ప్రయాగ్‌రాజ్‌లో రాహుల్ గాంధీ సభకు లైన్ క్లియర్.!

Publish Date:Aug 7, 2026

Advertisement

లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రయాగ్‌రాజ్‌లో నిర్వహించ తలపెట్టిన ఛాత్రోన్ కీ గూంజ్  (విద్యార్థుల గళం) సదస్సుకు లైన్ క్లియర్ అయ్యింది.  సభా వేదికకు సంబంధించి ఇచ్చిన అనుమతిని ఆ తరువాత అకస్మాత్తుగా ఉప సంహరించుకున్న  కాయస్థ పాఠశాల  ట్రస్ట్, దీనిపై సర్వత్రా నిరసనలు, విమర్శలు వెల్లువెత్తడంతో  అనివార్యంగా వెనక్కు తగ్గి అనుమతిని పునరుద్ధరిస్తూ గురువారం (ఆగస్టు 6) రాత్రి పొద్దుపోయిన తరువాత ప్రకటన విడుదల చేసింది. అయితే  కొన్ని షరతులు విధించింది.  

దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థను వేధిస్తున్న  ప్రశ్నాపత్రాల లీకేజీలు,  నిరుద్యోగం, యువత భవిష్యత్తుపై రాహుల్ గాంధీ ప్రత్యక్షంగా విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించేందుకు ఉద్దేశించిన ఈ సదస్సు ఈనెల 8న. ప్రయాగ్‌రాజ్‌లోని ప్రసిద్ధ కేపీ కాలేజీ మైదానంలో నిర్వహించేందుకు కాంగ్రెస్ భారీ ఏర్పాట్లు చేసింది. ఇందుకు కేపీ ట్రస్ట్ అనుమతి కూడా ఇచ్చింది. అయితే.. అనూహ్యంగా.. కేపీ ట్రస్ట్ బుధవారం ( ఆగస్టు 5)     సభకు ఇచ్చిన అనుమతిని ఉపసంహరించరుకుంటున్నట్లు తెలిపింది. 

రాహుల్ గాంధీ నేరుగా విద్యార్థుల సమస్యలపై గళమెత్తితే  ప్రభుత్వ  వైఫల్యాలు బయటపడతాయన్న భయంతోనే కేంద్రంలోని మోడీ సర్కార్, యూపీలోని బీజేపీ ప్రభుత్వం..   ట్రస్ట్ యాజమాన్యంపై   ఒత్తిడి తెచ్చి సభకు అనుమతి రద్దు చేయించాయన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. వేదిక అనుమతి రద్దయినా..  మైదానాలు మారినా రాహుల్ గాంధీ ప్రయాగ్‌రాజ్ పర్యటన  రద్దు కాదనీ, నిర్ణీత షెడ్యూల్ ప్రకారమే  జరుగుతుందనీ కాంగ్రెస్ ప్రకటించింది.  

రాహుల్ సభకు అనుమతి రద్దు చేస్తూ కేపీ ట్రస్ నిర్ణయం పట్ల సర్వత్రా ఆగ్రహం, విమర్శలు రావడంతో..  ఆ ట్రస్ట్ తాత్కాలిక అధ్యక్షుడు జితేంద్ర నాథ్ చౌదరి హైకోర్టు సీనియర్ న్యాయవాదులతో   సంప్రదింపులు జరిపి.. సభకు అనుమతిని పునరుద్ధరించారు. అయితే..   ఈ సభ వల్ల కాలేజీలో జరిగే  తరగతులకు ఎలాంటి ఆటంకం, భంగం కలగకూడదనీ,   ప్రయాగ్‌రాజ్ జిల్లా మేజిస్ట్రేట్  నుంచి కాంగ్రెస్ నాయకత్వం తప్పనిసరిగా చట్టబద్ధమైన   అనుమతి తీసుకోవాలని షరతులు విధించారు.  

Rahul Gandhi Prayagraj Meeting, Chatron Ki Goonj, KP Ground Permission, Congress Student Rally, UP Politics News, Rahul Gandhi Student Interaction

