Publish Date:Mar 28, 2023
ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఇలాకా పులివెందులలోనే నడి రోడ్డుపై కాల్పుల జరిపి హత్యలు జరుగుతున్నాయంటేనే రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఎంత దివ్యంగా ఉందో అవగత మౌతుంది. పైగా వివేకా హత్య కేసులో సీబీఐ విచారణను ఎదుర్కొన్న భరత్ యాదవే ఈ కాల్పులకు పాల్పడ్డాడంటే అరాచకం ఏ స్థాయిలో రాజ్యమేలుతోందా అర్ధం అవుతుంది.
వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుడు సునీల్ యాదవ్‌కు బంధువు, ఆ కేసులో భరత్ యాదవ్ ను కూడా సీబీఐ విచారించింది. కాగా డబ్బు విషయంలో దిలీప్ అనే వ్యక్తితో గొడవపడిన భరత్ నడిరోడ్డుపై తుపాకీతో కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన దిలీప్ అనే వ్యక్తి కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించగా, మరో వ్యక్తి బాషా తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నాడు. కాగా కాల్పులకు తెగబడ్డ భరత్ ఆ తరువాత పోలీసులకు లొంగిపోయాడు.
ఇలా ఉండగా.. భరత్ కుమార్ యాదవ్ గతంలో సీబీఐ పై ఆరోపణలు చేశారు. సునీత భర్త రాజశేఖర్ రెడ్డి నుంచి తనకు ప్రాణహానీ పలు సందర్భాలలో పేర్కొన్నాడు. అలాగే వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి భరత్ యాదవ్ తనను బెదరిస్తున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఇప్పుడు జరిపిన కాల్పులకు కూడా కూడా వివేకా హత్య కేసుకు సంబంధించిన అర్థిక వ్యవహారాలలో వచ్చిన విభేదాలే అన్న అనుమానాలు వ్యక్తమౌతు్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/pulivendula-funfire-one-dead-25-153076.html
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి.
వికారాబాద్ జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన అనంతగిరి హిల్స్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
హైదరాబాద్ నగరంలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది.
గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని చారిత్రాత్మక బాపూఘాట్ వద్ద జాతిపిత మహాత్మా గాంధీకి రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నివాళులు అర్పించింది.
కనీస ధర రూ.30కి పెంపునకు సిఫార్సు.!
వెబ్‌సిరీస్ ల్లో ఎక్కువగా బ్యాంకులు, బంగారు దుకాణాల్లో దోపిడీలకు సంబంధించిన వీడియోలే చూసేవాడు.. ఆ తర్వాత తనకున్న ఆర్మీ అనుభవాన్ని ఉపయోగించుకోని సికింద్రాబాద్ మద్రాస్ రెజిమెంట్‌ను ఎంచుకున్నాడు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) వ్యవహారశైలిని నిరసిస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
హైదరాబాద్ నగరవాసుల ప్రయాణ కష్టాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకుంది.
కొత్త కారు కొనుక్కోవాలని ఎన్నో రోజులుగా కలలు కంటారు.. ఆ కల నెరవేరిన రోజు ఆ ఆనందమే వేరు! ఎంతో ఇష్టపడి కొత్త బీఎండబ్ల్యూ కారు కొనుగోలు చేసిన ఓ వ్యక్తి..
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త వాతావరణం నెలకొంది.
మహారాష్ట్రలోని ప్రఖ్యాత హిందూ హృదయసమ్రాట్ బాలాసాహెబ్ థాకరే మహారాష్ట్ర సమృద్ధి మహామార్గ్‌పై జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది.
దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు బయలుదేరిన ఫ్లైదుబాయ్ విమానంలో భారత సంతతి కెప్టెన్‌పై జరిగిన కత్తిదాడి అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.