పేద సీఎం జగన్ విదేశీ పర్యటన ఖర్చెంతో తెలుసా?!

Publish Date:Sep 8, 2023

Advertisement

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 2 శనివారం రాత్రి 9.30 గంటలకు తన సతీమణి భారతితో కలిసి జగన్ లండన్‌  పర్యటనకు వెళ్లారు. ఈ పర్యటన పూర్తిగా సీఎం జగన్ తన వ్యక్తిగత పర్యటన. అక్కడే ఉంటున్న తమ పిల్లలు హర్షారెడ్డి, వర్షా రెడ్డిలతో  గడిపేందుకు చేస్తున్న పర్యటన. సెప్టెంబర్ 11న సీఎం జగన్ తిరిగి మళ్లీ రాష్ట్రానికి రానున్నారు. అప్పటి వరకూ జగన్ అక్కడి నుండే  పాలన సాగించనున్నారు. అయితే, జగన్ లండన్ పర్యటన ఖర్చు, ఆయన ప్రయాణ వివరాలు, వ్యక్తిగత పర్యటనకు ప్రభుత్వ ధనం వినియోగం ఇదే రాజకీయ వర్గాలలో ఆసక్తికర చర్చ జరుగుతుంది. దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా జగన్ నిలిచిన సంగతి తెలిసిందే. అటువంటి ధనిక ముఖ్యమంత్రి విదేశీ పర్యటన అంతకు మించి లగ్జ్యూరియస్ గానే ఉంటుంది అందులో సందేహం లేదు. ఆ విషయాన్నే వైసీపీ నేతలు మళ్లీ మళ్లీ చెబుతూ.. జనం సొమ్ముతో జల్సాలు చేసే సీఎం కాదు మా జగన్ అంటూ కీర్తిస్తున్నారు. ఈ సందర్భంగా వారు పలు విషయాలను గుర్తు చేసుకుంటున్నారు. జనానికి గుర్తు చేస్తున్నారు.  ప్రభుత్వ సొమ్ముతో జల్సాలు చేసే సీఎం కాదని, కేవలం రూ.20 విలువ చేసే వాటర్ బాటిల్ మాత్రమే తాగుతారని, సీఎంగా జీతాన్ని కూడా జగన్ త్యాగం చేశారని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. తానో సర్వసంగ పరిత్యాగిననీ,   పేదల పక్షపాతినని సందర్భం వచ్చినా రాకపోయినా.. సందర్భం ఉన్నా, లేకపోయినా  చెప్పుకుంటూ జగన్ కూడా తన భుజాలను తానే చరుచుకోవడం కూడా కద్దు.  అయితే  అదే సీఎం ఆ మధ్య తాడేపల్లి నుండి తెనాలి వరకూ జస్ట్ 28కిలో మీటర్ల  రోడ్డు ప్రయాణానికి కూడా హెలికాఫ్టర్ పై వెళ్లారు. అప్పుడే దానిపై ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోశాయి. ఆ తర్వాత అమరావతి రాజధానిలో తన ఇంటికి అత్యంత సమీపంలో జరిగిన ఇళ్ల శంకుస్థాపన కార్యక్రమానికీ హెలికాప్టర్లోనే వెళ్లారాయన.  జస్ట్ పది నిమిషాల రోడ్డు ప్రయాణానికి కూడా హెలికాఫ్టర్ లో వెళ్లిన పేద సీఎం జగన్ మోహన్ రెడ్డి అంటూ నెటిజన్లు ఓ రేంజ్ లో ఆయనను ట్రోల్ చేశారు.
అదలా ఉండగా  ఇప్పుడు జగన్ లండన్ పర్యటన ఖర్చు కూడా విమర్శల పాలవుతోంది. జగన్ దంపతులు ప్రత్యేక విమానంలో లండన్ వెళ్లారు. అది కూడా ఏదో ఆషామాషీ ఫ్లైట్ కాదు ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన విమానాలలో ఒకటైన ఎంబ్రాయెర్ లినేజ్ 1000 ఫ్లైట్ . 435 కోట్ల రూపాయల విలువైన ఈ విమానంలో సుమారు 19 మంది ప్రయాణికులు ప్రయాణించొచ్చు. ఈ విమానం అద్దె గంటకు సుమారు 14 వేల 850 డాలర్లు. మన కరెన్సీలో చూస్తే గంటకు సుమారు 2 లక్షల 71 వేలు. విజయవాడ నుంచి లండన్ వెళ్లేందుకు సుమారు 11 గంటల సమయం పడుతుంది.. అలాగే అటు నుంచి రావడానికి మరో 11 గంటలు పడుతుంది. దీంతో పాటు ఇంధనం నింపుకోవడానికి నిలిపే సమయానికి కూడా అద్దె కట్టాల్సిందే. ఫ్లైట్ ఫ్యూయల్ అండ్ ఆపరేషన్ కాస్ట్ కూడా అద్దెకి తీసుకున్న వారే చెల్లించాలి. ఈ లెక్కన చూస్తే  జగన్  లండన్ పర్యటనకు ఒక్క విమాన ఖర్చు రూ.40 కోట్ల పైమాటే.

