మోడీ ప్రమాణ స్వీకారోత్సవంలో రజనీకాంత్
Publish Date:Jun 9, 2024
Advertisement
వరుసగా మూడో పర్యాయం భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాత్రి 7.15 గంటలకు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో ఈ కార్యక్రమం జరగనుంది. దాదాపు 8 వేల మంది అతిథులు మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకానున్నారు. వారిలో దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఉన్నారు. తెలుగు ప్రేక్షకులకు రజనీకాంత్ పేరు తెలియకుండా ఉండరు. సినిమాల సంగతి అటుంచితే ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో కూడా రజనీ కాంత్ పేరు గత మూడు దశాబ్దాలుగా వినిపిస్తూనే ఉంది. ఎన్టీఆర్ అభిమాని అయిన రజనీకాంత్ తెలుగు దేశం పార్టీ పెట్టిన నాటి నుంచి వెన్నంటే ఉన్నారు. తెలుగు దేశం పార్టీ సంక్షోభ సమయంలో అండగా నిలిచారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నాదెళ్ల భాస్కరరావు వెన్నుపోటు పొడిచినప్పుడు కూడా ఆయన ఎన్టీఆర్ కు బాసటగా నిలిచారు. , రాజ్యాంగేతర శక్తి అయిన లక్ష్మి పార్వతి టిడిపిలో జోక్యం చేసుకోవడాన్ని రజనీకాంత్ పూర్తిగా ఎండగట్టారు. లక్ష్మి పార్వతికి దుష్ట శక్తి అనే బిరుదు ఇచ్చిన వ్యక్తి కూడా రజనీకాంత్ కావడం గమనార్హం. ఈ తరంలో చాలామందికి ఈ విషయం తెలియకపోవచ్చు. తెలుగు దేశం పార్టీ ప్రత్యర్థులైన వైఎస్ ఆర్ సిపితో జత కట్టి లక్ష్మిపార్వతి నీచరాజకీయాలు చేశారు. ఎన్టీఆర్ ఆశయాలకు పూర్తిగా తిలోదకాలిచ్చారు. నిరుడు ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు హాజరైన రజనీకాంత్ పై వైసీపీ నేతలు నోరు పారేసుకున్నారు. గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని అయితే రజనీకాంత్ మీద బాడీ షేమింగ్ చేసి పరువు పోగొట్టుకున్నారు తెలుగు, తమిళ రాష్ట్రాల్లో అభాసుపాలయ్యారు. దీంతో వైసీపీకి వ్యతిరేకంగా రెండు రాష్ట్రాల్లో నిరసన వ్యక్తం అయ్యింది. ఎపిలో కూటమి సునామీ మాదిరిగా దూసుకుపోవడంతో రజనీకాంత్ ఇప్పటికే టిడిపి అధినేత చంద్రబాబుకు శుభా కాంక్షలు తెలిపారు. ఢిల్లీ చేరుకున్న రజనీకాంత్ ను మీడియాతో పలకరించింది. తాను మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవుతున్నానని వెల్లడించారు. ఇది చారిత్రాత్మక ఘట్టం అని రజనీకాంత్ అభివర్ణించారు. వరుసగా మూడోసారి ప్రధానమంత్రి పదవి చేపట్టబోతున్న నరేంద్ర మోదీ గారిని అభినందిస్తున్నానని తెలిపారు.
http://www.teluguone.com/news/content/rajinikanth-at-the-swearingin-ceremony-25-178201.html





