రాజస్థాన్ సీఎం గెహ్లాట్ తప్పులో కాలు! బడ్జెట్ ప్రసంగం అభాసు పాలు!

Publish Date:Feb 11, 2023

Advertisement

కుడి ఎడమైతే పోరపాటు లేక పోవచ్చు. కానీ  ఏకంగా రాష్ట్ర బడ్జెట్ తారుమారై  పోతే, కిందటేడాది బడ్జెట్ ను తీసుకొచ్చి ఈ ఏటి బడ్జెట్ ఇదే అని చదివి వినిపిస్తే ఏమవుతుంది? ఆ చదివింది ఏకంగా ఆ రాష్ట్ర ముఖ్య మంత్రే అయితే..ఇంకెలా ఉంటుంది? వినడానికి ఇది కొంచెం విచిత్రంగా అనిపించినా, రాజస్థాన్‌ శాసన సభలో అదే జరిగింది.  ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్ 2023-24 వార్షిక బడ్జెట్ ను శాసన సభలో ప్రవేశ పెట్టారు. అయితే, అది ఈ ఏడాది బడ్జెట్ కాదు. గత సంవత్సరం బడ్జెట్  నే, ఉత్సాహంగా చదువు కుంటూ పోయారు.  అలా ఓ ఎనిమిది నిముషాలో ఏమో ఆయన పాత పద్దులనే చదువుకుంటూ పోయారు. అలాగే వదిలేస్తే.. చివరి వరకు చదివేసి కూర్చునే వారో ఏమో కానీ, కొంచెం చాల ఆలస్యం గానే అయినా అధికారులు, సిఎం గారి స్పీచ్ రివర్స్ లో పోతోందని గుర్తించారు.

ఆల్రెడీ అమలవుతున్న పట్టణ ప్రాంత  పేదలకు కోసం ఉద్దేశించిన  ఉపాధి హామీ పధకం ఇప్పుడే కొత్తగా ప్రవేశ పెడుతున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించడంతో అధికారులు కళ్ళు నులుముకున్నారు. ముఖ్యమంత్రి తప్పులో కాలేశారని గత సంవత్సరం బడ్జెట్ చదివేస్తున్నారని గుర్తించారు. అదే విషయాన్ని అధికారులు మంత్రి దృష్టికి తీసుకురావడంతో ముఖ్యమంత్రి నాలుక కరుచుకున్నారు. అదే సమయంలో ప్రతిపక్ష సభ్యులు వెల్ లోకి దూసుకొచ్చి నిరసన తెలిపారు. సభలో  గందరగోళం చోటు చేసుకుంది. ఆయన గతేడాది పద్దులోని విషయాలనే ఈ సారి కూడా చదవడంతో ఈ పరిస్థితి ఎదురైంది. 

సీఎం అశోక్ గెహ్లాట్ వద్దే  ఆ రాష్ట్ర ఆర్థిక శాఖ కూడా ఉంది. ఈ క్రమంలో  శుక్రవారం ( ఫిబ్రవరి 10) ఆయనే అసెంబ్లీలో బడ్జెట్‌  ప్రవేశపెట్టారు. ఈ ప్రతులను చదవడం ప్రారంభించిన ఆయన.. పాత పథకాలు, గత ఏడాది అమలు చేసిన పట్టణాభివృద్ధి ప్రణాళికలను ప్రస్తావించారు. కాంగ్రెస్ మంత్రి మహేశ్‌ జోషి ఈ విషయాన్ని గుర్తించి, సీఎంకు తెలియజేశారు. ఈ పరిణామంతో బీజేపీ సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. కొత్త పద్దులోని విషయాలు లీక్ అయ్యాయా..? అని నిలదీశారు.  దీంతో సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగింది. ఎనిమిది నిమిషాల పాటు సీఎం పాత బడ్జెట్‌ను చదివారు. ఇలా జరగడం చరిత్రలో ఇదే తొలిసారి కావొచ్చు. నేను సీఎంగా ఉన్నప్పుడు.. ఒకటికి రెండు సార్లు ప్రతులను పరిశీలించుకునేదాన్ని. ఇలా పాత బడ్జెట్‌ను చదివేవారి చేతిలో రాష్ట్రం ఎంత సురక్షితంగా ఉంటుందో మీరే ఊహించుకోగలరు  అని మాజీ సీఎం వసుంధరా రాజే విమర్శించారు.  ఇది ప్రజాస్వామ్యాన్ని అవమానించడమే అవుతుందని,గెహ్లాట్ క్షమాపణలు చెప్పాలని బీజేపీ నేతలు డిమాండ్‌ చేశారు. 

