Publish Date:Aug 14, 2023
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఒక ఉగ్రవాది సోదరుడు జాతీయ జెండా ఎగుర వేశారు. హిజ్బుల్ ముజాహిదీన్ టెర్రరిస్టు జావేద్ మట్టూ సోదరుడు రయీస్ మట్టు జమ్మూ కాశ్మీర్ లోని సోసోర్ లో తన నివాసం వద్ద మువ్వన్నెల జెండా ఎదురవేసి తన దేశ భక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతున్నాయి. రయీస్ మట్టూ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరిస్తున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు.
వెంటనే అవి వైరల్ అవ్వడమే కాకుండా రయీస్ మట్టుపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సోసోర్ లోని తన నివాసంలో జాతీయ జెండాను ఎగురవేసిన మట్టూ.. భారత పౌరులుగా తాము ఎంతో గర్వపడతామని, ఎప్పటికీ భారతీయులుగా ఉంటామన్నారు. ఆయన ప్రసంగానికి నెటిజన్లు ఫిదా అయిపోయారు. మట్లుపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ లో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులలో ఒకడైన జావెద్ మట్టూ సోదరుడు రయీస్ మట్టూ జమ్మూ కాశ్మీర్ లో అభివృద్ధి శకం మొదలైందనీ, దేశంలోని ఇతర ప్రాంతాలకు దీటుగా పురోగమిస్తోందనీ చెప్పారు.
కశ్మీర్ లో జరుగుతున్న అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని తన సోదరుడు కూడా ఉగ్రమార్గాన్ని వదిలి వెనక్కు రావాలని కోరారు. దేశ ప్రగతిలో కాశ్మీర్ భాగస్వామ్యం కొనసాగుతుందనీ, రాష్ట్రంలో ఉగ్రవాదం సమసిపోయి సౌభ్రాతృత్వం పరిఢవిల్లుతుందని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. 2009లో తన సోదరుడు ఉగ్రవాదిగా దారి తప్పాడనీ, అప్పటి నుంచీ అతడిని చూసింది లేదనీ చెప్పిన రయీస్ మట్టు, ఒక వేళ తన సోదరుడు బతికుంటే తిరిగి ఉగ్రమార్గాన్ని విడిచి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు. తాము నిజమైన భారతీయులుగా తమ మాతృభూమిలోనే నివసిస్తామని విస్పష్టంగా చెప్పారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/quit-terrorism-prefer-democracy-39-160009.html
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు.
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.
ధనుష్ తన కొత్త రాజకీయ పార్టీ కోసం తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి.