రాజంపేట కూటమిలో అంతర్యుద్ధం!

Publish Date:Mar 8, 2026

Advertisement

 

రాయలసీమ ముఖద్వారం, అన్నమయ్య జిల్లా రాజకీయ కేంద్రం రాజంపేటలో ఇప్పుడు అసలైన 'రాజకీయం' మొదలైంది. ప్రత్యర్థులతో పోరాటం కంటే.. సొంత గూటిలోనే సాగుతున్న 'ఆధిపత్య పోరు' ఇప్పుడు నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది. టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి చమర్తి జగన్ మోహన్ రాజు, జనసేన పార్లమెంట్ ఇన్చార్జి శ్రీనివాసరాజుల  మధ్య సాగుతున్న అంతర్యుద్ధం కూటమి శ్రేణులను అయోమయంలో నెట్టడమే కాకుండా, రాబోయే స్థానిక సమరానికి సవాలుగా మారింది.

*ఆధిపత్య పోరు

టిడిపి ఇన్చార్జి ​చమర్తి జగన్ మోహన్ రాజు గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీని అంటిపెట్టుకుని, కష్టకాలంలో కేడర్‌కు అండగా నిలిచిన నాయకుడుగా గుర్తింపు తెచ్చుకున్నారు. పార్టీ ఇన్‌చార్జ్‌గా క్షేత్రస్థాయిలో యంత్రాంగాన్ని నిర్మించుకున్న ఆయన, రాజంపేటపై తనదే పైచేయి అని భావిస్తున్నారు. మరోవైపు, మాజీ అధికారిగా పరిపాలనా అనుభవం, జనసేన వైపు నుంచి వచ్చిన మద్దతుతో యల్లటూరు  శ్రీనివాసరాజు తనదైన ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. విద్యావంతుడు, మృదుస్వభావి అనే ఇమేజ్‌తో ఆయన కొత్త తరం ఓటర్లను ఆకర్షిస్తూ ముందుకు సాగుతున్నారు.

*​అసలు చిచ్చు ఎక్కడ?

​రాజంపేటలో సామాజికంగా బలంగా ఉన్న 'రాజుల' వర్గంలో అగ్రస్థానం కోసం జరుగుతున్న పోరాటమే దీనికి మూలకారణమని పరిశీలకులు భావిస్తున్నారు.


*​ప్రోటోకాల్ రచ్చ: 

ప్రభుత్వ కార్యక్రమాలు జరిగినా, పార్టీ వేదికలు ఏర్పాటు చేసినా 'ముందువరుస' ఎవరిది? అనే అంశంపై ఇరు వర్గాల మధ్య సోషల్ మీడియా వేదికగా యుద్ధం నడుస్తోంది. రాజంపేట జిల్లా సాధన ఉద్యమం నుంచి స్థానిక అభివృద్ధి పనుల వరకు ఏ చిన్న పని జరిగినా "అది మా నాయకుడి చలవే" అంటూ పోటాపోటీగా ఫ్లెక్సీలు వెలుస్తున్నాయి. ఈ పరిస్థితులు కూటమి క్యాడర్ పై ప్రభావం చూపుతోంది.ఒకే కూటమి  కింద ఉన్నప్పటికీ, కార్యకర్తలు "జగన్ మోహన్ రాజు వర్గం", "శ్రీనివాసరాజు వర్గం"గా విడిపోవడం భవిష్యత్తులో కూటమికి గొడ్డలిపెట్టులా మారే ప్రమాదం ఉంది.

*​వైఎస్సార్‌సీపీకి 'అయాచిత' బలం!

​ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న వైఎస్సార్‌సీపీకి ఈ అంతర్గత కలహాలు వరంగా మారాయి. ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్ రెడ్డి వంటి ఉద్ధండులను ఢీకొట్టాలంటే కూటమి ఐక్యంగా ఉండాలి. కానీ, ఇక్కడ "ఇంటి గుట్టు లంకకు చేటు" అన్న చందంగా ఒకరిని ఒకరు నష్టం పరుచుకునే  క్రమంలో ప్రత్యర్థికి అవకాశం ఇస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

*​అధిష్టానం మౌనం..
 