అంతేకాదు, ఒకవేళ విమానాన్ని పర్యటన మొత్తం తనతో ఉంచుకోవాలని అనుకుంటే అక్కడ దానికి పార్కింగ్ ఛార్జీలు, ఫైలట్ మెయింటనెన్స్, ఇతరత్రా ఖర్చులు కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఈ లెక్కన చూస్తే ఈ ఖర్చు మరో 10 లేక 20 కోట్లు పెరిగిపోతుంది. జగన్ వ్యక్తిగత పర్యటనకు వెళ్లినా ఈ ఖర్చు మొత్తం ప్రభత్వ ఖజానా నుండే  చెల్లిస్తారన్న విషయం ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు.  ఈ క్రమంలో తాను పేద సీఎంను అని.. పేదల పెన్నిధిని అంటూ జగన్ చెప్పుకోవడం, ఆయన పార్టీ నేతలు తానతందాన అనడం ఎవర్ని మభ్య పెట్టడానికనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే జగన్ పర్యటనపై టీడీపీ అధినేత చంద్రబాబు సెటైర్లు వేశారు. పేద సీఎం తన కుమార్తెపై ప్రేమ చూపేందుకు  రూ.40 కోట్లు ఖర్చు పెట్టారు,  కానీ ప్రజల పనులు మాత్రం చేయరు అని చంద్రబాబు ధ్వజమెత్తారు. జగన్ పేదవాళ్లు చేయాల్సిన పనులు చేస్తున్నారా అంటూ నిలదీశారు.

మరోవైపు సోషల్ మీడియాలో కూడా జగన్ లండన్ పర్యటన వ్యయంపై  తెగ ట్రోల్స్ వస్తున్నాయి. అనగనగా ఓ పేదవాడు.. వాడి ఇంట్లో డ్రైవర్లు, పనిమనుషులు, వంట మనిషి అందరూ పేదవారే అంటూ సాగే ఓ సినిమా వీడియోతో సీఎంను తెగ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. జగన్ గతంలో దావోస్ కు వెళ్ళినపుడు కూడా ప్రభుత్వ ఖర్చుతో అత్యంత విలాసవంతమైన విమానంలోనే వెళ్లారు. ప్రయాణికుల విమానంలో బిజినెస్ క్లాస్లో ప్రయాణించడమూ ఆడంబరమే అవుతుందని ఆయన భావిస్తారేమో పాపం. అందుకే సొంతంగా అత్యంత విలాసవంతమైన విమానాన్ని అద్దెకి తీసుకొని సతీసమేతంగా కుమార్తెల వద్దకు వెళ్లారు ఈ పేద సీఎం.