దీనిపై ఆయన ట్విటర్ వేదికగా స్పందించారు.  నేను చదువుతున్న ప్రతులకు, మీ చేతిలో ఉన్న ప్రతుల్లోని అంశాలకు తేడా ఉంటే మీరు లేవనెత్తాలి. ఆ పాత పత్రాలను చూసుకునేందుకు తెచ్చాను. ఇక్కడ ఎలాంటి లీక్‌ జరగలేదు. అంటూ తనను తాను సమర్ధించుకున్నారు. చివరకు, అంతా సజావుగా సాగిపోయింది ..  2023 -24 వార్షిక బడ్జెట్ ను ముఖ్యమంత్రి సభలో ప్రవేశ పెట్టారు. మొత్తానికి ఆల్ ఈజ్ వెల్ అన్నట్లుగా బడ్జెట్ ప్రసంగం ముగిసింది.

By
en-us Political News

  
 తిరుపతి, ఏలూరు, శ్రీకాకుళం, సాలూరు,  పిఠాపురం ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల సీట్ల సర్దుపాట్లు కూటమి శ్రేణుల మధ్య అగాధాన్ని పెంచుతూ ఐక్యతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత గడ్డ అయిన ఉమ్మడి కడప జిల్లాలో ఆ పార్టీకి తీవ్ర రాజకీయ ప్రతికూలత ఎదురౌతోందని చెప్పడానికి స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియే నిలువెత్తు నిదర్శనంగా చెబుతున్నారు.
కమ్మ నాయకుడు ఏబీవీకి స్వతంత్ర అభ్యర్థిగా మద్దతు ఇస్తూ, కాపు నాయకుడు  వంగవీటి రాధను జనసేనలోకి పంపారన్నది విజయసాయి రెడ్డి ఆరోపణ.  కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంలు ఏబీవీకి మద్దతు ఇవ్వడాన్ని కూడా ఆయన చంద్రబాబు వ్యూహంగానే అభివర్ణిస్తున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఏకగ్రీవాలకు  అవకాశం ఇవ్వకూడదని వైసీపీ అధినేత జగన్ పలు మార్లు విస్పష్టంగా చెప్పినా, ఆయనకు అత్యంత బలమైన పట్టు ఉన్న కడప జిల్లాలోనే కీలకమైన రెండు మునిసిపాలిటీలు ఏకగ్రీవం కావడం పార్టీపై జగన్ పట్టు సడలిందా అన్న అనుమానాలను తావిస్తోంది.
పుంగనూరుతో పాటు రాయచోటి, ధర్మవరం తదితర ప్రాంతాల్లో నామినేషన్ల దాఖలు సమయంలో ఉద్రిక్తతలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలను ప్రస్తావిస్తూ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి సరిగా లేదన్న వాదనతో కేంద్ర బలగాలను రంగంలోకి దించాలని వైసీపీ   ప్రయత్నించింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉండే బెజవాడ రాజకీయం మరోసారి వేడెక్కింది.
గుంపులను చెదరగొట్టేందుకు  టియర్ గ్యాస్   ప్రయోగించారు. అప్పటికీ పరిస్థితి అదుపులోకి రాలేదు. దీంతో  భద్రతా దళాలు ఆరు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపి ఆందోళనకారులను చెదరగొట్టాయి. 
బిల్లులకు అవసరమైన మద్దతు   లభిస్తుందనే ధీమాతో కేంద్రం పార్లమెంటు ప్రత్యేక సమావేశాల నిర్వహణకు నడుంబిగించిందని అంటున్నారు. అయితే రాజ్యాంగ సవరణ అవసరమైన ఈ బిల్లులకు సభలో మూడింట రెండొంతుల మోజారిటీ అవసరం.  కేంద్రం ఆ మద్దతును సమకూర్చుకోగలుగుతుందా అన్న విషయంపై సర్వత్రా ఆసక్తి, ఉత్కంఠ వ్యక్తమౌతోంది. 
ఎడతెగని చర్చలు, మంతనాల అనంతరం, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి మధ్య సీట్ల కేటాయింపు ప్రక్రియ  పూర్తయింది.
ఇలాంటి అణచివేత చర్యలు, అరెస్టులు  పరిస్థితిని మరింత దిగజార్చుతాయని పేర్కొన్నారు. ఇంత కాలం కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని, బీజేపీని జగన్ నేరుగా విమర్శించిన లేదా వ్యతిరేకించిన సందర్భం లేదు. అటువంటి జగన్ ఇప్పుడు బొద్దింకల ఉద్యమానికి మద్దతుగా మాట్లాడటం, ఆ పార్టీ నేతల అరెస్టులను ఖండించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
చంద్రబాబుతో భేటీలో  ప్రధానంగా చెన్నై నగర తాగునీటి అవసరాలు,  తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా అదనపు నీటి కేటాయింపులపై చర్చ జరిగింది.  
జగన్ అక్రమాస్తులకు సంబంధించిన కేసులలో విచారణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్ణయించింది.  సీబీఐ నమోదు చేసిన కేసులతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పరిధిలోని కేసులన్నింటినీ కూడా  రోజు వారీగా విచారణ చేపట్టాలని కోర్టు నిర్ణయించింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.