బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలిగా పురందేశ్వరి.!
Publish Date:Aug 17, 2026
Advertisement
బీజేపీ తన జాతీయ కార్యవర్గాన్ని పునర్వ్యవస్థీకరించింది. కాగా జాతీయ కార్యవర్గంలో రాజమహేంద్ర వరం ఎంపీ పురంధేశ్వరికి స్థానం దక్కింది. ఆమెను జాతీయ ఉపాధ్యక్షురాలిగా నియమించింది. రానున్న ఎన్నికలు, పార్టీ విస్తరణ వ్యూహాలకు అనుగుణంగా బిజెపి అధిష్టానం కార్యవర్గాన్ని పునర్వ్యవస్థీకరించింది. ఈ కొత్త పాలకమండలిలో వివిధ రాష్ట్రాల నుంచి కీలక నాయకులకు చోటు కల్పించారు. కాగా బిజెపి జాతీయ ఉపాధ్యక్ష పదవుల్లో మొత్తం 13 మంది నాయకులకు అవకాశం దక్కింది. వీరిలో పురందేశ్వరి ఒకరు. అదేవిధంగా, పార్టీ నిర్వహణలో కీలకమైన జాతీయ ప్రధాన కార్యదర్శుల జాబితాలో మాజీ మంత్రి స్మృతి ఇరానీకి చోటు దక్కింది. ఈ సంస్థాగత పునర్వ్యవస్థీకరణలో భాగంగా బీజేపీ అగ్రనాయకత్వం.. మహిళా నేతలకు, అనుభవజ్ఞులకు పదవుల్లో ప్రాముఖ్యత ఇచ్చింది. ఇక పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా నియమితులైన పురందేశ్వరి.. కేంద్ర మాజీ మంత్రిగా, సీనియర్ పార్లమెంటేరియన్‌గా అనుభవం ఉన్న నాయకురాలు. ఆమె బీజేపీ గూటికి చేరిన నాటి నుంచీ జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో విభిన్న బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు. బీజేపీ ఏపీ అధ్యక్షురాలిగా కూడా పని చేశారు. ఈ నేపథ్యంలో ఆమె అనుభవానికి గుర్తింపునిస్తూ.. అధిష్టానం ఉపాధ్యక్ష పదవి కట్టబెట్టింది. తెలుగు రాష్ట్రాలలో, మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో బిజెపి బలోపేతానికి ఈ నియామకం తోడ్పడుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. Purandeswari, BJP Vice President, Rajahmundry MP, BJP National Executive Committee, Smriti Irani BJP General Secretary, BJP National Office Bearers, Purandeswari National Politics, TeluguOne
http://www.teluguone.com/news/content/purandeswari-25-229100.html