​ఈ ఆధిపత్య పోరుపై అటు అమరావతిలోని టీడీపీ పెద్దలకు, ఇటు జనసేన అధినాయకత్వానికి పూర్తి సమాచారం ఉంది. అయితే, ఇద్దరినీ వదులుకోలేక, అలాగని ఒకరిని వారించలేక అధిష్టానం మౌనం వహిస్తోందనే ప్రచారం జరుగుతోంది. ఈ మౌనం రాజంపేటలో కూటమి పునాదులను బలహీనపరుస్తోందని సీనియర్ రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

రాజంపేట రాజకీయ యవనికపై ఈ ఇద్దరు 'రాజుల' పోరు ఎటు దారితీస్తుందో చూడాలి. ఒకరు అనుభవాన్ని నమ్ముకుంటే, మరొకరు మారుతున్న సమీకరణాలను నమ్ముకున్నారు. ఈ ఇద్దరూ కలిసి నడిస్తే రాజంపేటలో కూటమికి తిరుగుండదు.. కానీ, నేనే రోజు..నేనే రాజు అన్న చందంగా ఎవరికి వారు సాగితే మాత్రం ఫలితం మరోలా ఉండే అవకాశం ఉంది

By
en-us Political News

  
జన్ సూరాజ్ పార్టీని స్థాపించి బరిలోకి దిగిన విషయం తెలిసిందే. అయితే ఆ ఎన్నికలలో ప్రశాంత్ కిశోర్ ఎన్నికల వ్యూహాలు ఘోరంగా దెబ్బతిన్నాయి. 2014 ఎన్నికలలో మోడీ నాయకత్వంలో ఎన్డీయే ఘన విజయం సాధించడం నుంచి మొదలు పెడితే.. 2019లో ఆంధ్రప్రదేశ్ లో జగన్ నాయకత్వంలోని వైసీపీ, ఆ తరువాత పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ నాయకత్వంలో తృణమూల్ కాంగ్రెస్ లను అధికారంలోకి తీసుకురావడానికి తన వ్యూహాలే కారణమని తన భుజాలను తానే చరిచేసుకుని మరీ చెప్పుకున్న ప్రశాంత్ కిషోర్.. తన సొంత రాష్ట్రంలో సొంత పార్టీని గెలిపించుకోలేక చతికిల పడ్డారు.దీంతో ప్రశాంత్ కిశోర్ ప్రతిష్ఠ మసకబారింది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న తీరుపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఎండగట్టారు. అమరావతిని జగన్ నిరంతరం ప్రయత్నిస్తున్నారనీ, ఇప్పుడు కొత్తగా మావిగన్ ప్రతిపాదనను తెరపైకి తెచ్చి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆమె మండిపడ్డారు
ఏపీకి రాజధాని ఏది? అమరావతి శాశ్వతమా లేక మావిగాన్ అంటూ జగన్ చేసిన ప్రతిపాదనతో మళ్లీ రాజధానిపై జనంలో అనుమానాలు మొదలయ్యాయా? అన్న చర్చ మొదలైంది. ఏపీ రాజధాని విషయంలో మరో ప్రయోగం మొదలుకాబోతోందా? అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిబా ఫూలే 200వ జయంతి వేడుకలు దేశరాజధానిలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పార్లమెంటు ఆవరణలోని ప్రేరణా స్థల్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దేశాధినేతలు, రాజకీయ దిగ్గజాలు ఒకే వేదికపైకి వచ్చారు. రాజకీయంగా ప్రత్యర్థులుగా ఉండే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ కార్యక్రమంలో పాల్గొని ఫూలే విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు.
బీజేపీకి ఓటేస్తే.. సామాజిక న్యాయానికి పాడె కట్టడమేనన్నారు. రాష్ట్రంలోని బీజేపీని అడుగుపెట్టనీయవద్దని, ఒక్క సీటు కూడా వారికి ఇవ్వకుండా తమిళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పరకాల కోరారు.
