సీజన్ మారుతోంది.. ఈ జాగ్రత్తలు పాటించండి..

Publish Date:May 31, 2025

Advertisement

 

సీజన్ మారుతున్నప్పుడు శరీర ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతిసారి వాతావరణం మారినప్పుడు రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడం, సరైన జీవనశైలి పాటించడం ముఖ్యం. ఇందుకోసం కొన్ని ఆరోగ్య చిట్కాలు పాటించాలి.  ప్రస్తుతం వేసవి కాలం సాగుతున్నా.. వర్షాలు పడుతూ వాతావరణం చాలా డిస్టర్బ్ గా ఉంటోంది.  వర్షాలు వేసవిలో ఊరట అనిపిస్తాయి కానీ వీటి వల్ల కలిగే సమస్యలు కూడా ఉంటాయి.  ఈ వాతావరణ మార్పులలో పాటించాల్సిన జాగ్రత్తలు ఏంటంటే..

పరిమిత ఆహారం తీసుకోవాలి.

హైడ్రేట్‌డ్‌గా ఉండాలి.  వాతావరణం చల్లగా ఉంది కదా అని నీరు తగ్గించకూడదు.ఎక్కువ నీరు త్రాగాలి. తాజా పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. విటమిన్ C ఎక్కువగా ఉన్న ఆహారం (లేత నిమ్మకాయ, ఉసిరికాయ, కివి, నారింజ) శరీర రక్షణ శక్తిని పెంచుతుంది. వేడి లేదా బరువుగా ఉన్న ఆహారం తక్కువగా తీసుకోవాలి (ముఖ్యంగా ఈ వేసవిలో). చల్లటి పదార్థాలు (ఐస్ క్రీమ్, చల్లని పానీయాలు) ఎక్కువగా తీసుకోవడం వలన శరీరం పై ప్రభావం చూపొచ్చు, జాగ్రత్తగా ఉండాలి.  ముఖ్యంగా వాతావరణం చల్లగా ఉన్న సమయంలో

వాతావరణ మార్పులకు అలవాటు పడటం మంచిది.
ఉదయం సూర్యోదయ సమయానికి బయట తిరగడం మంచిది. ఇది శరీరానికి డే-నైట్ సైకిల్‌ను స్థిరపరుస్తుంది. బయట ఉష్ణోగ్రత ప్రకారంగా దుస్తులు ధరించండం వల్ల చాలా మంచి ఉపశమనం ఉంటుంది.

వ్యాయామం & యోగా చేయడం మరచిపోకూడదు. రోజూ కనీసం 30 నిమిషాల పాటు వాకింగ్ లేదా యోగా చేయాలి.  “ప్రాణాయామం” లాంటి శ్వాస వ్యాయామాలు శ్వాస సంబంధిత సమస్యలను తగ్గిస్తాయి. అలాగే ప్రకృతిలో కొంత సమయం గడపడం కూడా మంచిది.

నిద్ర – విశ్రాంతి విషయంలో చాలా కేర్ గా ఉండాలి. ప్రతి రోజు కనీసం 7-8 గంటల నిద్ర తప్పనిసరిగా తీసుకోవాలి.  రాత్రిళ్లు ఆలస్యంగా మేలుకుని ఉండకూడదు. ఇది శరీర రక్షణ శక్తిని తగ్గిస్తుంది.

హైజెనిక్ గా ఉండాలి.  శుభ్రత,  స్వచ్చత   పాటించడం చాలా ముఖ్యం.  తరచూ చేతులు కడుక్కోవడం అలవాటు చేసుకోవాలి.  బయట తినే ఆహారం తగ్గించాలి. ఇంటి ఆహారమే చాలా ఆరోగ్యం.

ఆయుర్వేద చిట్కాలు పాటిస్తే మంచిది.  రోజూ ఉదయం ఉసిరికాయ పౌడర్ లేదా   "చ్యవనప్రాశ్" తీసుకోవచ్చు. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది.  తులసి, అల్లం, మిరియాలు,  తేనెతో చేసిన కషాయం చలికాలంలో ఉపయోగపడుతుంది. సీజనల్ సమస్యలను సమర్థవంతగా ఎదుర్కుంటుంది.


