ఓటమిని తలదించుకునేలా చేసిన స్ఫూర్తిదాయక విజయం.. రాజేశ్వరి

Publish Date:Mar 9, 2026

Advertisement

ఓటమి విజయానికి తొలి మెట్టు అని భావించి వైఫల్యాలకు కుంగిపోకుండా పట్టుదలతో ముందడుగు వేసి అనుకున్నది సాధించారు రాజేశ్వరి సువే. సివిల్స్ లో అఖిల భారత స్థాయిలో రెండో ర్యాంకు సాధించిన తమిళనాడుకు చెందిన రాజేశ్వరి సువేది ఒక స్ఫూర్తిదాయక గాధ.  అత్యంత కఠినమైన యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్  లో  ఆమె సాధించిన విజయం నాలుగు వైఫల్యాల తరువాత ఆమెకు చిక్కింది.  కృషి ఉంటే మనుషులు రుషులౌైతారు.. మహాపురుషులౌతారు అన్నట్లుగా ఆమె వరుస వైఫల్యాలకు కుంగిపోకుండా.. పట్టుదలతో ముందడుగు వేసి సివిల్స్ ర్యాంకు సాధించారు.  

మదురై జిల్లా వాడిపట్టికి చెందిన రాజేశ్వరిది విద్యావంతుల కుటుంబం. తండ్రి మురుగేశన్ వ్యాపారవేత్త కాగా, తల్లి ప్రభుత్వ కళాశాల ప్రొఫెసర్. చెన్నైలోని వెల్-టెక్ మల్టీటెక్ ఇంజినీరింగ్ కాలేజీలో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన రాజేశ్వరి, కాలేజీ రోజుల్లో ఎన్సీసీ క్యాడెట్‌గా ఉండేవారు. ఆ క్రమశిక్షణే ఆమెను సివిల్స్ వైపు నడిపించిందని చెబుతారామె. 

రాజేశ్వరి ప్రస్తుతం తమిళనాడులో డిప్యూటీ కలెక్టర్‌గా (గ్రూప్-1) శిక్షణ పొందుతున్నారు. బాధ్యతలు నిర్వర్తిస్తూనే, సమయాన్ని సమర్థవంతంగా మేనేజ్ చేస్తూ యూపీఎస్సీకి సిద్ధమయ్యారు.  అసాధ్యం అనే పదం తన డిక్షనరీలోనే లేదని రాజేశ్వరి తన విజయంతో నిరూపించారు.  

 కేవలం పుస్తకాలు చదవడమే కాకుండా, ప్రతి అంశంపై తనదైన శైలిలో షార్ట్ నోట్స్ తయారు చేసుకుంటూ సివిల్స్ కు ప్రిపేరయ్యారామె. సమాజంపై లోతైన అవగాహన కోసం ఆమె  సోషియాలజీ  ఐచ్ఛికాంశంగా ఎంచుకున్నారు.  దినపత్రికలను క్షుణ్ణంగా చదవడం ద్వారా కరెంట్ అఫైర్స్‌పై పట్టు సాధించారు. ఇంటర్వ్యూ బోర్డు ముందు  తెలియని ప్రశ్నలకు  తెలియదు నిజాయితీగా బదులిచ్చారు. అలాగే, డిప్యూటీ కలెక్టర్‌గా తన అనుభవాలు కూడా ఇంటర్వ్యూను సమర్ధంగా ఎదుర్కొనేందుకు దోహదపడ్డాయని చెబుతారామె.  సాధారణంగా టాప్ ర్యాంకర్లెవరైనా ఐఏఎస్ ను ఎంచుకుంటారు. కానీ రాజేశ్వరి మాత్రం తన లక్ష్యం ఐపీఎస్ ఐపీఎస్ అని దృఢంగా చెప్పారు. 

ఎన్సీసీ క్యాడెట్ గా  యూనిఫాం ధరించినప్పుడు కలిగిన గర్వం, దేశవ్యాప్తంగా మహిళల భద్రత కోసం పనిచేయాలనే తపనే తనను ఐపీఎస్ వైపు నడిపించాయన్నారు రాజేశ్వరి.. ఓటమిని తలదిం చునేలా చేసిన రాజేశ్వరి ప్రస్థానం నేటి యువతకు,   సివిల్స్ అభ్యర్థులకు నిస్సందేహంగా స్ఫూర్తిదాయకం. 

By
en-us Political News

  
హైద‌రాబాద్ మెట్రో ఫేజ్‌-IIకు ఆమోదం తెల‌పాల‌ని కేంద్ర ప‌ట్ట‌ణ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి మ‌నోహ‌ర్‌లాల్ ఖ‌ట్ట‌ర్‌కు ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డిపై వరంగల్ సభలో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ తక్షణం క్షమాపణలు చెప్పాలని మంత్రి సీతక్క డిమాండ్ చేశారు.
రిటైర్డ్ డీజీపీ బి. శివధర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర భద్రతా సలహాదారుగా బాధ్యతలు స్వీకరించారు.
తన పర్యటనల సమయంలో ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశాలు
వరంగల్ జిల్లాలో నిర్వహించిన రైతు సంగ్రామ సదస్సు వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
తమిళనాడు రాజకీయ చరిత్రలో ఒక అద్భుత ఘట్టం ఆవిష్కృతమవుతోంది.
ఆంధ్రప్రదేశ్‌లో ట్రాఫిక్ నిబంధనల అమలు విషయంలో కూటమి ప్రభుత్వం కఠిన నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది.
తెలంగాణలోని రేషన్ కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది.
తిరుమల శ్రీవారి భక్తులకు సత్వర దర్శనం కల్పించడమే లక్ష్యంగా టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది.
క్యారియర్ సంస్థ భారతదేశంలో తమ ఉత్పత్తుల్లో 80 శాతం తిరుపతి జిల్లా శ్రీసిటీ నుంచి నుంచి సరఫరా చేయనుంది.
మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు.
జూబ్లీహిల్స్ మైనర్ బాలికల ట్రాప్ కేసులో రోజురోజుకూ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు పనులను మంత్రి రామానాయుడు మంగళవారం రాత్రి ప్రత్యక్షంగా పరిశీలించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.