By
en-us Political News

  
స్థానిక  సన్నాహాలపై తెలుగుదేశం కూటమికి చెందిన దాదాపు 45 వేల మంది ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు,  కార్యకర్తలతో  సీఎం చంద్రబాబు ఈ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీపై చంద్ర నిప్పులు చెరిగారు.
కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో 4-0తో ఎన్డీఏ క్లీన్ స్వీప్.!
జగన్‌ తాను మళ్లీ  అధికారంలోకి వస్తానంటూ జగన్ 2.o అంటూ చేసిన వ్యాఖ్యలకు పవన్ కల్యాణ్ మేం 10x చూపిస్తామంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.  తెలుగుదేశం కూటమి ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ జగన్ చేసిన హెచ్చరికలకు పవన్ కల్యాణ్  దీటుగా ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్ పొలిటికల్ సర్కిల్స్ లోనూ, సోషల్ మీడియాలోనూ కూడా పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది.  
పులివెందుల నియోజకవర్గ పరిధిలో కూటమి అభ్యర్థులు స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. దశాబ్దాల కాలంగా ఎలాంటి ప్రతిఘటన లేకుండా ఏకపక్షంగా జగన్ కు పట్టుఉన్న నియోజకవర్గం పులివెందుల. అటువంటి పులివెందులలో ఎంపీటీసి జడ్పీటీసి స్థానాలను టీడీపీ  ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది.
2019 ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన తర్వాత   శైలిని ఒకింత మార్చుకున్నారు. 2024 ఎన్నికల ముందు వరకూ ఆయన పార్టీ నేతలు నోటి దురుసు ప్రదర్శించడాన్ని ప్రోత్సహించారు కానీ, స్వయంగా తాను ఒకింత సహనం చూపారు. అంత మాత్రాన రాజకీయ విలువలతో మృదు విమర్శలు చేశారని కాదు కానీ, అధికారంలోకి రావడానికి ముందున్నంత దూకుడు లేదని చెప్పాల్సి ఉంటుంది.
వైయస్ జగన్ ఇలాకాలో టీడీపీ 40 ఏళ్ళ చరిత్రను తిరగాసింది.
రాజకీయ కక్షలను పక్కనపెట్టి, రాష్ట్రాభివృద్ధి, స్థానిక స్వపరిపాలన బలపడే దిశగా అన్ని పార్టీలు అడుగులు వేయాలి. ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుంటూ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పారదర్శకమైన ఎన్నికలను నిర్వహించడమే ఏ ప్రభుత్వానికైనా, వ్యవస్థకైనా అసలైన పరీక్షగా నిలుస్తుంది.
గతంలో స్థానిక ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న దౌర్జన్యాలు, హింసాత్మక ఘటనలకు సంబంధించిన వీడియోలను ప్రదర్శించి, నాడు జగన్ హయాంలో అరాచకం ఏ రకంగా స్వేరవిహారం చేసిందో చూపి మరీ ఆ పార్టీ తీరును దుయ్యబట్టారు.  
వందలాది మంది కొత్త వ్యక్తులు వస్తే తనకు  ప్రాణహాని ఉందని, కెమెరాలు, ఫోటోలతో ఇంటి భద్రత బయటపడుతుందని జగన్  షర్మిల కుమార్తె వివాహం ఎలహంక ప్యాలెస్ లో వద్దనడానికి కారణంగా తన లేఖలో పేర్కొన్నారు. అయితే దీనికి వైఎస్ కుటుంబ సభ్యులు, షర్మిల కుటుంబం తప్పుపడుతోంది. ఈ నేపథ్యంలో   షర్మిల కుటుంబ సభ్యులు జగన్ కు సంధించిన లేఖాస్త్రంలో  వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన కుటుంబ వేడుకలను ప్రస్తావిస్తూ.. జగన్ ను వైఎస్సార్ కంటే గొప్పవాడివా అంటూ నిలదీశారు.
అధికారిక భేటీ ముసుగులో జరిగిన ఈ గోప్యతా ఉల్లంఘన ఉదంతం ఒక్కసారిగా రాష్ట్రంలో పొలిటికల్ హీట్ ను పెంచేసింది. ఒక వార్తా ఛానెల్‌కు ఇచ్చిన  ఇంటర్వ్యూలో డీకే శివకుమార్ ఈ అంశానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.
జడ్పీ చైర్మన్ కావాలంటే ముందుగా జెడ్పీటీసీగా విజయం సాధించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కదిరి నియోజకవర్గంలోని నల్ల చెరువు జెడ్పీటీసీ స్థానంలో పరిటాల రవి నామినేషన్ వేయనున్నారు.  పరిటాల శ్రీరామ్  విజయం కోసం క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తూ భారీ విజయంపై తెలుగుదేశం కన్నేసింది.  
అధినేత జగన్ ప్రెస్ మీట్ పెట్టి మరీ గతంలోనే ఏపీలో స్థానిక ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగదని జోస్యం చెప్పారు.  అల్లర్లు జరుగుతాయని హెచ్చరికలు జారీ చేశారు. చివరకు ఆయన అన్నట్లుగానే జరిగింది. అల్లర్లకు కారణం ఎవరన్నది పక్కన పెడితే.. వైసీపీ సుప్రీం కోర్టుకు వెళ్లి మరీ మునిసిపోల్స్ కు రీ షెడ్యూల్ సాధించింది.
అధికారికంగా ఇటు షర్మిల కానీ, అటు జగన్ కానీ వివాహ వేడుక బెంగళూరు ప్యాలెస్ విషయంపై మాట్లాడలేదు. అయితే మీడియా కథనాల ఆధారంగా వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మాత్రం తగుదునమ్మా అంటూ మీడియా ముందుకు వచ్చి.. జగన్ నివాసం ఉంటున్న బెంగళూరు ప్యాలెస్ ఫంక్షన్ హాలేమీ కాదు.. పెళ్లిళ్లకు వేదికగా ఇవ్వడానికి అంటూ వ్యాఖ్యలు చేశారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.