ప్రశ్న రావణ్.. నిజంగా రావణుడే.!?

Publish Date:Jul 8, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టిస్తున్న యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్  వివాదాస్పద వ్యాఖ్యల కేసులో రోజుకో దిమ్మదిరిగే వాస్తవం బయటకు వస్తోంది.  రాజకీయ ప్రముఖులతో పాటు హిందూ దేవుళ్లను కించపరుస్తూ సోషల్ మీడియా వేదికగా ఆయన చేసిన కామెంట్స్ రాష్ట్రవ్యాప్తంగా  ప్రకంపనలు రేపాయి. ఈ ఉదంతాన్ని సీరియస్ గా తీసుకున్న ఏపీ పోలీసులు  దర్యాప్తు  ముమ్మరం చేశారు. ముఖ్యంగా ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు సనాతన ధర్మంపై అత్యంత అసభ్యకర రీతిలో మాట్లాడి శాంతిభద్రతలకు విఘాతం కలిగించారనే ఆరోపణల నేపథ్యంలో జోసెఫ్ రావణ్ చుట్టూ  ఉచ్చు మరింత బిగుస్తోంది.

ఈ వ్యవహారంలో పోలీసులు తాజాగా కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో  సంచలన విషయాలను ప్రస్తావించారు. సమాజంలో మతాలు, కులాల మధ్య   విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా జోసెఫ్ రావణ్ ప్రసంగాలు సాగాయని పోలీసులు నివేదికలో వెల్లడించారు. అంతేకాకుండా..  రాజ్యాంగబద్ధమైన ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తులపై  అవమానకరమైన రీతిలో పోస్టులు పెట్టడం ద్వారా ప్రజల్లో ప్రభుత్వ వ్యవస్థలపై ద్వేషం, వైషమ్యం పెంచేందుకు ప్రశ్న రావణ్ ప్రయత్నించినట్లు అధికారికంగా గుర్తించారు. 

పోలీసులు సమర్పించిన రిమాండ్ రిపోర్టులోని మరికొన్ని అంతర్గత విషయాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. విద్యార్థులు, స్థానిక యువతను నిషేధిత మావోయిస్టు శ్రేణుల వైపు ఆకర్షితులయ్యేలా జోసెఫ్ రావణ్ సోషల్ మీడియా వేదికగా సందేశాలు పంపినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. ఇటీవల ఏలూరు జిల్లాలో నిర్వహించిన ఒక దళిత క్రైస్తవ సదస్సులో  ప్రశ్న రావణ్ రెచ్చగొట్టే ఉపన్యాసాలు ఇచ్చినట్లు దర్యాప్తులో తేలింది. సమాజంలో శాంతియుత వాతావరణాన్ని దెబ్బతీసేలా ప్రసంగించడంతో పాటు,  మావోయిస్టు అగ్రనేత హిడ్మాను కీర్తిస్తూ వ్యాఖ్యలు చేయడం పోలీసులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

ఈ తీవ్రమైన నేరపూరిత మరియు సంఘవిద్రోహ చర్యల నేపథ్యంలో పోలీసులు జోసెఫ్ రావణ్‌పై సాధారణ చట్టాలతో పాటు  దేశద్రోహ వ్యతిరేక చట్టాన్ని ప్రయోగించారు. ఆయనపై చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం  ఉపా కింద కేసులు నమోదు చేయడంతో పాటు రాజద్రోహం సెక్షన్లను కూడా చేర్చారు. ఇప్పటికే ఈ యూట్యూబర్‌పై రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో దాదాపు తొమ్మిది కేసులు నమోదైనట్లు పోలీసులు ధృవీకరించారు. వరుసగా పలు జిల్లాల పోలీసులు ఆయనను ఒక కేసులో బెయిల్ వచ్చిన వెంటనే మరో కేసులో అదుపులోకి తీసుకుంటూ విచారిస్తున్నారు.

గత కొద్ది రోజులుగా ఈ కేసులో వరుస అరెస్టుల పరంపర సాగుతోంది. పిఠాపురం, కాకినాడ సర్పవరం, కృష్ణా జిల్లా మచిలీపట్నం, ఇనగుదురు వంటి పలు పోలీస్ స్టేషన్లలో నమోదైన ఫిర్యాదుల ఆధారంగా రావణ్‌ను పోలీసులు ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఒక కోర్టులో బెయిల్ మంజూరైన వెంటనే, మరో జిల్లాకు చెందిన పోలీసులు సిద్ధంగా ఉండి ఆయన్ను అదుపులోకి తీసుకుంటున్న పరిస్థితి నెలకొంది. కూటమి ప్రభుత్వ విధానాలను, పవన్ కళ్యాణ్‌ను వ్యక్తిగతంగా లక్ష్యం చేసుకుని దూషించారంటూ జనసేన, తెలుగుదేశం పార్టీల శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదులు అందజేస్తున్నారు.

