కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ గా.. పుష్ప2 చిచ్చు!

Publish Date:Dec 24, 2024

Advertisement

పుష్ప2 సినిమా విడుదలై నప్పటినుంచి సక్సస్ ,వసూళ్లూ సంచలనాలు రేపడం ఒక పార్శ్వమైతే.. ఆ సినిమా ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్యా థియోటర్ వద్ద తొక్కిసలాటలో  మహిళ మృతి ఘటన తీవ్ర వివాదానికి దారి తీయడం మరో పార్శ్వం.  ఈ వివాదం చినికిచినికి గాలివానగా మారి చివరికి రాజకీయ రంగు పులుముకుంది. సంధ్యా ధియోటర్ వద్ద తొక్కిసలాటలో మహిళ మరణించడం, ఆమె కుమారుడు ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య చికిత్స పొందుతుండటం తెలిసిందే.

ఈ ఘటనలో అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్టు చేయడం, కోర్టు ద్వారా మధ్యంతర బెయిలు పొంది అల్లు అర్జున్ బయటకు రావడం, అసెంబ్లీ వేదికగా ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ, సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో పుష్ప2 రచ్చ రంబోలాగా మారింది. చివరకు ఈ వివాదం బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గా రూపుదిద్దుకుంది. దీనిపై ప్రతిపక్షాలన్నీ ప్రభుత్వ స్పందన అతిగా ఉందంటూ విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే బీజేపీ మాత్రం ఒక అడుగు ముందుకు వేసి అల్లు అర్జున్ తరఫున వకాల్తా పుచ్చుకున్నట్లుగా వ్యవహరిస్తోంది. ఈ వివాదాన్ని అడ్డుపెట్టుకుని తెలంగాణలో  ఇంత కాలం దొరకని అవకాశాలను అందిపుచ్చుకోవాలని అరాటపడుతోంది. ఏపీలో పవన్ కళ్యాణ్ మద్దతు లభించినట్లు, తెలంగాణలో  అభిమానులు,క్రేజ్  ఉన్న అర్జున్ ను  తురఫ్ కార్డు గా ఉపయోగించుకోవాలని బీజేపీ తాపత్రేయపడుతున్నట్లుగా కనిపిస్తోందంటూ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఏపీలో బీజేపీనాయకులు , తెలంగాణ బీజేపీ నాయకుల ప్రకటనల వెనుక బీజేపీ ఉద్దేశం ఇదేనని అంటున్నారు. కేవలం కాంగ్రెస్ ను వ్యతిరేకించడమే కాకుండా, సినీ జనాల మద్దతును గంపగుత్తగా పొందేయాలన్న ఆరాటమే బీజేపీలో ఎక్కువగా కనిపిస్తోందని చెబుతున్నారు.  సంధ్యా ధియోటర్ తొక్కిసలాట విషయంలో అల్లు అర్జున్ తప్పు లేదని, సినిమా రీలీజ్ సందర్భంగా ఇలాంటి దురదృష్టకర సంఘటనలు జరగడం పరిపాటే నని సమర్ధించడానికి కూడా బీజేపీ నేతలు వెనుకాడటం లేదు.

ఈ సంఘటనలో తప్పు అల్లు అర్జున్ దేనిని పోలీసుల వీడియో నిర్ద్వంద్వంగా చాటుతోంది. ప్రభుత్వం కూడా అదే భావిస్తోంది. అదే విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా చెప్పారు. అయితే ఆ వెంటనే అల్లు అర్జున్ మీడియా సమావేశం పెట్టి మరీ తాను నిర్దోషినని చాటుకోవడానికి చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. అప్పటి వరకూ అల్లు అర్జున్ పట్ల జన బాహుల్యంలో కొద్దో గొప్పో వ్యక్తమైన సానుభూతి ఆవిరైపోయింది. సినీ నటుడు రాహుల్  రామకృష్ణ కూడా పోలీసులు రిలీజ్ చేసిన వీడియో చూసిన తరువాత అల్లు అర్జున్ కు మద్దతుగా తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహ రించుకుంటున్నట్లు ప్రకటించారంటేనే పరిస్థితి ఏమిటన్నది అర్ధమౌతోంది. ఇక అల్లు అర్జున్ నష్ట నివారణ చర్యలకు దిగుతారని అంతా భావిస్తున్న సమయంలో ఆయనకు మద్దతుగా బీజేపీ రంగంలోకి దిగి.. ఇది కేవలం కక్ష సాధింపు,తొందర పాటు చర్యగా అభివర్ణిస్తూ కాంగ్రెస్ సర్కార్ పై విమర్శలు గుప్పించింది. మరో వైపు బీఆర్ఎస్ కూడా రాజకీయంగా అల్లు అర్జున్ ఎపిసోడ్ తనకు అందివచ్చిన అవకాశంగా భావించి ఆయనకు మద్దతుగా ప్రకటనలు గుప్పిస్తోంది. ఈ వ్యవహారంలో కాంగ్రెసు కు మజ్లీస్   మద్దతు ఇస్తున్నది.

ఇకపై తెలంగాణలో బెనిఫిట్ షోలు, టిక్కెట్ రేట్లు పెంచడానికి అనుమతి ఇవ్వమని రేవంత్ స్పష్టం చేసారు.  అన్నిటికీ మించి అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ ప్రకటన చేసిన గంటల వ్యవధిలో అర్జున్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మరీ.. ఇది అనుకోకుండా జరిగిన సంఘటన అని, తన క్యారెక్టర్ ను తగ్గించాలని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ చేసిన వ్యాఖ్యలు, తెలుగువాడి సత్తా ప్రపంచానికి చాటాలన్న ప్రయత్నంతోనే తాను సినిమాలు చేస్తున్నానంటూ చెప్పుకొన్న గొప్పలతో వివాదం మరింత ముదిరింది.  తప్పు అర్జున్ దని,కాదని అర్జున్ అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖరరెడ్డి వివాదాన్ని తగ్గించాలని గాంధీ భవన్ కు వచ్చి రాష్ట్ర ఇన్చార్జి దాస్ మున్షీ కలిసేందుకు చేసిన ప్రయత్నం ఫలించలేదు. రేవంత్ వ్యాఖ్యలపై అర్జున్ కామెంట్స్ కూడా మంత్రుల ఆగ్రహానికి కారణమైంది. మొత్తానికి ఈ వివాదం ఎంత వరకూ వెడుతుందన్న దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. చివరకు హైదరాబాద్ నుంచి చిత్రపరిశ్రమ తరలిపోయేంత వరకూ ఈ వివాదం సాగుతుందా అన్న అనుమానాలూ వ్యక్తం అవుతున్నాయి. ఏది ఏమైనా సంక్రాంతి సీజన్ నాటికి ఈ వివాదం సర్దుమణిగే అవకాశాలున్నాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. 

