ముందు నుయ్యి.. వెనుక గొయ్యి

Publish Date:Jun 30, 2023

Advertisement

వైసీపీ ఎమ్మెల్యేల పరిస్థితి చేతి దగ్గరకొస్తే చేతి దెబ్బ.. కాలి దగ్గరకొస్తే కాలి దెబ్బ అన్నట్లుగా తయారైంది. జగన్ సర్కార్ అస్తవ్యవస్థ విధానాలు, ఆర్థిక అరాచకత్వం కారణంగా రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలలోనూ  తీవ్ర ఆగ్రహం వ్యక్తమౌతున్నది.

జగన్ సర్కార్ తీవ్రమైన యాంటీ ఇంకంబెన్సీని ఎదుర్కొంటోందన్నది రాజకీయ విశ్లేషకులే కాదు, వైసీపీ శ్రేణులు కూడా చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో జగన్ మాట పట్టుకుని గడపగడపకు మన ప్రభుత్వం అంటూ వెళుతున్న వారికి ప్రజల నుంచి ఛీత్కారాలూ, పరాభవాలే ఎదురౌతున్నాయి. ముందస్తు ప్రణాళిక వేసుకుని జగన్ ఎమ్మెల్యేలు, మంత్రులను జనంలోకి పంపాలని నిర్ణయించుకున్న నాటి నుంచే వైసీపీలో బయటపడకపోయినా తీవ్ర అసంతృప్తి నెలకొందన్నది వాస్తవం. ఆ విషయాన్ని జగన్ ఒక్కడే గ్రహించడం లేదని పార్టీలో కీలక నేతలు సైతం అంతర్గత సంభాషణల్లో బయటపడిపోతున్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికలలో పరాభవం తరువాత జగన్ ధోరణి బెదరింపుల నుంచి బుజ్జగింపుల వరకూ రావడంతో.. ఇక గడపగడపకూ నరకం నుంచి బయటపడినట్లేనని మంత్రులూ, ఎమ్మెల్యేలూ ఊపిరి పీల్చుకున్నారు.  ముందస్తు ప్రశక్తే లేదని జగన్ తనను తాను సమాధాన పరుచుకుని షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళతాం అని ప్రకటించారు. సరిగ్గా ఈ ప్రకటన తరువాత నుంచే ఇంకా తొమ్మదినెలలకు పైగా సమయం ఉంది కనుక ఎమ్మెల్యేలు, మంత్రులను జనంలోకి పంపి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను వివరించాలని జగన్ ఆదేశించారు. అన్ని రోగాలకూ ఒకటే మందు జిందా తిలస్మాత్ అన్నట్లు అన్ని  వర్గాల ప్రజలలో నెలకొన్న ఆగ్రహం, అసంతృప్తిని పారద్రోలడానికి గడపగడపకూ  మన ప్రభుత్వం కార్యక్రమమే దివ్యఔషధమన్న ఐ ప్యాక్ సూచనలకు అనుగుణంగా మళ్లీ జగన్ ఎమ్మెల్యేలను ప్రజాగ్రహానికి బలి చేసి వ్యక్తిగత లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు.

వచ్చే ఎన్నికలలో పార్టీ టికెట్ దక్కాలంటే.. గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా జనం మనసులు గెలుచుకోవాలని ఆదేశిస్తున్నారు. ఈ కార్యక్రమంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఓ 19 మందిని గుర్తించాననీ, వారు తమ తీరు మెరుగుపరుచుకోకపోతే టికెట్ ఉండదనీ ఇటీవల హెచ్చిరించి పంపారు.  దీంతో వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రుల పరిస్థితి ముందుకు వెడితే నుయ్యి వెనక్కు వెడితే గొయ్యి అన్న చందంగా తయారైంది. పార్టీలోనూ, ప్రజలలోనూ కూడా వారు ముఖం చూపలేక, ముఖం చాటేయలేకా నానా యాతనకు గురౌతున్నారు. మొండిగా ప్రజలలోకి వెళ్లిన వారు జనం ప్రశ్నలకు సమాధానం చెప్పలేక సహనం కోల్పోతున్నారు. వార్నింగ్ లకు, బెదరింపులకు, బ్లాక్ మెయిలింగ్ కు దిగుతున్నారు.  సాక్షాత్తూ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేనికే ఈ పరిస్థితి ఎదురైంది. మంత్రి ఆదిమూలపు సురేష్ కూడా ప్రజాగ్రహ జ్వాలను ఎదుర్కొన్నారు.

