చట్నీ గిన్నెలో ఎలుక స్విమ్మింగ్!
Publish Date:Jul 9, 2024
Advertisement
సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ జేఎన్టీయూ కాలేజీ హాస్టల్లోని చట్నీ గిన్నెలో ఎలుక స్విమ్మింగ్ చేసింది. విశాలంగా వున్న చట్నీ గిన్నెలో సదరు ఎలుకమ్మ ప్రొఫెషనల్ స్విమ్మర్లాగా ఈత కొట్టింది. ఈ నేపథ్యంలో హాస్టల్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. హాస్టల్లో తమకు నాణ్యమైన ఆహారం ఇవ్వడం లేదని ఆరోపించారు. క్యాంటిన్ సిబ్బంది పరిశుభ్రత పాటించడం లేదని వారు అంటున్నారు. చట్నీ గిన్నెలో ఈదుతున్న ఎలుక విజువల్స్.ని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ నేపథ్యంలో జేఎన్టీయూ కాలేజ్ ప్రిన్సిపాల్ నరసింహ స్పందించారు. విద్యార్థులు తినే చట్నీ గిన్నెలో ఎలుక పడలేదని, శుభ్రం చేయడానికి పక్కన పెట్టేసిన చట్నీ గిన్నెలో ఎలుక పడిందని చెప్పారు. కొంతమంది విద్యార్థులు కావాలనే వీడియో తీసి దానిని సోషల్ మీడియాలో పెట్టడం, ప్రజా ప్రతినిధులకు పంపించడం చేశారని వివరించారు.
http://www.teluguone.com/news/content/rat-swimming-in-chutney-bowl-25-180366.html