By
en-us Political News

  
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం ప్రసంగించిన కేటీఆర్.. 14ఏళ్లపాటు పోరాటం చేసి కేసీఆర్ తెలంగాణ సాధించారన్నారు.
శాసనమండలి కార్యాలయంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఈ ఇరువురి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
ముఖ్యంగా కవిత టీఆర్ఎస్ పార్టీ.. బీఆర్ఎస్ పార్టీని క్లిష్టపరిస్థితుల్లోకి నెట్టేసింది. బీఆర్ఎస్ అధినేత సొంత కుటుంబం నుంచే తిరుగుబాటు రావడం ఆ పార్టీ క్యాడర్ ను అయోమయంలో, గందరగోళంలో పడేసింది. పైగా కవిత.. పార్టీ పేరు టీఆర్ఎస్ కావడంతో బీఆర్ఎస్ పరిస్థితి వెంటిలేటర్ పైకి వెళ్లేలా మార్చిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ప్రతిపక్షాలు సమర్పించిన ఈ నోటీసులో ప్రధానంగా ఎన్నికల నిర్వహణలో పారదర్శకత లోపించిందని, నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించాయి. ఈ వ్యవహారంలో వివిధ పార్టీలకు చెందిన సభ్యులు ఏకతాటిపైకి వచ్చి నోటీసు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.
గతంలో ఇదే 152 స్థానాల పరిధిలో బీజేపీ బలం కేవలం 59 సీట్లు మాత్రమే. అయితే ఇప్పుడు ఆ సంఖ్యను రెండింతలు చేసి 110కి చేర్చడం అంటే అది సామాన్యమైన విషయం కాదు.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామక ప్రక్రియ ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన ప్రొఫెసర్ ఎం. కోదండరాం, మాజీ క్రికెటర్ మొహమ్మద్ అజారుద్దీన్ పేర్లకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా శనివారం ఆమోద ముద్ర వేశారు. దీనికి సంబంధించిన ఫైలుపై గవర్నర్ సంతకం చేయడంతో.. వీరిద్దరి నియామకానికి మార్గం సుగమమైంది.
బీఆర్ఎస్ పార్టీ, దాని నాయకత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ అధినేత, తన కన్న తండ్రి కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఇప్పుడు మన మనిషి కాదన్నారు. ఆయనను మరమనిషిగా అభివర్ణించారు. గుంటనక్కల చేతిలో బందీ అయ్యారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ తెలంగాణ ఆత్మను పూర్తిగా కోల్పోవడం వల్లే తాను కొత్త పార్టీ పెట్టాల్సి వచ్చిందన్న కవిత.. ఉద్యమ నాయకుడైన కేసీఆర్ అభివృద్ధి రథం గాడి తప్పిందన్నారు. గతంలో జరిగిన కొన్ని తప్పుల్లో భాగస్వామినేనని అంగీకరిస్తూనే.. ఆ తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నానన్నారు.
ఢిల్లీ, పంజాబ్ ప్రభుత్వాలపై అవినీతి ఆరోపణలు వ‌స్తుండ‌టంతో ఈ టాపిక్ డైవ‌ర్ష‌న్ డ్రామాను ఆప్ తెర‌పైకి తెచ్చింద‌ని అంటారు రాఘ‌వ్ చ‌ద్దా. ఇది కేవలం చద్దా వ్యక్తిగత నిర్ణయం కాదు, ఒక పెద్ద రాజకీయ వ్యూహం. రాజ్యసభలో ఆప్ కి ఉన్న 10 మంది ఎంపీల్లో ఏడుగురు.. అంటే 2/3 వంతు బీజేపీలో చేరడానికి సిద్ధమయ్యారు. ఇందులో ఉన్న కీలక వ్యక్తులు.. రాఘ‌వ్ చ‌ద్దా, సందీప్ పాఠ‌క్, అశోక్ మిట్ట‌ల్, మాజీ క్రికెట‌ర్ హర్భజన్ సింగ్, స్వాతి మలివాల్, రాజేంద్ర గుప్తా, విక్రమ్ సాహ్ని ఉన్నారు.
పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్)గా ప్రకటించారు. రాష్ట్రంలోని అట్టడుగు వర్గాల సంక్షేమం, సామాజిక సమానత్వమే ధ్యేయంగా ఈ పార్టీ పనిచేస్తుందని కవిత ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
ఉద్యోగం అడిగిన యువకుడికి చంద్రబాబు ఆటో ఇస్తానని చెప్పినట్లుగా రెండు వేర్వేరు సందర్భాలను కలిపి ఎడిట్ చేశారు. ఉద్యోగం అడిగితే ఆటోతో సరిపెట్టుకోమన్నారనే అర్థం వచ్చేలా ఈ వీడియోను సృష్టించి వైరల్ చేస్తున్నారు. ఈ అంశంపై స్పందించిన మంత్రి లోకేశ్ వైసీపీ తన పాత అలవాట్లను మానుకోవడం లేదనీ.. బురదజల్లే రాజకీయాలే పరమావధిగా పెట్టుకుందని దుయ్యబట్టారు.
జాతీయ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
గత ఎన్నికలకు ముందు వైనాట్ 175 అంటూ ధీమా వ్యక్తం చేసిన వైసీపీ అధినేత జగన్.. ఇప్పుడు ఎట్ లీస్ట్ 11 అనాల్సిన పరిస్థితి వచ్చేలా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రజల మధ్యకు రాకపోవడం, ప్రజాసమస్యలను పట్టించుకోకపోవడం, అన్నిటికీ మించి అసెంబ్లీకి గైర్హాజర్ కావడం వంటి అంశాలు పార్టీని జనాలను దూరం చేస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.