Publish Date:Apr 16, 2024
గత ఏడాది డిసెంబర్ లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ దాదాపు క్లీన్ స్వీప్ చేసింది. జిల్లాలో ఒక్క స్థానం మినహా మిగిలిన అన్ని అసెంబ్లీ స్థానాలలోనూ కాంగ్రెస్ విజయకేతనం ఎగురవేసింది. ఆ తరువాత ఇటీవల బీఆర్ఎస్ తరఫున జిల్లా నుంచి గెలిచిన ఆ ఒక్క ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
అయితే ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ బ్రహ్మాండంగా పెర్మార్మ్ చేసిన క్రెడిట్ అంతా పొంగులేటికే చెందుతుంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఆయన ఖమ్మం జిల్లా మొత్తం కాంగ్రెస్ స్వీప్ ఖాయమనీ, ఆ బాధ్యత తాను తీసుకుంటానని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు మరో నెల రోజులలో జరగనున్న లోక్ సభ ఎన్నికలలో రాష్ట్రంలో వందకు వంద శాతం కాంగ్రెస్ గెలుచుకుంటుందన్న ధీమా ఇన్న సీటు ఏదైనా ఉందంటే అది ఖమ్మం లోక్ సభ నియోజకవర్గమే. ఆ నియోజకవర్గ పరిధిలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. జిల్లా నుంచి రేవంత్ కేబినెట్ లో ముగ్గురు మంత్రులు ఉన్నారు. దీంతో ఖమ్మం లోక్ సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలుపు నల్లేరు మీద బండి నడకే అన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. దీంతో ఖమ్మం స్థానం సీటు విషయంలో కాంగ్రెస్ లో విపరీతమైన పోటీ ఏర్పడింది.
ప్రస్తుతం ఖమ్మం ఎంపీ టికెట్ రేసు కాంగ్రెస్ లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. అయితే అధిష్ఠానం కూడా ఖమ్మం టికెట్ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నది. పోటీలో ఉన్న సీనియర్ నేతలను ఒక్కరొక్కరినే ఫిల్టర్ చేసుకుంటూ వచ్చింది. ఇప్పుడు ప్రధానంగా ఈ టికెట్ కోసం పోటీ పడుతున్న వారిలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని , మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి పేర్లు మాత్రమే మిగిలాయి. రాష్ట్ర కాంగ్రెస్ లో ఇద్దరూ కీలక నేతలే. ఈ నేపథ్యంలోనే ఖమ్మం సీటు విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఇప్పటి వరకూ ఏ నిర్ణయం తీసుకోలేదని అంటున్నారు. అయితే విశ్వసనీయంగా అందుతున్నే సమాచారం మేరకు మల్లు నందిని, పొంగులేటి ప్రసాద్ రెడ్డిలలో హైకమాండ్ పొంగులేటి ప్రసాద్ రెడ్డి వైపే మొగ్గు చూపుతోంది.
కాంగ్రెస్ అంతర్గతంగా నిర్వహించిన సర్వేలలో పొంగులేటి ప్రసాద్ రెడ్డికే ఎక్కువ మద్దతు ఉందని తేలడం ఇందుకు ఒక కారణంగా కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఇక అన్నిటి కంటే ప్రధాన కారణం ఏమిటంటే.. అసెంబ్లీ ఎన్నికలలో జిల్లాలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేస్తుందని ముందుగానే ప్రకటించి ఆ బాధ్యత తీసుకున్న పొంగులేటికి క్రెడిట్ ఇవ్వడం సమంజసమని కాంగ్రెస్ హైకమాండ్ భావించడమేనని చెబుతున్నారు. కాంగ్రెస్ వర్గాల సమాచారం ప్రకారం ఖమ్మం టికెట్ మంత్రి పొగులేటి సోదరుడు ప్రసాద్ రెడ్డికి ఖరారైపోయిందనీ, ఇహనో, ఇప్పుడో ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ponguleti-prasadreddy-confirm-khammam-congress-loksabha-ticket-39-173929.html
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
తట్టంచావడి నియోజకవర్గం నుంచి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన పోటీ చేసిన మరో స్థానమైన మంగళంలోనూ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.