ఇరువురూ కూడా జనంపై ఆగ్రహం వ్యక్తం చేసి వారిలోని ప్రభుత్వ వ్యతిరేకత మరింత పెరిగేందుకు మాత్రమే దోహదపడ్డారు.  స్పీకర్ తమ్మినేని సీతారాం అయితే.. మా తీరు ఇంతే మేం మారం మీ దిక్కున్న చోట చెప్పుకోపో అని ఓటర్ ను..అదీ ఓ మహిళా ఓటర్ పై అగ్రహంతో విరుచుకుపడ్డారు. దాదాపు ఇదే సీన్  రాష్ట్రం అంతా కనిపిస్తోంది. జగన్ ను ఏం అనలేని ఎమ్మెల్యేలు.. ప్రజలపై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ వచ్చే ఎన్నికల్లో తమ ఓటమిని.. అలాగే పార్టీ ఓటమిని ఇప్పుడే కన్ఫర్మ్ చేసేస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఈ బాధలన్నీ పడలేక కేవలం లబ్ధిదారుల ఇళ్లకే వెడదామని నిర్ణయించుకుని ఆ ప్రకారమే చేస్తున్నప్పటికీ.. ప్రభుత్వ పథకాల లబ్ధి దారుల్లో సైతం ఆగ్రహం వ్యక్తం అవుతుండటం ఎమ్మెల్యేలు, మంత్రులకు మింగుడుపడటం లేదు.  

రూ. పదివేలు ఇచ్చి.. రూ. ఇరవై వేలు లాక్కుంటున్నారని లబ్ధిదారులు మంత్రులు, ఎమ్మెల్యేల ముఖం మీదే అసహనం వ్యక్తం చేస్తున్నారు.  ప్రభుత్వ మద్యం విధానంపై కూడా ఓ రేంజ్ లో నిరసన వ్యక్తం అవుతోంది.  రోడ్లు, నీళ్లు, విద్యుత్, పన్నులు ఇలా ఒక్క విషయం అని కాదు.. అన్ని అంశాలలోనూ ప్రజలు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ బాధ పడలేక గడపగడపకూ కార్యక్రమానికి వెళ్లకుండా డుమ్మా కొట్టేద్దామంటే అడుగడుగునా ఐ ప్యాక్ నిఘా. వెళ్లి ప్రజా వ్యతిరేకత చవిచూసినా, ప్రజలలో ఆదరణ లేదన్న ఐప్యాక్ నివేదికలు క్షణాల్లో జగన్ చేతికి వెళ్లిపోతున్నాయి.  దీంతో ఎమ్మెల్యేలు ఏ రాయి అయితేనేం పళ్లు రాలగొట్టుకోవడానికి అన్న నిర్వేదంలో పడిపోయారు. వీటన్నిటికంటే ఐప్యాక్ సభ్యులను మేనేజ్ చేసుకుంటే మేలన్న ఉద్దేశంతో కొందరు ఆ ప్రయత్నాలూ చేశారు, చేస్తున్నారు.   మొత్తం మీద వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, క్యాడర్ లో ఆల్ ఈజ్ నాట్ వెల్ అన్న భావనే వ్యక్తమౌతోంది. 

By
en-us Political News

  
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులపేర్ల మీద అధికారికంగా నమోదై ఉన్న భూముల వివరాలను అసెంబ్లీ వేదికగానే  రేవంత్ రెడ్డి బయటపెట్టారు.  
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.