                                    *రూపశ్రీ

గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

By
en-us Political News

  
నేటి కాలంలో నిమ్మరసం ఎంతో ప్రజాదరణ పొందిన పానీయాలలో ఒకటి . శరీరాన్ని చల్లబరచడం నుండి డీహైడ్రేషన్‌ను నివారించడం వరకు నిమ్మరసం ప్రయోజనాలు..
కొన్నిసార్లు శరీరంపై నీలం లేదా ఊదా రంగు మచ్చలు  కనిపిస్తాయి. చాలా వరకు ఇలాంటి మచ్చలు ఏవైనా గాయాలు లేదా దెబ్బలు తగిలినప్పుడు బయటకు రక్తం కారడం..
ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో, మారుతున్న ఆహారపు అలవాట్ల వల్ల చాలామంది శరీరానికి కావలసిన పోషకాలను సరిగ్గా అందజేయలేకపోతున్నారు. ఈ క్రమంలో శరీరంలో విటమిన్లు, ఖనిజాల లోపాన్ని భర్తీ చేయడానికి..
గుండె మానవ శరీరంలో అత్యంత కీలకమైన అవయవం, ఇది శరీరమంతటికీ ఆక్సిజన్ , పోషకాలను అందించడానికి నిరంతరం రక్తాన్ని పంపింగ్ చేస్తుంది. అయితే, మారుతున్న జీవనశైలి, ఒత్తిడి,  ఆహారపు అలవాట్లు సరిగా లేకపోవడం..
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యం అనేది ఒక సవాలుగా మారింది. ముఖ్యంగా 30-32 ఏళ్ల చిన్న వయసులోనే జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూనో, ఫంక్షన్లలో డ్యాన్స్ చేస్తూనో అకస్మాత్తుగా గుండెపోటుతో కుప్పకూలిపోతున్న వార్తలు మనల్ని..
చాలామంది రాత్రి వేళల్లో హాయిగా నిద్రిస్తున్న సమయంలో అకస్మాత్తుగా కాళ్ల పిక్కలు పట్టేయడం (Leg Cramps at Night) వల్ల తీవ్రమైన నొప్పితో మేల్కొంటూ ఉంటారు. కండరాలు గట్టిగా బిగుసుకుపోయి, కాళ్లు కదల్చలేనంతగా వచ్చే ఈ నొప్పిని ఆయుర్వేదంలో..
వేడి, విరేచనాలు లేదా వాంతులు వంటివి శరీరంలోని నీరు , ఎలక్ట్రోలైట్ల సమతుల్యతను త్వరగా దెబ్బతీస్తాయి. ఇలాంటి పరిస్థితులలో ఓఆర్ఎస్ తాగడం చాలా ముఖ్యం. చాలా నీరసంగా ఉన్నప్పుడు, ఆహారం సరిగా తీసుకోలేనప్పుడు...
ప్రతి మనిషి ఇతర మనిషికి చాలా  విభిన్నంగా, ప్రత్యేకంగా ఉంటారు. కొందరు చాలా శాంతంగా ఉంటారు, మరికొందరు ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూ చాలా చలాకీగా ఉంటారు. ఇంకొందరు చాలా చిన్న విషయాలకే తొందరగా కోపం
భారతీయులకు టీ, కాఫీ ఒక పెద్ద ఎమోషన్. గతంలో కంటే ప్రస్తుతకాలంలో  టీ తాగేవారి సంఖ్య చాలా పెరిగింది.  ఏదైనా పని చురుగ్గా చేయాలంటే చాలామంది మొదటగా టీ తాగుతారు.  ఇక పని మధ్యలో కూడా టీ తాగుతూ ఉత్సాహం తెచ్చుకుంటారు...
బలమైన రోగనిరోధక వ్యవస్థ అనేక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ముఖ్యంగా వైరస్‌లు, బ్యాక్టీరియా , ఇతర ఇన్ఫెక్షన్ల వల్ల కలిగే సమస్యలను చాలా వరకు నివారించవచ్చు. అయితే రోజురోజుకూ జీవనశైలి పేలవంగా మారడం..
ఉదయాన్నే నిద్రలేచి మంచం దిగగానే కాలి మడమలో సూదితో గుచ్చినట్లుగా తీవ్రమైన నొప్పి వస్తుంది కొందరికి.  ఇలా లేవగానే ఆ నొప్పితో కొన్ని అడుగులు వేయడమే చాలా కష్టంగా అనిపిస్తుంది. చాలామంది ఈ నొప్పిని సీరియస్ గా తీసుకోరు.  కొద్దిసేపు అలా నడవగానే అదే తగ్గిపోతుందిలే అని కాంప్రమైజ్ అయిపోతారు....
మన శరీరంలో కిడ్నీలు అత్యంత కీలకమైన అవయవాలు. అవి రక్తాన్ని శుద్ధి చేస్తూ, విషతుల్యాలను బయటకు పంపుతాయి. కానీ, దురదృష్టవశాత్తూ కిడ్నీ సమస్యలు వస్తే అది ఒక పీడకలలా మారుతుంది. డయాలసిస్ బెడ్ మీద గంటల తరబడి గడపడం..
నోటి ఆరోగ్యం అనేది మన సంపూర్ణ ఆరోగ్యానికి ముఖద్వారం లాంటిది. చాలా మంది పళ్ళను తెల్లగా, శుభ్రంగా ఉంచుకుంటే సరిపోతుందని అనుకుంటారు, కానీ పళ్ళ కంటే వాటిని పట్టి ఉంచే చిగుళ్ల ఆరోగ్యం చాలా ముఖ్యం. చిగుళ్ల వ్యాధులు..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.