ఎల్ నినో ఎఫెక్ట్.. 90 శాతం కంటే తక్కువ వర్షపాతం!

Publish Date:Jun 6, 2026

Advertisement

భారతదేశ ఆర్థిక వ్యవస్థకు, రైతుల జీవనాధారమైన వ్యవసాయ రంగానికి వెన్నుముక లాంటి నైరుతి రుతుపవనాలు ఈ సారి దెబ్బకొట్టనున్నాయి. ఎల్ నినో ప్రభావంతో దేశంలో ఈ ఏడాది 90 శాతం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఐఎమ్డి పేర్కొంది.  పసిఫిక్ మహాసముద్రంలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న  ఎల్ నినో తీవ్ర ప్రభావం చూపనుందన్న ఐఎండీ  చేసింది. 2026 సంవత్సరానికి సంబంధించిన రుతుపవనాల అంచనాలను సవరించింది.  ఈ ఏడాది దేశంలో దీర్ఘకాలిక సగటు వర్షపాతంలో   90 శాతం కంటే తక్కువ   నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. అంటే సాధారణం కంటే చాలా తక్కువగా వర్షాలు కురుస్తాయి.  దశాబ్ద కాలంలోనే దేశంలోనే అత్యంత బలహీనమైన వర్ష సూచన ఇదే అవుతుందన్న మాట. 

సాధారణంగా జూన్ మొదటి తేదీకే దేశాన్ని పలకరించాల్సిన నైరుతి రుతుపవనాలు ఈ సారి , ఈసారి జూన్ 4న అంటే నాలుగు రోజులు ఆలస్యంగా   కేరళ తీరాన్ని తాకాయి. దేశవ్యాప్తంగా దాదాపు 70 శాతానికి పైగా వర్షపాతాన్ని అందిస్తూ..  దేశ ఆహార భద్రతను శాసించే రైరుతి  రుతుపవన వ్యవస్థ  ప్రారంభంలోనే ఇలా బలహీనపడింది.  

పసిఫిక్ మహాసముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరగడాన్నే ఎల్ నినో అంటాము.  ఎల్ నినో   వాతావరణ వ్యవస్థను దెబ్బతీస్తుంది. రుతుపవనాల విస్తరణకు అత్యంత కీలకం సముద్రంలో తుపానులు ఏర్పడడానికి అనువైన వాతావరణం ఏర్పడటం. అయితే ఎల్ నినో ప్రభావంతో తుపానులు ఏర్పడడానికి అనుకూలంగా వాతావరణం ఉండటం అటుంచి యాంటీ తుపాన్ పరిస్థితి ఏర్పడే అవకాశాలు ఉన్నాయి.  ఈ కారణంగా భారత ఉపఖండం వైపు వచ్చే రుతుపవన గాలుల వేగం, తీవ్రత పూర్తిగా తగ్గిపోతాయి. ఈ జూన్ నుండి ఆగస్టు 2026 మధ్య కాలంలో ఎల్ నినో ఏర్పడే అవకాశం 80 శాతం వరకు ఉందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా..  నవంబర్ నాటికి ఈ ముప్పు ఏకంగా 90 శాతానికి పెరుగుతుందని ప్రపంచ వాతావరణ సంస్థ  పేర్కొంది. 

ఐఎండీ  అంచనాల ప్రకారం..  తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు దక్షిణ భారత్‌లో వర్షాలు బాగా తగ్గిపోయే ప్రమాదం ఉంది. కేవలం వాయవ్య ప్రాంతాల్లో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశంఉంది. ముఖ్యంగా జూన్ నెలలో దేశంలోని చాలా ప్రాంతాల్లో ఆశించిన స్థాయిలో  వర్షాలు కురిసే అవకాశం అత్యల్పం అని ఐఎండీ పేర్కొంది.  

By
en-us Political News

  
ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ వరుస క్షిపణి దాడులకు పాల్పడింది. దీంతో ఒక్కసారియా వెస్ట్ ఆసియా అంతటా యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఈ ఆకస్మిక క్షిపణి దాడులతో జనం తీవ్ర భయాందోళనల మధ్య ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సురక్షిత షెల్టర్లలోకి పరుగులు తీశారు.
నైరుతి తెలంగాణ ప్రవేశం మరో రెండు మూడు రోజుల తరువాతేనని వాతావరణ శాఖ పేర్కొంది. జూన్ 10 నుంచి 12 మధ్య రైరుతి రుతుపవనాలు తెలంగాణను తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ అప్ డేట్ ఇచ్చింది.
కెప్టెన్‌గా గిల్ బ్యాటింగ్ సగటు సుమారు 82.8కి చేరింది. ఇప్పటివరకు టెస్ట్ చరిత్రలో కెప్టెన్‌గా వెయ్యికి పైగా పరుగులు చేసిన 101 మంది ఆటగాళ్లలో ఒక్క డాన్ బ్రాడ్‌మన్ మాత్రమే గిల్ కంటే ఎక్కువ సగటు 99.94 కలిగి ఉన్నారు.
భాగ్యనగర ప్రజలకు అలర్ట్. నగరంలోని నాంపల్లి పరిసర ప్రాంతాల్లో ప్రయాణించే వాహనదారులకు హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీస్ విభాగం కీలక సూచనలు చేసింది.
తెలంగాణ క్రికెట్‌లో సరికొత్త అధ్యాయానికి తెరలేచింది
హైదరాబాద్ నగర గుండెకాయ లాంటి నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సరికొత్త ప్రస్థానానికి సిద్ధమైంది.
న్యూ చండీగఢ్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా పరుగుల పండగ చేసుకుంది.
తనను చూడాలని ఉందటూ.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వృద్ధుడి వీడియోపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు.
కూకట్‌పల్లిలోని కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్లో అర్ధరాత్రి నిర్వహించిన ఓ సీక్రెట్ ఆపరేషన్ ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణవ్యాప్తంగా వేసవి సెలవులను ఎంజాయ్ చేస్తున్న విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు రాష్ట్ర విద్యాశాఖ ఒక అతి ముఖ్యమైన శుభవార్తను అందించింది.
ఏపీలో కూటమి పాలనలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడుతున్నట్టే 108 అంబులెన్స్ సర్వీసులూ లక్షలాదిమందికి ప్రాణదాతగా నిలుస్తూ సమర్థతను చాటుకుంటున్నాయి.
సినీ రంగంలో నటుడిగా, అద్భుతమైన కొరియోగ్రాఫర్‌గా, విలక్షణ దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాఘవ లారెన్స్ చుట్టూ ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.
భాష్యం విద్యాసంస్థల చైర్మన్‌గా సుపరిచితులైన భాష్యం రామకృష్ణ.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.