రాజాసింగ్ రాజీనామా ఆమోదం... బీజేపీకీ మైనస్సే

Publish Date:Jul 12, 2025

Advertisement

గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు ఆ పార్టీతో పదేళ్ళ అనుబంధం ముగిసింది. ఈ పదేళ్ల కాలంలో రాజాసింగ్ తెలంగాణలో బీజేపీకి ఫేస్ గా ఎదిగారు. హిందుత్వకు రాష్ట్రంలో బ్రాండ్ అంబాసిడర్ గా మారారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. తెలంగాణలో రాజాసింగ్ బీజేపీని మించి ఎదిగారు. ఆ పార్టీకి రాష్ట్రంలో తిరుగులేని నాయకులుగా గుర్తింపు పొందిన అందరి కంటే ఎక్కువ జనాదరణ పొందారు. ఇదే ఆయనను బీజేపీకి దూరం చేసింది. ఆ పార్టీ తలుపులు రాజాసింగ్ కు శాశ్వతంగా మూసుకుపోయేలా చేసిందా?  అంటే రాజకీయ పరిశీలకుల నుంచీ, బీజేపీ శ్రేణుల నుంచీ కూడా ఔననే సమాధానమే వస్తోంది.   అయితే రాజాసింగ్ పార్టీలో ఇంతలా ఎదగడానికి కారణం ఆయన నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండటమే. స్వపక్షం, విపక్షం అని లేకుండా ఉన్నది ఉన్నట్లు నిర్మొహమాటంగా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడటమే అంటారు పరిశీలకులు. ఈ క్రమంలో ఆయన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, అలాగే రాష్ట్ర పార్టీలో సీనియర్లుగా చెలామణి అవుతున్న వారిపై ఘాటు విమర్శలే చేశారు. ఇవన్నీ క్రమశిక్షణ గీత దాటడమేనని బీజేపీ అధిష్ఠానం భావించింది. ఈ క్రమంలో రాజాసింగ్ కు, పార్టీకీ మధ్య గ్యాప్ పెరుగుతూ వచ్చింది. అయినా రాజాసింగ్ రాజీనామా అంటే గతంలో కూడా పలుమార్లు ప్రకటించారు. అయితే అప్పడు ప్రతి సందర్భంలోనూ పార్టీ ఆయనను బుజ్జగించింది.
 ఓ సారి సస్పెండ్ చేసి కూడా.. మళ్లీ ఆ సస్పెన్షన్ ను రద్దు చేసి మరీ గత ఎన్నికలలో పార్టీ టికెట్ కూడా ఇచ్చింది. అందుకు కారణంగా రాష్ట్ర బీజేపీలో రాజాసింగ్ కు ఉన్న పాపులారిటీ మరో బీజేపీ నేతకు లేకపోవడమే. అయితే.. రాష్ట్రంలో పార్టీని మించి రాజాసింగ్ పాపులారిటీ పెరగడంతో ఇక ఆయనను భరించలేమన్న నిర్ణయానికి వచ్చేసిన హై కమాండ్ రాజాసింగ్ రాజీనామాను ఆమోదించేసింది.  ఇప్పుడు రాజాసింగ్ రాజకీయ భవిష్యత్ డోలాయమానంలో పడింది. హిందుత్వ ముద్ర పడిన ఆయన మరో పార్టీలో చేరే అవకాశాలు దాదాపు మృగ్యం. మైనారిటీలను దూరం చేసుకోవడానికి బీజేపీ వినా మరో పార్టీ ధైర్యం చేసే పరిస్థితి తెలంగాణలో.. ఒక్క తెలంగాణ అనేమిటి? దేశంలో ఏ పార్టీకి లేదు.  ఇక ఇప్పుడు ఆయన ముందు మిగిలినది ఒకే ఒక్క ఆప్షన్. స్వతంత్రంగా గోషామషల్ లో తన పాపులారిటీ పోకుండా కాపాడుకోవడం. అయితే అదేమంత సులువు కాదని పరిశీలకులు అంటున్నారు.  అసలింతకీ బీజేపీ రాజాసింగ్ ను వదిలించేసుకోవడమే మేలన్న నిర్ణయానికి రావడానికి పలు కారణాలున్నా.. ప్రధానంగా బీజేపీ తెలంగాణ అధ్యక్షుడి ఎంపిక విషయంలో ఆయన అధిష్ఠానన్నే ప్రశ్నించేలా వ్యవహరించిన తీరు, చేసిన వ్యాఖ్యలే అని చెప్పాలి. 

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు ఎంపినను వ్యతిరేకించిన రాజాసింగ్.. అధ్యక్ష పదవికి తాను నామినేషన్ వేస్తానంటూ ముందుకు వచ్చారు. అయితే కారణాలేమైనా ఆయన నామినేషన్ దాఖలు చేయలేకపోయారు. ఇందుకు తన మద్దతుదారులను బీజేపీ స్టేట్ కౌన్సిల్ సభ్యులు బెదరించారని ఆరోపణలు చేశారు. అంతే కాదు.. మీకో దండం.. మీ పార్టీకో దండం అంటూ రాజీనామా చేసేశారు. సరిగ్గా ఇక్కడే బీజేపీ రాష్ట్ర నేతలు ఒక అవకాశం దొరికిందని భావించి రెండో ఆలోచన లేకుండా ఆయన రాజీనామాను హైకమాండ్ కు పంపేశారు. ఆయనను పార్టీ భరించలేదని నివేదిక కూడా ఇచ్చారని చెబుతారు. దీంతో పార్టీ హై కమాండ్ ఆయన రాజీనామాను ఆమోదించేసింది.

