పులివెందుల సస్పెన్స్ థ్రిల్లర్

Publish Date:May 2, 2023

Advertisement

సస్పెన్స్ నవలలు, సస్పెన్స్ సినిమాలకు కాలం చెల్లిపోయింది. ఇప్పుడంతా పొలిటికల్ సస్పెన్స్ నడుస్తోంది.  కడప జిల్లా వాసులు ఆసక్తిగా చర్చించుకుంటున్న ఈ సస్పెన్స్ థ్రిల్లర్ లో ప్రధాన సూత్రధారి వైఎస్ అవినాష్ రెడ్డి. కడప పార్లమెంట్ మెంబర్ అయిన అవినాష్ రెడ్డి గత నాలుగు సంవత్సరాలలో పెద్దగా ప్రజలకు కనిపించింది లేదు.

2019 మార్చి 15వ తేదీన జరిగిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య తరవాత పరిణామాలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. గడిచిన రెండు నెలలుగా మీడియాలో అంతా  అవినాష్ పైనే చర్చ జరిగింది. వారం రోజులుగా ఆచ్చ తగ్గుముఖం పట్టి ఇప్పుడు దాదాపు అదృశ్యమైంది.  దీంతో కాస్త ఊపిరి పీల్చుకున్న అవినాష్ ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. నియోజకవర్గంలొగడనగడపకు కార్యక్రమంలో పాల్గొంటున్నారు. 

ఇది ఒక వైపు నడుస్తుంటే.. మరో వైపు సీబీఐ అధికారులు అవినాష్ వెంట నీడలా అనుసరిస్తున్నారు.  అవినాష్ పర్యటనల వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వెంటాడుతున్నారు.  ఢిల్లీ, హైదరాబాద్ నుండి వచ్చిన సీబీఐ బృందం ఏ క్షణంలోనైనా అవినాష్ రెడ్డిని అరెస్టు చేయవచ్చన్న వదంతులు కడపలో జోరుగా షికారు చేస్తున్నాయి. కడప సెంట్రల్ జైలు గెస్ట్ హౌస్ లో మకాం వేసి ఉన్న సీబీఐ బృందం ఓవరితోనూ మాట్లాడటం లేదు. సీబీఐ మౌనం వెనుక వ్యూహం ఏమిటో అర్దం కాక స్థానిక వైసీపీ శ్రేణులు అయోమయంలో పడిపోయాయి. అయితే సీబీఐ వేచి చూసే ధోరణి అవలంబిస్తోందని కొందరు బాహాటంగానే చెబుతున్నారు.

వివేకా హత్య కేసు తమను ఇంత ఇబ్బంది పెట్టదని తొలుత వైసీపీ భావించినా, సీబీఐ, ఉన్నత న్యాయస్థానాల ఆదేశాలతో అన్ని ముందు జాగ్రత్తలూ తీసుకోవాల్సి వచ్చింది. మైసూరు నుంచి విజయ్ కుమార్ గురూజీని, గుజరాత్ నుంచి పరిమళ్ నత్వానీని వైసీపీ అధిష్ఠానం రంగంలోకి దింపింది. ఆంధ్రప్రదేశ్ లోని పెద్ద పారిశ్రామిక వేత్తల సమూహం విజయ్ కుమార్ గురూజీని పనిలో పెట్టగా, బీజేపీ అధినాయకత్వం పరిమళ్ నత్వానీని రంగంలోకి దించింది.రాజ్యసభకు పంపించిన వైసీపీని పరిమళ్ నత్వాని సరైన సమయంలో ఆదుకున్నాడని కడప వాసులు బాహాటంగానే చెప్పుకుంటున్నారు. ఏప్రిల్ 30లోగా అవినాష్ అరెస్టు ఖాయమని పందాలు కాసి ఔత్సీహికులు కొందరు జేబులు ఖాళీ చేసుకున్నారని తెలుస్తోంది. వివేకా హత్య కేసులో ఒకే రోజు 18 మందికి నోటీసులిచ్చి హడావుడి చేసిన సీబీఐ ఎందుకు వేచి చూస్తోందో ఎవరికీ అంతుబట్టడం లేదు. అరెస్టు చేయాలనుకుని కోర్టు ఆదేశాలతో వెనక్కు తగ్గిన సీబీఔ ఇంకా కడపలోనే  ఎ:దుకు మకాం పెట్టిందో అనేది మరో సస్పెన్స్.

తనను అరెస్టు చేస్తే ఆందోళనలకు దిగవద్దంటూ అభిమానులకు సంకేతాలిచ్చిన అవినాష్, ఇప్పుడు అదేమీ పట్టనట్టు పార్టీ కార్యక్రమాల్లో మునిగిపోయారు. ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటనతో వివేకా హత్య కేసు పరిశోధనలో కీలక మార్పులు జరిగాయనీ, వివేకా హత్య కేసు కూడా మిగిలిన కేసుల్లా నత్తనడకలా సాగబోతోందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. కానీ భాస్కరరెడ్డి అరెస్టు జరిగినంత పకడ్బందీగా  అవినాష్ అరెస్టు కూడా జరగబోతోందని కడపలో కొందరు చెవులు కొరుక్కుంటున్నారు.

By
en-us Political News

  
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.