బాంకీపూర్ ఉపఎన్నిక బరిలో ప్రశాంత్ కిషోర్

Publish Date:Jun 29, 2026

Advertisement

భారతీయ రాజకీయాలలొప్రశాంత్ కిషోర్ (పీకే) పేరుకు పరిచయం అక్కర్లేదు.  రాజకీయ వ్యూహకర్తగా పీకే ఎన్నో చారిత్రాత్మక విజయాల వెనుక పీకే ఉన్నారు. అయితే సొంత రాష్ట్రం బీహార్ లో సొంత రాజకీయ పార్టీ పెట్టి ఎన్నికల బరిలోకి దిగి బొక్కబోర్లా పడ్డారు. అయితే ఇప్పుడు ఆయన మరో సారి ఎన్నికల బరిలోకి దిగనున్నారు.  సొంత పార్టీ పెట్టి  బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో అన్ని స్థానాలలోనూ  తన పార్టీ అభ్యర్థులను నిలబెట్టిన ప్రశాంత్ కిశోర్ అప్పుడు తాను స్వయంగా పోటీ చేయలేదు. పార్టీ ఘోర పరాజయం తరువాత ఇప్పుడు ఆయన బీహార్ అసెంబ్లీలోకి అడుగుపెట్టేందుకు  సిద్ధమౌతున్నారు.

   బిహార్‌లో ఆయన స్థాపించిన  జన్ సూరజ్  పార్టీకి ఏ మాత్రం ఆదరణ లభించలేదు. గత ఎన్నికల్లో ఆ పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేదు. అయినా వెనుకడుగు వేయని ప్రశాంత్ కిశోర్..  ఇప్పుడు బీహార్ కొత్త పాట్నా పరిధిలోని  బాంకీపూర్  నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికలో తానే స్వయంగా బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నారు.  

బాంకీపూర్ నియోజకర్గం దశాబ్దాలుగా  బీజేపీ కి బలమైన కోటగా నిలబడుతోంది. 1995 నుండి ఈ నియోజకవర్గం నుంచి  బీజేపీ అభ్యర్థులే విజయం సాధిస్తూ వస్తున్నారు. గత ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి ప్రస్తుత బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ విజయం సాధించారు. ఆయన తాజాగా రాజ్యసభకు ఎన్నిక కావడంతో ఈ నియోజకవర్గానికి రాజీనామా చేశారు.  దీంతో బాకింపూర్ కు త్వరలో ఉప ఎన్నిక జరగనుంది. బీజేపీకి బలమైన నియోజకవర్గమే అయినప్పటికీ..  పీకే ఇక్కడ నుంచి పోటీ చేయడానికి నిర్ణయించుకున్నారు.  ఈ విషయాన్ని ఆయన సూచన ప్రాయంగా వెళ్లడడించారు.  బాంకీపూర్‌లో బీజేపీ ఆధిపత్యాన్ని ఎలాగైనా తగ్గించడమే తన ప్రధాన లక్ష్యమనీ.. అవసరమైతే తానే స్వయంగా బరిలోకి దిగుతానని ఆయన ప్రకటించారు.