By
en-us Political News

  
వైసీపీలోని కాపు సామాజికవర్గానికి చెందిన నేతలు అంబటి రాంబాబు, పేర్ని నాని మీడియా ముందుకొచ్చి బోండా ఉమా మద్దతుగా గళమెత్తారు. అయితే.. తాజాగా వైసీపీ నిరసనలను ప్రశ్నిస్తూ ఆ పార్టీ నేతలను బోండా ఉమా గట్టిగా నిలదీయడంతో వైసీపీ ఆశలు నీరుగారిపోయాయి.
న్నికల ఖర్చుల విషయానికి వస్తే వైసీపీ దేశంలోనే అత్యధికంగా వ్యయం చేసిన ప్రాంతీయ పార్టీగా నిలిచింది. ఆ ఆర్థిక సంవత్సరంలో వైసీపీ ఆదాయం 140.4 కోట్ల రూపాయలు కాగా, చేసిన వ్యయం 340.2 కోట్ల రూపాయలు. తమ వార్షిక రాబడి కంటే 142 శాతం అదనంగా, అంటే దాదాపు 199.8 కోట్ల మేర ఎక్కువ వ్యయం చేసింది.
పరామర్శల పేరిట పోలీసుల ఆంక్షలను ఉల్లంఘిస్తూ, శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమయ్యేలా సాగుతున్న ఆయన పర్యటనల తీరు నేపథ్యంలో జగన్ భద్రత అంశం మరోసారి చర్చకు వచ్చింది. అంతటితో ఆగకుండా, జగన్‌కు రక్షణ తగ్గించారంటూ వైసీపీ ఎంపీల బృందం కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవడం, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వివరణ ఇవ్వడంతో జగన్ భద్రత అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
అయోధ్య రామమందిరం పేరిట సేకరించిన విరాళాల విషయంలో అక్రమాలు జరిగాయనే అంశాన్ని వ్యంగ్యంగా, నాటకీయంగా చూపించేందుకు వారు చేపట్టిన ఈ వినూత్న నిరసన రాజకీయ వివాదానికి దారి తీసింది. రామాలయాన్ని, పూజారి వ్యవస్థను, భక్తుల నమ్మకాలను హేళన చేసేలా ఈ నిరసన ఉందంటూ.. బీహార్‌లోని జమూయి సివిల్ కోర్టులో ఓ సీనియర్ న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు.
రిజర్వేషన్ల విధానాన్ని అంబేడ్కర్ ఆశయాలు, దృక్పథానికి అనుగుణంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్న మోహన్ భగవత్.. విద్యా, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ల విధానం ఎంతకాలం కొనసాగాలనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. రిజర్వేషన్లు కేవలం రాజకీయ ప్రాతిపదిక కాదనీ సామాజిక అనివార్యత అన్నారు.
గడిచిన దశాబ్ద కాలంలో కేంద్రంలో తిరుగులేని శక్తిగా ఎదిగిన బీజేపీ, ప్రస్తుతం కొన్ని సవాళ్లను ఎదుర్కొంటోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
జగన్ పర్యటనలలో జరిగిన పలు సంఘటనలకు సంబంధించిన వీడియో ఆధారాలను వంగలపూడి అనిత ఈ సందర్భంగా ప్రదర్శించారు. సాధారణంగా ఎవరైనా పరామర్శకు వెళ్తే బాధితులను ఓదార్చడం, వారికి అండగా నిలవడం ఆనవాయితీ అనీ, కానీ జగన్ మాత్రం నిజమైన బాధితులను వదిలేసి నిందితులను పరామర్శించడానికి వెడుతున్నారనీ మండిపడ్డారు.
యూపీలో భారీ వర్షాలు, శాంతిభద్రతల పరిస్థితి, కోర్టు ఆదేశాలు కారణంగా చూపుతూ కాయస్థ పాఠశాల ట్రస్ట్ అనుమతిని ఉపసంహరించుకుంది. అయితే ఈ వివరణ సంతృప్తికరంగా లేదని కాంగ్రెస్ చెబుతోంది. అధికార యంత్రాంగం, బీజేపీ ప్రభుత్వ ఒత్తిడి కారణంగానే రాహుల్ సభకు అనుమతి ఇవ్వడం లేదని ఆరోపిస్తోంది.
కనీసం తనతో సంప్రదించకుండా ఏకపక్షంగా అంబటి రాంబాబు పాదయాత్ర ప్రకటన చేయడంపై జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో గత్యంతరం లేక అంబటి పాదయాత్ర విరమించుకున్నారని పార్టీ వర్గాల సమాచారం.
వైసీపీకి కోర్టులు, న్యాయమూర్తులు, చట్టం, న్యాయం వంటి విషయాలలో పెద్దగా పట్టింపు లేదని గతంలో పలుమార్లు రుజువైంది. అలాగే ఇప్పుడు కూడా కోర్టు తీర్పులు కోర్టువే, మా దారి మాదే అన్న చందంగా విజయవాడ వేదికగా వైసీపీ విద్యార్థి, యువజన విభాగాలు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు దిగాయి. 
ఇప్పటి వరకూ  గ్రామ పంచాయతీ స్థాయిలో సర్పంచులను మాత్రమే ప్రజలు నేరుగా ప్రత్యక్ష ఓటింగ్ ద్వారా ఎన్నుకుంటున్నారు. అయితే, మండల స్థాయిలో ఎంపీపీలు, జిల్లా స్థాయిలో జడ్పీ ఛైర్మన్లతో పాటు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఛైర్మన్లు, మేయర్ల ఎంపిక పరోక్ష పద్ధతిలోనే జరుగుతోంది.
నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం త్వరలోనే విమానాల్లో ఉపయోగించే ఏవియేషన్ టర్బైన్ ఇంధనం (ఏటీఎఫ్)లో కూడా ఇథనాల్‌ను మిశ్రమం చేయడానికి సన్నాహాలు చేస్తోందంటూ ఆయన బాంబు పేల్చారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.