రూ.10, రూ. 20 ప్లాస్టిక్ నోట్ల ముద్రణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్..!

Publish Date:Jul 28, 2026

Advertisement

 

దేశంలో కరెన్సీ వ్యవస్థను మరింత ఆధునికీకరించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 10, 20 రూపాయల విలువల పాలిమర్ (ప్లాస్టిక్) కరెన్సీ నోట్లను తొలుత ప్రయోగాత్మకంగా (ఫీల్డ్ ట్రయల్స్) విడుదల చేసి, అనంతరం సాధారణ చలామణిలోకి తీసుకురా వడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అయితే, ఈ కొత్త ప్లాస్టిక్ నోట్లు ప్రస్తుతం చలామణిలో ఉన్న కాగితపు నోట్ల స్థానాన్ని పూర్తిగా భర్తీ చేయవని, అవి కాగితపు నోట్లతో పాటు సమాంతరంగా చలామణిలో కొనసాగుతాయని ప్రభుత్వం సోమవారం లోక్‌సభలో స్పష్టం చేసింది. ఈ ప్రాజెక్టులో భాగంగా జూలై 17న భారతీయ రిజర్వ్ బ్యాంక్‌ కు చెందిన భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రణ్ ప్రైవేట్ లిమిటెడ్ (BRBNMPL) పాలిమర్ నోట్ల తయారీకి అవసర మైన ప్రత్యేక పాలిమర్ సబ్‌స్ట్రేట్ తయారీ, సరఫరా కోసం అంతర్జా తీయ స్థాయిలో ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్ (EoI) ఆహ్వానించింది. 

ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎంపికైన సంస్థల ద్వారా నోట్ల తయారీకి అవసరమైన ముడి పదార్థాలను సమకూర్చ నున్నారు. ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఈ పాలిమర్ నోట్ల వినియోగం, వాటి మన్నిక, ప్రజల స్పందన, డిజిటల్ చెల్లింపులపై పడే ప్రభావం వంటి అంశాలపై సమగ్ర అధ్యయనం నిర్వహిస్తోంది. ఈ ఫీల్డ్ ట్రయల్స్ విజయవంతమైతే,రూ 10, రూ.20 విలువలలో ఒక్కో డినామినేషన్‌కు సుమారు 100 కోట్ల (ఒక బిలియన్) నోట్లను ముద్రించే ప్రణాళిక ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. పాలిమర్ నోట్లు సాధారణ కాగితపు నోట్లతో పోలిస్తే అనేక ప్రయోజనాలు కలిగి ఉంటాయి. ఇవి ఎక్కువకాలం మన్నికగా ఉండటంతో పాటు నీరు, తేమ, దుమ్ము, మురికి వంటి వాటికి సులభంగా దెబ్బతినవు. 

చిరిగిపోవడం, రంగు వెలిసిపోవడం వంటి సమస్యలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. దీంతో నోట్ల ముద్రణ వ్యయం దీర్ఘకాలంలో తగ్గే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. అదనంగా, పాలిమర్ నోట్లలో పారదర్శక విండోలు, ప్రత్యేక హోలోగ్రామ్‌లు, అధునాతన భద్రతా గుర్తులు వంటి సాంకేతిక భద్రతా ఫీచర్లను అమర్చ డం సులభం. దీంతో నకిలీ కరెన్సీ తయారీని గణనీయంగా అరికట్టే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయప డుతున్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా, కెనడా, యూకే, న్యూజిలాండ్, సింగపూర్, మలేషియా, వియత్నాం, రొమేనియా సహా అనేక దేశాలు పాలి మర్ కరెన్సీని విజయవంతంగా వినియోగిస్తున్నాయి. 

ఈ దేశాల్లో పాలిమర్ నోట్లు సాధారణ కాగితపు నోట్ల కంటే ఎక్కువకాలం మన్నికగా ఉండటంతో పాటు నిర్వహణ వ్యయాన్ని కూడా తగ్గించాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న సాంకేతిక ప్రమాణాలు, భద్రతా అవసరాలను దృష్టిలో ఉంచుకొని భారత్ కూడా పాలిమర్ కరెన్సీ దిశగా తొలి అడుగు వేస్తోందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ప్రస్తుతం ఈ ప్రక్రియ ప్రారంభ దశలోనే ఉందని, ఫీల్డ్ ట్రయల్స్ ఫలితాలు, సాంకేతిక అధ్యయనాలు, ప్రజల అభిప్రాయాలను పరిశీలించిన తర్వాత పూర్తి స్థాయి అమలుపై తుది నిర్ణయం తీసుకుం టామని ప్రభుత్వం వెల్లడించింది.

printing of plastic notes, RBI, BRBNMPL, Central Goverment, Polymer notes, Australia, Canada, UK, New Zealand, Lok Sabha