రాజకీయంగా, సామాజికంగా ఈ ఉదంతం రాష్ట్రంలో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. జోసెఫ్ రావణ్ భార్య,  ఆయన తరఫు లీగల్ టీమ్ ఈ వరుస అరెస్టులపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఒకే తరహా అంశాలపై వరుస కేసులు పెడుతూ వేధిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే తమపై నమోదైన అన్ని కేసులను ఒకే కేసుగా పరిగణించి విచారణ జరపాలని, దర్యాప్తునుసీబీఐకి అప్పగించాలని కోరుతూ జోసెఫ్ రావణ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌లో ఏపీ ప్రభుత్వం,  డీజీపీని ప్రతివాదులుగా చేర్చారు.

మరోవైపు, ఈ వ్యవహారంపై జాతీయ మానవ హక్కుల కమిషన్కు కూడా ఫిర్యాదులు అందాయి. వరుస అరెస్టుల పేరిట పోలీసులు  నిబంధనలను ఉల్లంఘిస్తున్నారంటూ మానవ హక్కుల ప్రతినిధులు కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ కేసును పరిశీలనలోకి తీసుకుంది. ప్రస్తుతం నిందితుడు గన్నవరం పోలీసుల పరిధిలో ఉపా చట్టం కింద విచారణ ఎదుర్కొంటుండటంతో, న్యాయస్థానాలు ఈ కేసును ఏ విధంగా పరిగణిస్తాయనేది ఆసక్తికరంగా మారింది. ఉపా చట్టం కింద కేసు నమోదైనందున నిందితుడికి అంత సులభంగా బెయిల్ లభించే అవకాశం లేదని న్యాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.అదలా ఉంటే.. ప్రశ్న రావణ్ సెల్ ఫోన్ లోఅశ్లీల వీడియోలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఈనెల ఒకటి న ప్రశ్న రావణ్ అరెస్ట్ అయ్యారు. ఆ సమయంలో ఫోన్  డేటాను  విశ్లేషించిన పోలీసులు అందులో కీలక సమాచారం ఉన్నట్లు తెలుసుకున్నారు. అయితే అప్పటికే రావణ్  తన ఫోన్లోని వీడియోలను డిలీట్ చేసినట్లు తెలుస్తోంది. అలా డిలీట్ చేసిన డేటా కోసం పోలీసులు ఫోన్ ను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. ఆ ల్యాబ్ నుంచి వచ్చిన నివేదికలో షాకింగ్ అంశాలు వెలుగులోకి వచ్చాయి.   రావణ్ అమాయక యువతులను టార్గెట్ గా చేసుకుని వారితో అసభ్యకరంగా ప్రవర్తించడం.. ఏకాంతంగా ఉన్న సమయంలో ఫోటోలు, వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేసినట్లు  ఫోరెన్సీక్ ల్యాబ్ నివేదికలో వెల్లడైనట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. దీంతో పోలీసులు ఈ కేసులో ఇప్పుడు   రావణ్ బారిన పడిన బాధితులు ఎంతమంది ఉన్నారన్న కోణంలో అధికారులు చేపట్టి దాదాపు పదిమంది బాధితులను గుర్తించినట్లు తెలుస్తోంది. దీంతో మరింత కఠినమైన కేసులు జోసెఫ్ రావణ్ పై మోపే అవకాశం ఉంది.

Joseph Ravan Case, Prasna Ravan Arrested, UAPA Act Andhra Pradesh, Joseph Ravan Maoist Links