అమరావతికి సాక్షాత్తూ పార్లమెంటు సాక్షిగా చట్టబద్ధ రాజధానిగా గుర్తింపు లభించిన తరువాత కూడా సజ్జల మౌలిక వసతులు లేని ప్రాంతంలో వేలకోట్టు కుమ్మరిస్తోందంటూ తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు. ఇప్పుడు కూడా అమరావతి అభివృద్ధి కళ్ల ముందు సాక్షాత్కరిస్తున్నా.. గ్రాఫిక్స్ రాజధాని అంటూ పాత పాటే పాడారు సజ్జల.
ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ లో జరిగిన ఈ సమావేశం అత్యంత ఆత్మీయంగా, భావోద్వేగాల మధ్య సాగింది. చాలా కాలం తర్వాత తన పాత మిత్రుడిని కలిసిన జీవన్ రెడ్డి ఒ ఉద్వేగానికి లోనయ్యారు.
గత కొంతకాలంగా తనపై సాగుతున్న అభిశంసన ప్రక్రియ, అలాగే నివాసంలో లభించిన లెక్కకు రాని నగదు వివాదం నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని భావిస్తున్నారు.
రాజ్యసభ ఎంపీగా ప్రమాణం చేసిన అనంతరం నితీశ్ కుమార్ ప్రస్తుతం తాను నిర్వహిస్తున్న బీహార్ ముఖ్యమంత్రి పదవికి మరో మూడు నాలుగు రోజుల్లో రాజీనామా చేయనున్నట్లు వెల్లడించారు. తాను లేని పక్షంలో రాష్ట్ర బాధ్యతలను కొత్త ముఖ్యమంత్రి, మంత్రుల బృందం సమర్థవంతంగా నిర్వహిస్తుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు.
వైసీపీ సోషల్ మీడియా మాజీ కోఆర్డినేటర్ సజ్జల భార్గవ్ రెడ్డిపై జారీ అయిన లుక్ అవుట్ సర్క్యులర్‌ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. విచారణలో భాగంగా న్యాయమూర్తులు రాజకీయ ఫ్లెక్సీలపై స్పందిస్తూ.. ఎవరిని ధ్వంసం చేయాలని చూస్తున్నారు? 2029లో రాష్ట్రాన్నా లేక ప్రజలనా? అంటూ ప్రశ్నించారు.
దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో తమకు ఉన్న అనుబంధం ఎంతో గొప్పదని చెప్పుకుంటూ కన్నీరుమున్నీరయ్యారు. వైఎస్ మరణం వెనుక వైఎస్ జగన్ హస్తం ఉందంటూ అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై బొత్స తీవ్రంగా స్పందించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదానికి గురైన రోజున జరిగిన పరిణామాలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
జీవన్ రెడ్డి, కేటీఆర్ లు సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ సూచన మేరకే సహచరులతో కలిసి జీవన్ రెడ్డిని సాదరంగా ఆహ్వానిం చేందుకు ఆయన నివాసానికి వచ్చినట్లు చెప్పారు. 2014 ఎన్నికలకు ముందే కేసీఆర్ జీవన్ రెడ్డిని బీఆర్‌ఎస్‌లో చేరాలని ఆహ్వానించారన్నారు.
ల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవిపై ఎన్నికల అక్రమాల ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. మిరాకిల్ సాఫ్ట్ వేర్ సంస్థ ద్వారా ఉద్యోగుల ఖాతాల్లో భారీగా నగదు జమ చేసి.. ఆ నగదును ఎన్నికల ఖర్చులకు మళ్లించారనే ఫిర్యాదు ఈసీకి చేరింది. దీనిపై సమగ్ర విచారణకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఇక వేళ ఆ ఆరోపణలు నిజమని రుజువైతే.. ఆమె పదవికి ముప్పు ఉండొచ్చని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.