By
en-us Political News

  
ఒక టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో ఖవాజా ఆసిఫ్ తాను పీఓకేలో నిరసనలు చేస్తున్న వారిని భారత్‌తో సమానమైన వర్గంలో చేరుస్తున్నానని పేర్కొన్నారు. వారిని కూడా భారతదేశం లాంటి శత్రువులుగానే పరిగణిస్తున్నాననీ, అందుకే ఆ ఆందోళనకారులతో చర్చిందేదే లేదనీ, వారు పాకిస్థాన్ శత్రువులని చెప్పారు.
మూడు దశాబ్దాల భవిష్యత్ ను ముందుగానే చూడగల విజనరీ అయిన చంద్రబాబు నాయుడు 1997లో ఉత్తరాంధ్రకు అంతర్జాతీయ విమానాశ్రయ ఆవశ్యకతను గుర్తించారు. ఆ దిశగా అడుగులు వేశారు. ఇక హుద్‌హుద్ తుఫాను అనంతరం.. సురక్షిత, ఆధునిక విమానాశ్రయం ప్రతిపాదనను ఆయన మరింత గట్టిగా ముందుకు తీసుకువెళ్లారు. ఓ వైపు సముద్ర తీరం, మరొకవైపు మన్యప్రాంతాల నడుమ వ్యూహాత్మక ప్రదేశంగా భోగాపురాన్ని అయిన ఎంపిక చేశారు.
మొదట చర్చల సందర్భంగా, నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులు, యువతపై కొత్త ఎఫ్ఐఆర్ లు నమోదు చేయబోమని, ఇప్పటికే నమోదైన పాత కేసులను కూడా పూర్తిగా ఉపసంహరిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని గుర్తు చేసిన ఆయన ఇప్పుడు.. వ్యవహారం న్యాయస్థానం పరిధిలో ఉందంటూ ఆ హామీ అమలుపై వెనక్కు తగ్గిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మిసిర్ బేస్రాపై ఝార్ఖండ్, బిహార్, ఒడిశా, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో పోలీసులపై దాడులు, నరమేధాలు, ఐఈడీ పేలుళ్లు, వసూళ్లు సహా ఏకంగా 150కి పైగా కేసులు నమోదయ్యాయి. 2007లో ఖుంటీ పోలీసులు ఇతడిని అరెస్ట్ చేసినప్పటికీ, 2009లో బిహార్‌లోని లఖిసరాయ్ కోర్టు సముదాయంపై మావోయిస్టులు దాడి చేసి అతడిని విడిపించుకుపోయారు. ఆ సంఘటన తర్వాత దాదాపు రెండు దశాబ్దాల అజ్ఞాతంలోనే ఉన్నారు.
వర్షాల తీవ్రత వల్ల పలు జిల్లాల్లో పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. కామరూప్, ధుబ్రి, లఖింపూర్, దిబ్రూగఢ్ వంటి ప్రధాన ప్రాంతాల్లో నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో వందలాది గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. రహదారులు, వంతెనలు కొట్టుకుపోవడంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది.
ఇన్ స్పెక్టర్, బాధిత మహిళ కొంత కాలం పాటు సహజీవనం చేసినట్లు కూడా విచారణలో వెలుగులోకి వచ్చింది. అనంతరం ఈ పరిణా మాల నేపథ్యంలో బాధిత మహిళ ఫిర్యాదుపై ఉన్నతాధి కారులు చేపట్టిన విచారణలో ప్రాథమిక ఆధారాలు ఉన్నట్లు తేలడంతో శాఖాపరమైన చర్యల్లో భాగంగా ఆయనను సస్పెండ్ చేస్తూ హైదరా బాద్ పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.
హైదరాబాద్ లోని పలు ప్రాంతాలలో రహదారులు జలమయమయ్యాయి. వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల మేరకు రెండు గంటల వ్యవధిలోనే నగరంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.
రోజురోజుకూ పెరిగిపోతున్న ఈ సైబర్ ముఠాల దందాను అరికట్టడానికి సాధారణ చట్టాలు సరిపోవనీ, అందుకే ఇకపై డిజిటల్ అరెస్టు మోసాలను పాతకాలపు ఐటీ చట్టాల కింద కాకుండా, వ్యవస్థీకృత నేరాల నియంత్రణ చట్టం కింద నమోదు చేసి, దర్యాప్తు జరపాలని పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
ఫార్వార్డ్ సీమెన్స్ యూనియన్ ఆఫ్ ఇండియా సామాజిక మాధ్యమ వేదికగా షేర్ చేసిన నివేదిక వీడియోతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. నౌక పరిసర ప్రాంతాల్లో నిరంతరం పేలుళ్లు జరుగుతుండటం, దట్టమైన నల్లటి పొగ ఆకాశాన్ని కమ్మేస్తుండటం ఎఫ్సీయూ ఐవిడుదల చేసిన వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.
మీ పుస్తకాల అభిరుచికి సరిపోయే సరైన నవలల కోసం వెతుకుతున్నారా? నా లైబ్రరీలోని పుస్తకాలతో ఛాట్‌జీపీటీ చేసిన అద్భుత ప్రయోగం, 30 నిమిషాల్లో అది అందించిన పర్సనలైజ్డ్ బుక్ రికమండేషన్ల రహస్యాలు ఇక్కడ చదవండి.
వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తాజా నివేదిక ప్రకారం బంగారం ధరలు త్వరలోనే దిగివచ్చే అవకాశం ఉంది. పసిడి మార్కెట్ పరిస్థితులు, తగ్గుదలకు గల కారణాలు మరియు తాజా ధరల పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
కాలిఫోర్నియాలోని 330 MW డేటా సెంటర్ కూలింగ్ కోసం 287 మిలియన్ గాలన్ల వ్యవసాయ నీటిని మళ్లించే ప్రయత్నాన్ని వాటర్ డిస్ట్రిక్ట్ అడ్డుకుంది. $10 బిలియన్ల ప్రాజెక్ట్ చుట్టూ రేగిన చట్టపరమైన పోరాటం మరియు రైతు ఆందోళనల పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
3D టీవీలు కనుమరుగవుతున్న వేళ, బ్లూ రే నుండి ఆపిల్ విజన్ ప్రో స్పేషియల్ వీడియోల వరకు అన్ని 3D ఫార్మాట్లను ప్లే చేసే ఉచిత SyLC 3D ప్లేయర్ గురించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.