలు మార్లు సోదాహరణంగా చెప్పారు.

ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొన్న అందరినీ అరెస్టు చేసిన ఈడీ కవితకు మాత్రం అరెస్టు నుంచి వెసులుబాటు ఇవ్వడాన్ని ఆయన ప్రధానంగా ఎత్తి చూపారు. ఈ నేపథ్యంలోనే బీఎల్ సంతోష్ హంగ్ తధ్యం అధికారం మాదే అన్న మాటను అర్ధం చేసుకోవాల్సి ఉంటుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక పరిశీలకుల అంచనా ప్రకారం  రానున్న 50 రోజులలో అంటే ఎన్నికల నాటికి  తటస్థ ఓటర్లు కాంగ్రెస్ వైపు పోలరైజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా చంద్రబాబు అరెస్టు తరువాత  బీఆర్ఎస్ పై ప్రజాగ్రహం వ్యక్తం అవుతోందని, ఇంత కాలం ఆ పార్టీకి మద్దతుగా నిలిచిన సెటిలర్లు, తెలుగుదేశం క్యాడర్ అధికార పార్టీకి దూరం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. దానికి తోడు కాంగ్రెస్ ఆరు గ్యారంటీలకు ప్రజల నుంచి సానుకూల స్పందన వ్యక్తం అవుతున్నదని చెబుతున్నారు.  

By
en-us Political News

  
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్,   విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.