లక్నోపై రాజస్థాన్ గెలుపు.. పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి

Publish Date:Apr 22, 2026

Advertisement

ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు తన విజయ పరంపరను కొనసాగిస్తోంది. తాజాగా లక్నోలోని ఏక్నా స్టేడియం వేదికగా బుధవారం (ఏప్రిల్ 22) జరిగిన ఉత్కంఠభరిత పోరులో లక్నో సూపర్ జెయింట్స్‌పై రాజస్థాన్ రాయల్స్  40 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. తక్కువ స్కోరు నమోదైన ఈ మ్యాచ్‌లో బౌలర్లు అద్భుత ప్రదర్శన కనబరిచారు. ఈ విజయంతో  రాజస్థాన్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి దూసుకెళ్లింది.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన లక్నో జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ ఆరంభంలోనే మహమ్మద్ షమీ ధాటికి ఓపెనర్ యశస్వి జైస్వాల్ (22), ధ్రువ్ జురెల్ పెవిలియన్‌కు చేరడంతో రాజస్థాన్ కష్టాల్లో పడింది. అయితే క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజా బాధ్యతాయుతంగా ఆడి 43 పరుగులు చేయడంతో జట్టు గౌరవప్రదమైన స్కోరు సాధించగలిగింది. ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్‌లో మయాంక్ అగర్వాల్ 20 పరుగులు సమర్పించుకోవడం రాజస్థాన్‌కు కలిసొచ్చింది.

అనంతరం 160 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్ రాజస్థాన్ బౌలర్ల ధాటికి చేతులెత్తేసింది. ఆరంభంలోనే రిషబ్ పంత్ డకౌట్ కాగా, మిచెల్ మార్ష్ (55) ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకపోయింది. మిగిలిన బ్యాటర్లు ఎవరూ క్రీజులో నిలదొక్కుకోలేకపోవడంతో లక్నో 18 ఓవర్లలోనే 119 పరుగులకుఆలౌట్ అయింది. ముఖ్యంగా చివరి 15 పరుగుల వ్యవధిలోనే లక్నో ఏకంగా ఐదు వికెట్లు కోల్పోయింది.

రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ మూడు వికెట్లతో లక్నోబ్యాటింగ్ ఆర్డర్ నడ్డి విరిచాడు. ఆర్చర్ కు తోడుగా  బ్రిజేష్ శర్మ, నాంద్రే బర్గర్ చెరో రెండు వికెట్లు తీసి ప్రత్యర్థిని కట్టడి చేశారు. సమష్టి కృషితో  రాణించిన రాజస్థాన్, లక్నోను వారి సొంత మైదానంలోనే చిత్తు చేసింది. ప్రస్తుత పాయింట్ల పట్టికను పరిశీలిస్తే, ఆరు మ్యాచ్‌లలో ఐదు విజయాలు నమోదు చేసిన పంజాబ్ కింగ్స్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ తాజా విజయంతో రాజస్థాన్ రాయల్స్ మొత్తం 10 పాయింట్లు ఖాతాలో వేసుకుని రెండో స్థానానికి చేరుకుంది.   

By
en-us Political News

  
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెపై ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తూ స్పందించింది.
దేవాదాయశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ కాళింగిరి శాంతికి సంబంధించి విజయవాడ ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తోందని ఆరోపిస్తూ, మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేసిందని బండి సంజయ్ మండిపడ్డారు.
తమిళనాడు మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సాయంత్రంతో ముగిసింది.
రాష్ట్రంలో అత్యంత చర్చనీయాంశంగా మారిన పీసీ ఘోష్ కమిషన్ నివేదిక వ్యవహారం మరో మలుపు తిరిగింది.
చాయ్ అంటే ప్రాణం పెట్టే నగరం హైదరాబాద్. ఉదయం కప్పు నుంచి అర్ధరాత్రి స్టాల్ వరకూ చాయ్ లేకుండా రోజే కదలదు.
అధికారంలో ఉన్నప్పుడు ఒకలా.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోలా వద్దు జగ్గారెడ్డి సంచలన పోస్ట్
ఇరాన్‌పై అగ్రదేశం అమెరికాతో కలిసి దాడి చేయాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెనత్యాహూ ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నారంట
ఒక మత చిహ్నానికి ప్రాధాన్యతనిచ్చి, మరో మత సంప్రదాయాలను కించపరచడం సెలెక్టివ్ టార్గెటింగ్ అని నెటిజన్లు విమర్శలు గుప్పించారు. సోషల్ మీడియా వేదికగా లెన్స్ ‌కార్ట్ పట్ల వ్యతిరేకత పెచ్చరిల్లడంతో.. బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినే సూచనలు కనిపించడంతో.. సంస్థ సీఈఓ పేయుష్ బన్సల్ రంగంలోకి దిగారు.
తెలంగాణలోని వరంగల్ జిల్లా నర్సంపేటలో తీవ్ర విషాదకర సంఘటన చోటు చేసుకుంది.
ఒకటి.. హిజాబ్, టర్బన్ అనుమతి.. అంటే నల్లరంగు హిజాబ్, నల్ల టర్బన్ ధరించవచ్చు. హిజాబ్ ఛాతీ వరకు కవరేజ్ ఉండాలి, కంపెనీ లోగో కనిపించేలా ఉండాలి. అయితే బుర్ఖా మాత్రం స్టోర్లో అనుమతించబడదని గైడ్లో ఉంది. రెండు..బొట్టు, తిలకం చేతితాడుపై నిషేధం.. ఆ డాక్యమెంట్ లో మత చిహ్నం అయిన తిలకం, బింది, స్టిక్కర్ లకు అనుమతి లేదని స్పష్టంగా ఉంది. అలాగే మతపరంగా చేతికి కట్టుకుని తాడు కూడా నిషేధం అని విస్పష్టంగా ఉంది.
ఢిల్లీ హత్యాచార నిందితుడు క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ చూసి పోలీసులే నోరెళ్ల పెడుతున్నారు
ఒంటిమిట్ట అర్చకులకు టీటీడీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.