 ఈ ఆమోదం రాజాసింగ్ కే కాదు, రాష్ట్రంలో బీజేపీకీ మైనస్సేనని పరిశీలకులు అంటున్నారు. అ గత అసెంబ్లీ ఎన్నికల ముంగిట అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ ను మార్చి పార్టీ పగ్గాలు కిషన్ రెడ్డికి అప్పగించడం వల్ల ఎలా పార్టీ నష్టపోయిందో.. ఇప్పుడు రాజాసింగ్ రాజీనామా ఆమోదం వల్ల కూడా అంతటి నష్టం వాటిల్లే అవకాశం ఉందని అంటున్నారు. 

By
en-us Political News

  
దేశ రాజకీయాలకు తెలుగు తరం, పనితనాన్ని పరిచయం చేస్తున్నారు ఓ యువ ఎంపీ ....ఎంపీ గా మాత్రమే కాదు కేంద్ర సహాయ మంత్రిగా తన పనితనాన్ని , యావత్ భారతదేశానికి పరిచయం చేస్తున్నారు
తనకంటే ఎంతో సీనియర్ అయిన కోనేరు హంపిని ఓడించి ఫిడే మహిళల చెస్‌ ప్రపంచకప్‌ విజేతగా దివ్య దేశ్‌ముఖ్‌ నిలిచింది. తాజాగా (28-7-25) జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో కోనేరు హంపిపై దివ్య దేశ్‌ముఖ్‌ విజయం సాధించింది.
హైదరాబాద్‌ నగరంలో చిరుత సంచారం కలకలం రేపింది. గోల్కొండ ప్రాంతంలో ఇబ్రహీంబాగ్‌ మిలిటరీ ఏరియాలో రోడ్డు దాటుతున్న చిరుత దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.
అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్‌ కింద మూడు విడతల్లో రైతులకు రూ.20వేల ఆర్థికసాయం అందజేస్తామని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో మంత్రి పర్యటించారు.
థాయిలాండ్ - కాంబోడియా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది. ఎలాంటి షరతులు లేకుండా తక్షణమే సీజ్‌ఫైర్ అమలు చేసేందుకు ఇరుదేశాలు అంగీకరించాయి. ఈ విషయాన్ని మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆగస్టు 15 నుంచి ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం పథకం అమలు కానుంది. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలలో మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం ఒకటి.దీనిపై సుదీర్ఘంగా కసరత్తు చేసిన తరువాత ఈ పథకం అమలుకు ఆగస్టు 15 ముహూర్తంగా నిర్ణయించారు.
ఫిడే మహిళల ప్రపంచకప్‌ విజేత‌గా భారత ప్లేయర్ దివ్య దేశ్‌ముఖ్ సరికొత్త రికార్డు సృష్టించారు. ఫైనల్‌ టై బ్రేక్‌ గేమ్‌లో తెలుగు క్రీడాకారిణి కోనేరు హంపిపై విజయం సాధించి టైటిల్‌ గెలుచుకుంది.
కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డికి భారత రత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నేతలు కోరారు. జైపాల్‌రెడ్డి వర్ధంతి సందర్బంగా హైదరాబాద్ నెక్లస్ రోడ్డులోని స్మారక ఘాట్‌లో నివాళులు అర్పించారు
తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే ప్రముఖులు ఏడాదికి ఒకసారి మాత్రమే తిరుమల పర్యటన చేయాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. ఇవాళ శ్రీవారిని కుటుంబసభ్యులతో కలిసి ఆయన దర్శించుకున్నారు.
మద్రాసు హైకోర్టు నుండి బదిలీపై రాష్ట్ర హైకోర్టుకు వచ్చిన ఆయనచేత రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌ ప్రమాణం చేయించారు.
జమ్మూ కాశ్మీర్‌ పహల్గామ్ దాడిలో పాల్గొన్నా ముగ్గురు ఉగ్రవాదులను భారత బలగాలు మట్టుబెట్టాయి. ఉగ్రవాదుల లక్ష్యంగా భారత సైన్యం ఆపరేషన్ మహదేవ్ చేపట్టింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సింగపూర్ పర్యటన ఆయన విజన్ కు అద్దం పడుతోంది. తన సింగపూర్ పర్యటనలో భాగంగా రెండో రోజ సోమవారం (జులై 28) ఆయన తన టీమ్ తో సింగపూర్ లో పది వేల కుటుంబాలు నివశించే బిడదారి ఎస్టేట్ ను సందర్శించారు.
మొన్నీ మ‌ధ్యే ట్రంప్ కు నోబుల్ శాంతి పురస్కారం కోసం అధికారిక నామినేష‌న్ దాఖ‌లు చేసింది అమెరికా. ఈ మ‌ధ్య కాలంలో ఆయ‌న‌కు నోబుల్ పురస్కారం రావడానికి ఎక్కువ అవ‌కాశాలు ఏర్ప‌డుతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.