By
en-us Political News

  
రాష్ట్రంలో ఇటీవల జరిగిన కొన్ని సంఘటనల నేపథ్యంలో ఈ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చర్చనీయాంశంగా మారింది. ఒక యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు ప్రముఖ నాయకులపై నిస్సిగ్గుగా విమర్శలు చేసినందుకు పిఠాపురం పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, ప్రస్తుత చట్టాల ప్రకారం ఏడేళ్ల లోపు శిక్ష పడే సెక్షన్ల కింద కేసులు నమోదు కావడంతో కోర్టులో అతనికి తక్షణమే బెయిల్ లభించింది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న 9 ప్రముఖ AI టూల్స్ యొక్క బలహీనతను వాడుకుని హాకర్లు భారీ బాట్‌నెట్ నెట్‌వర్క్‌లను సృష్టిస్తున్నారు. హాలూస్క్వాటింగ్ (HalluSquatting) అనే ఈ సరికొత్త సైబర్ ముప్పు గురించిన పూర్తి వివరాలు మీకోసం.
2026 సంవత్సరంలో ఉక్కపోత మరియు వేసవి ఎండలను తరిమికొట్టే సరికొత్త షార్క్, డైసన్ మరియు డ్రియో కంపెనీల టాప్ 5 కూలింగ్ ఫ్యాన్స్ వివరాలు, ధరలు మరియు వాటిలోని AI మోషన్ ట్రాకింగ్, వాటర్ మిస్ట్ టెక్నాలజీ ప్రత్యేకతలు మీకోసం.
శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ ఫలితాల తర్వాత గ్లోబల్ చిప్ మార్కెట్లో భారీ పతనం. అమెరికా వాల్ స్ట్రీట్‌లో ఇంటెల్, ఏఎండీ, శాన్‌డిస్క్ షేర్లు కుప్పకూలాయి. నాస్‌డాక్ 500 పాయింట్లు పడిపోవడానికి గల పూర్తి కారణాలు, చమురు ధరల పెరుగుదల వివరాలు ఇక్కడ చూడండి.
అమరావతి ల్యాండ్ పూలింగ్ రైతులకు ఏపీసీఆర్‌డీఏ భారీ ఊరటనిచ్చింది. ఎకరాకు రూ. 40,000 కౌలు పెంపు, మరో 15 ఏళ్ల పొడిగింపుతో పాటు రూ. 1.5 లక్షల రుణమాఫీ ప్రకటనతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ప్రపంచ కుబేరుడు ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ తాగే వాటర్ బాటిల్ ధర రూ.49 లక్షలు అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న షాకింగ్ నిజాలు, ఆ బాటిల్ ప్రత్యేకతలు ఇక్కడ చూడండి.
ఫీఫా వరల్డ్ కప్ 2026 క్వార్టర్ ఫైనల్స్ ముందు ఊహించని పరిణామం క్రిస్టియానో రొనాల్డో పోర్చుగల్, మరియు హోస్ట్ యూఎస్ఏ జట్లు టోర్నీ నుండి అవుట్ కావడంతో క్వార్టర్ ఫైనల్ టికెట్ల ధరలు భారీగా పడిపోయాయి. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో భారత్ ఘోర ఓటమి తర్వాత సంజూ శాంసన్‌ను జట్టు నుంచి తప్పించడంపై వివాదం చెలరేగింది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన వివరణ, స్టేడియం బయట ఫ్యాన్స్ హంగామా పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) మరియు పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఉపయోగించి దీర్ఘకాలంలో కోట్ల రూపాయల సంపదను ఎలా సృష్టించాలో ఉదాహరణలతో సులభంగా తెలుసుకోండి.
బ్రిటన్ గ్రామీణ ప్రాంతాల్లో 14 చిన్న తరహా అణు రియాక్టర్ల (SMR) ఏర్పాటు కోసం పోలిష్ బిలియనీర్ 35 బిలియన్ పౌండ్ల భారీ పెట్టుబడిని ప్రకటించారు. AI డేటా సెంటర్ల విద్యుత్ అవసరాల కోసం గూగుల్ భాగస్వామ్యంతో వస్తున్న ఈ ప్రాజెక్ట్ పూర్తి వివరాలు చూడండి.
హోమ్ సెక్యూరిటీ కెమెరాలు అనవసరమైన ఖర్చు అనుకుంటున్నారా? అర్ధరాత్రి వేళ ఇద్దరు దొంగలు గోడ దూకిన ఈ భయంకరమైన నిజ జీవిత సంఘటన మరియు కెమెరాల ప్రాముఖ్యత గురించి ఇప్పుడే చదవండి.
బిట్‌డిఫెండర్ ఐడెంటిటీ థెఫ్ట్ ప్రొటెక్షన్‌తో ఆన్‌లైన్ మోసాలకు అడ్డుకట్ట వేయండి. బడ్జెట్ ధరలో $1 మిలియన్ ఇన్సూరెన్స్, డార్క్ వెబ్ మానిటరింగ్ మరియు క్రెడిట్ అలర్ట్స్ పొందే పూర్తి వివరాలు మీకోసం.
ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంక్ హెచ్‎డీఎఫ్‎సీ (HDFC Bank) రుణగ్రహీతలకు షాకిస్తూ MCLR లోన్ వడ్డీ రేట్లను సవరించింది. పెరిగిన కొత్త రేట్లు, మీ హోమ్ లోన్, కార్ లోన్ ఈఎంఐలపై పడే ప్రభావం పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.