ఇప్పటివరకు   పొలిటికల్ స్క్రీన్‌ప్లే లకే పరిమితమైన  ప్రశాంత్ కిషోర్..    ఇప్పుడు నేరుగా ఎన్నికల బరిలోకి దిగనున్నారు. అదీ బీజేపీకి గట్టిపట్టున్న బాంకీపూర్ నియోజకవర్గం నుంచి. బీజేపీ కోటలాంటి బాంకీపూర్ లో పీకే గెలుపు కష్టసాధ్యమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే ప్రాశాంత్ కిశోర్ మాత్రం  దశాబ్దాల బీజేపీ కోటను బద్దలు కొడతానంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్‌లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.
ఈ అరెస్టు పై బీఆర్ఎస్‌ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. హరీష్ రావు అరెస్టు సందర్భంగా పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. గురుకులాల్లో అవినీతి, రాష్ట్ర అప్పులపై గన్ పార్క్ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రులు పొన్నం ప్రభాకర్‌, అడ్లూరి లక్ష్మణ్‌, అజారుద్దీన్‌.. బీఆర్‌ఎస్‌ నేతలు హరీశ్‌రావు, కేటీఆర్‌లకు సవాల్‌ విసిరారు.
జగన్ ప్రసంగాలు, మీడియా సమావేశాలు... ట్రోలింగ్‌కు, మీమ్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి. నెటిజనులు, తెలుగుదేశం, జనసేన సోషల్ మీడియా యాక్టివిస్టులు జగన్ ప్రెస్ మీట్ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారంటే ఇసుమంతైనా అతిశయోక్తి కాని పరిస్థితి ఉంది.
గతంలో ప్రభుత్వ పనుల కాంట్రాక్టులు దక్కించుకోవాలంటే కేవలం రాజకీయ పలుకుబడి, కమిషన్లు మాత్రమే ప్రాధాన్యత సంతరించుకునేవనే విమర్శలు బలంగా ఉన్నాయి. ఈ విధానాన్ని మార్చి విజయ్ ఇప్పుడు ప్రతిభ, పారదర్శకత ఆధారంగానే టెండర్లు లభించే కొత్త విధానాన్ని తీసుకువచ్చారు.
ఇటువంటి ఉత్కంఠభరిత రాజకీయ వాతావరణంలో.. ఇద్దరు బద్ద రాజకీయ ప్రత్యర్థులు అకస్మాత్తుగా ఒ ముఖాముఖి ఎదురైతే.. అసలా ఊహే ఎవరికీ రాదు అన్నట్లుగా ప్రస్తుతం ఏపీ రాజకీయ పరిస్థితి ఉంది. కానీ అనూహ్యంగా రఘురామకృష్ఫం రాజు, అంబటి రాంబాబు ఓ వివాహ వేడుకలో ఎదురు పడ్డారు.
రాజధాని వంటి అత్యంత కీలకమైన, సున్నితమైన విషయంలో జగన్ పదే పదే తన స్టాండ్ మార్చుకోవడం పరిశీలకులను సైతం విస్మయానికి గురి చేస్తున్నది. స్థిరత్వం లేని జగన్ తీరు వెనుక ఎవరి సలహాలు ఉన్నాయన్న చర్చ ఇప్పుడు ఏపీ రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది.
పాత చరితను పునరావృతం చేస్తున్న డిప్యూటీ స్పీకర్!
తమిళనాడులో నటుడు విజయ్ నేతృత్వంలో టీవీకే ప్రభుత్వాన్ని కూల్చేందుకు జరిగిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు.
వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో నోటికి హద్దూ పద్దూ లేదన్నట్లుగా, జనసేనాని పవన్ కల్యాణ్, తెలుగుదేశం నేతలపై అనుచిత వ్యాఖ్యలతో దువ్వాడ రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. ఈ అనుచిత వ్యాఖ్యలపై దువ్వాడ శ్రీనివాస్ పై కొత్తూరు పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఒక కేసుకు సంబంధించి వివరణ ఇచ్చేందుకు బయలుదేరిన దువ్వాడ శ్రీనివాస్.. పోలీసు స్టేషన్ కు చేరకుండానే మిస్సయ్యారు.
దేశంలో నిష్పాక్షికంగా ఎన్నికలు జరగాలంటే న్యాయవ్యవస్థ జోక్యం అనివార్యమని పేర్కొన్నాయి. ఈ లేఖపై ఇండియా కూటమికి చెందిన 23 పార్టీల నాయకులు సంతకాలు చేశారు.
దీంతో తిరుచిరాపల్లి నియోజకవర్గానికి రాజీనామా చేయడంతో ఆ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆయన రాజీనామాతో ఖాళీ అయిన స్థానం నుంచి విజయ్ కు సన్నిహితుడు, సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత కూడా అయిన రాఘవ లారెన్స్ టీవీకే అభ్యర్థిగా పోటీ చేస్తారని గత కొన్ని రోజులుగా విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.
జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఒకే రోజున విడుదలైతే.. ఆ రెండింటిలో మీరు ముందుగా ఏ సినిమా అంటే ఎవరి సినిమా చూస్తారన్న ప్రశ్నకు.. లోకేష్ చాకచక్యంగా ఇద్దరి సినిమాలనూ ఒకే రోజు చూస్తానని బదులిచ్చారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.